Home Health ఆకర్షణీయమైన మెడ కోసం ఈ చిట్కాలు తప్పనిసరి ?

ఆకర్షణీయమైన మెడ కోసం ఈ చిట్కాలు తప్పనిసరి ?

0

కొంతమంది ఎంత అందంగా ఉన్నాసరే మెడపై నలుపుదనంతో పదిమందిలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మెడపై నలుపుదనం వారి అందాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకునే గృహ చిట్కాలను పాటించడం వలన మెడపై నలుపుదనం తగ్గి ఆకర్షణీయమైన, అందమైన మెడ మీ సొంతం అవుతుంది.

కలబంద:

Tips to reduce black around the neckకలబంద నేచురల్ స్కిన్ క్యూర్ ఇది చర్మానికి తగినంత తేమను అందిస్తుంది . ఇది స్కిన్ కలర్ ను లైట్ చేస్తుంది. మరియు వివిధ రకాల స్కిన్ స్పాట్స్ ను తగ్గిస్తుంది. అలోవెరాలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్లకంగా ఉంటాయి . మరియు ఇతర కాంపోనెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని రిపేర్ చేస్తాయి కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేస్తాయి. అవోవెరా నుండి జెల్ తీసి నేరుగా మెడకు అప్లై చేయాలి . అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి 20 నిముషాలు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే చాలా త్వరగా ఫలితం చూపుతుంది.

బాదం :

బాదంలో విటమిన్స్ అధికంగా ఉంటాయి . ఇవి స్కిన్ హెల్త్ కు సహాయపడుతాయి . చర్మానికి అవసరం అయ్యే పోషణను అందిస్తాయి . మెడ చుట్టూ ఉన్న నలుపును నివారించుకోవడానికి బాదంను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు . సింపుల్ హోం రెమెడీస్, అర చెంచా బాదం పౌడర్, ఒక చెంచా మిల్క్ పౌడర్ మరియు ఒక చెంచా తేనె మిక్స్ చేసి ఈ పేస్ట్ ను మెడ చుట్టూ పట్టించాలి . అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

వాల్ నట్స్ :

వాల్ నట్స్ లో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి తగినంత పోషణను అందిస్తాయి. ఇది చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది హెల్తీ స్కిన్ కు చాలా అవసరం . డార్క్ స్కిన్ నివారించుకోవడానికి వాల్ నట్ మరియు పెరుగు మిశ్రమంతో స్కబ్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . వాల్ నట్ పౌడర్ కు కొద్దిగా పెరుగు జోడించాలి. ఈపేస్ట్ ను మెడ చూట్టూ అప్లై చేయాలి. కొన్ని నిముషాలు స్క్రబ్ చేసి, డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో లేదా రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కీరదోసకాయ:

కీరదోసకాయ నేచురల్ వైట్ స్కిన్ అందివ్వడానికి అద్భుతంగా సహాయపడుతుంది. కీరదోసకాయ జ్యూస్ ను మెడ చుట్టూ అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో లేదా రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. మరో పద్దతి కీరదోస రసం మరియు నిమ్మరసం సమంగా తీసుకొని మిక్స్ చేసి కాటన్ బాల్స్ డిప్ చేసి మెడ చుట్టూ అప్లై చేసి 10 నిముషాల పాటు మర్దన చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఈ రెమెడీని కొన్ని రోజుల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది

నిమ్మరసం:

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ . నిమ్మలో ఉండే విటమిన్ సి డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. స్కిన్ టోన్ ను మార్చుతుంది. అందువల్ల, నిమ్మరసం కూడా డార్క్ స్కిన్ తొలగించడానికి ఉపయోగించుకోవచ్చు. నిమ్మరసంలో కాటన్ బాల్స్ ను డిప్ చేసి మెడ చుట్టూ అప్లై చేయాలి. నిమ్మరసంను నీటిలో వేసి మిక్స్ చేసి మెడ చూట్టూ అప్లై చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం అప్లై చేసాక నేరుగా ఎండలో తిరగకూడదు.

ఓట్స్ :

ఓట్స్ గ్రేట్ స్కిన్ స్క్రబ్బర్ గా పనిచేస్తుంది. ఇది చర్మానికి ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. ఇది డార్క్ స్కిన్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఓట్స్ పౌడర్ తీసుకొని అందులో టమోటో గుజ్జు వేసి మిక్స్ చేసి మెడ చుట్టూ అప్లై చేసి 20 నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. చివరగా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి . ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడ :

బేకింగ్ సోడా నేచురల్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ గా మరియు క్లెన్సర్ గా పనిచేస్తుంది . నిదానంగా డార్క్ స్కిన్ ని తొలగిస్తుంది. బేకింగ్ సోడా మరియు నీళ్ళ యొక్క కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది హైపర్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. మూడు బాగాల బేకింగ్ సోడాలో ఒక బాగం నీళ్ళు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మెడకు పట్టించి, ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆరెంజ్ పీల్ :

ఆరెంజ్ లో లాగే ఆరెంజ్ తొక్కలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మం యొక్క రంగను మార్చడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్కిన్ బ్లీచింగ్ కోసం ఆరెంజ్ తొక్క బాగా పనిచేస్తుంది. ఆరెంజ్ తొక్కను ఎండలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఈ పొడికి కొద్దిగా పాలు మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి . ఈ పేస్ట్ ను మెడచుట్టూ పట్టించి 20 నిముషాలు డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బంగాళదుంపలు :

బంగాళాదుంపలో బ్లీచింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది డార్క్ స్కిన్ కంప్లెక్షన్ ను మార్చుతుంది . పొటాటోను స్లైస్ గా కట్ చేసి, ఆ స్లైస్ ను మెడ చుట్టూ మర్ధన చేయాలి. 15 నిముషాల తర్వాతచల్లటి నీటితో కడిగేసుకోవాలి.

శెనగపిండి :

శెనగపిండి స్కిన్ నలుపుకి అద్భుతంగా పనిచేస్తుంది . ఇది డార్క్ స్కిన్ ప్యాచెస్ ను తొలగిస్తుంది. శెనగపిండికి కొద్దిగా పసుపు మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. రెండు టీ స్పూన్ల శెనగపిండి కి ఒక చిటికెడు పసుపు మిక్స్ చేయాలి.దానికి కొద్దిగా నీళ్ళు మిస్ చేసి పేస్ట్ లా చేసి డార్క్ ప్యాచులున్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

 

Exit mobile version