Home Health చెవి నొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి

చెవి నొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి

0

చెవి నొప్పిని, చెవిపోటు అని కూడా పిలుస్తారు, వివిధ ఆరోగ్య పరిస్థితులకు ఇది ఒక సాధారణ లక్షణం. ఇది ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేయవచ్చు. చాలా సందర్భాలలో నొప్పి ఒక పెద్ద సమస్యగా పరిగణింపబడదు , కానీ తీవ్రమైన నొప్పి ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకండి.

Tips to reduce ear painతరచూ చెవి నొప్పి ఇతర సాధారణ సంకేతాలు మరియు లక్షణాలతో కలిసి ఉంటుంది మరియు అది స్వయంగా కొన్ని వ్యాధుల యొక్క సంకేతం/లక్షణం. చెవి నొప్పి మొండిగా లేదా చిన్నగా లేదా తీవ్రమైన లేదా పదునుగా ఉండవచ్చు. కొన్ని ఇంటి చిట్కాలతో చెవి నొప్పిని తగ్గించుకుందాం.

ఆలివ్ ఆయిల్ :

చెవి నొప్పిని తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేయాలి. తర్వాత క్లీన్ గా ఉన్న బాటిల్లో పోసి చెవి నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చగా చెవిలో రెండు మూడు చుక్కలు వదలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వెచ్చదనం కలిగించడం(కాపడం):

వేడినీటిలో డిప్ చేసిన టవల్ తో నొప్పి ఉన్న ప్రదేశంలో కాపడం. వార్మ్ కంప్రెసర్ చెవి నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. వెచ్చదనం నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఏదైనా వాపు ఉన్న తగ్గుముఖం పడుతుంది. జలుబు వల్ల చెవి నొప్పి ఉంటే కూడా నొప్పిని తగ్గిస్తుంది.

ముక్కును క్లియర్ చేయాలి:

ముక్కు మూసుకుపోవడం దాంతో పాటు చెవినొప్పి ఉన్నట్లైతే , అది జలుబు వల్ల వచ్చిన నొప్పి అని గుర్తించాలి . మొదట ముక్కును క్లియర్ చేసుకుంటే, చెవునొప్పి తగ్గుతుంది. అందుకు ఆవిరి పట్టడం చేయవచ్చు.

గడ్డంతో వ్యాయామం:

చెవి నొప్పి ఉన్నప్పుడు కొన్ని సున్నితమైన, సులభమైన సింపుల్ వ్యాయామాలు చేసినప్పుడు ఇయర్ కెనాల్స్ తెరచుకుంటాయి. అందుకు మీరు గడ్డం వద్ద కదలికలు ఏర్పడేలా చేయాలి. అందుకు నోరు పెద్దగా తెరచి కదిలించాలి. అలాగే నోరూ మూసుకొని, ముందుకు వెనకకు గడ్డం కదిలించాలి.

ఉల్లిపాయను :

చెవిలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, ఉల్లిపాయను ఉపయోగించవచ్చు. చెవినొప్పితో పాటు, వాపు ఉన్నప్పుడు, ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసి, చెవి నొప్పి ఉన్న ప్రదేశంలో బయటవైపుగా దీన్ని అప్లై చేయాలి.

వెల్లుల్లి మరియు ముల్లేయన్ ఫ్లవర్:

మీ వద్ద ఆలివ్ ఆయిల్ లేనప్పుడు ఇలా చేయవచ్చు. వెల్లుల్లి నూనె మరియు ముల్లేనియన్ ఫ్లవర్ ఆయిల్ రెండింటిని మిక్స్ చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్ మైక్రోబ్స్ ను నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ల్యావెండర్ ఆయిల్:

చెవికి బయటవైపున ఇరిటేషన్ గా అనిపిస్తుంటే, ల్యావెండర్ ఆయిల్ ను అప్లై చేయవచ్చు.చెవి నొప్పి ఉన్నప్పుడు ల్యావెండర్ ఆయిల్ ను నొప్పి ఉన్నచోటో అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి.

విగ్లింగ్:

చెవిని పట్టి లాగడం లేదా ఇటు అటు చేత్తో కదిలించడం ద్వారా కొంచెం రిలీఫ్ అవుతుంది. పెద్దగా ఆవిలించడం విగ్లింగ్ చేయడం ద్వారా, చెవిరంద్రాల యొక్క ట్యూబ్స్ పెద్దగా తెరచుకుని లోపలికి గాలి చెరి రిలీఫ్ అంధిస్తుంది.

ఆవిరి పట్టడం మరియు యూకలిప్టస్ ఆయిల్:

నాజల్ పాస్ వేలో బ్లాక్ అయిన్ ఫ్లూయిడ్స్ క్లియర్ చేయాలంటే ఆవిరి పద్దతి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకు మరిగే నీటిలో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేసి బాగా మరిగించి తర్వాత ఆవిరి పట్టాలి. ఇది ఒత్తిడిని తగ్గించి శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తుంది.

విటమిన్ కె అధికంగా తీసుకోవాలి:

సాధారణంగా చెవినొప్పి జలుబు వల్లే ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్లో జలుబు వ్యాధినిరోధకతను ఎదుర్కొనే విటమిన్ ఎ, సి, ఇ ఆహారాలను తీసుకోవాలి.

 

Exit mobile version