వేసవి కాలం శరీరం డీహైడ్రేట్ అవకుండా తీసుకునే పానీయాలు

ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడి తట్టుకోలేక మనకు వడ దెబ్బ తగులుతుంది. పసివాళ్ళు, ముసలివాళ్ళు,తాగుబోతులు దీనికి ఎక్కువగా గురవుతారు. మన శరీరంలో వేడి అధికమవుతుంటుంది. ఎండలు, వేడి వల్ల కొంతమందికి శరీరంపై పొక్కులు, చెమటయ కాయలు వస్తుంటాయి. మరికొంతమంది అనారోగ్యానికి కూడా గురవుతుంటారు. అయితే ఈ చిట్కాలు పాటించి శరీరంలో అధిక వేడికి చెక్ పెట్టొచ్చు.

కొబ్బ‌రినీళ్లు:

Tips to reduce heat in the bodyకొబ్బ‌రినీళ్లు తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. సీజ‌న్‌లో బోండాం రేట్లు మోత మోగుతుంద‌ని వాటికి దూరంగా ఉంటే హాస్పిట‌ల్ ఖ‌ర్చు అధికంగా ఉంటుంది. అందుకే హాస్పిట‌ల్‌కు పెట్టే ఖ‌ర్చుకంటే ఆహారం, పానీయాల‌కు పెడితే ఆరోగ్యంగా ఉంటార‌ని నిపుణులు చెబుతున్నారు.

మరికొన్ని పానీయాలు :

Tips to reduce heat in the bodyకొబ్బ‌రి నీళ్ల‌తో పాటు మ‌జ్జిగ‌, గ్లూకోజ్ వాట‌ర్‌, నిమ్మ‌ర‌సం, ఎండు ఖ‌ర్జూరం నాన‌బెట్టిన నీరు, స‌గ్గు బియ్యం కాచిన నీరు ఇలా ఏవైనా స‌రే తీసుకుంటే మంచిది.

ఉప్పు చెక్కర కలిపిన నీళ్లు :

Tips to reduce heat in the bodyనీటిని వేడి చేసి అందులో చిటికెడు ఉప్పు, స్పూన్ చ‌క్కెర వేసుకొని తాగితే ఓఆర్ఎస్‌లా ప‌నిచేస్తుంది.

తాటిముంజలు :

Tips to reduce heat in the bodyప‌ల్లెల్లో ఉండేవారికి తాటిముంజలు అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా ఆరోగ్యానికి మంచే చేస్తాయి. ముంజులు తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. అందుకే సీజ‌న‌ల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది అంటుంటారు.

కొబ్బ‌రి నీటిలో గ్లూకోజ్ క‌లుపుకొని తాగ‌డం:

Tips to reduce heat in the bodyఅన్నింటిక‌న్నా ముఖ్య‌మైన‌ది ఏంటంటే కొబ్బ‌రి నీటిలో గ్లూకోజ్ క‌లుపుకొని తాగ‌డం వ‌ల్ల అల‌స‌ట‌, నీర‌సం త‌గ్గిపోతుంది. అంతేకాదు కిడ్నీ రాళ్ల స‌మ‌స్యలు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, ఊపిరితిత్తులు స‌మ‌స్య‌లు, మూత్ర‌పిండ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. సూర్య‌ర‌శ్మికి ఎక్కువ‌గా తిరిగితే త్వ‌ర‌గా డీహైడ్రేష‌న్ స‌మ‌స్య వ‌స్తుంది. అలాంట‌ప్పుడు ఈ కొబ్బ‌రి నీటిని తీసుకోవ‌డం ఉత్త‌మం.

లేత‌కొబ్బ‌రి తిన‌డం :

Tips to reduce heat in the bodyబొండంలో ఉండే లేత‌కొబ్బ‌రి తిన‌డం వ‌ల్ల కూడా శరీరాన్ని ఉష్ణోగ్రత నుండి కాపాడవచ్చు. దీంతో శ‌రీరంలోని కొవ్వుని కూడా దూరం చేయ‌వ‌చ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR