మూత్రవిసర్జన సమయంలో వచ్చే మంటను తగ్గించే చిట్కాలు

మన శరీరం వ్యర్ధమైన ఉత్పత్తులను, శరీరంలోని విషాన్ని, మరియు హానికరమైన పదార్ధాలను మలం, మూత్రం మరియు చెమట ద్వారా విసర్జిస్తుంది. ఇందుగ్గాను మన శరీరం స్వాభావికమైన వ్యవస్థలను కలిగి ఉంది. ఈ వ్యవస్థలలో మూత్ర నాళము ఒకటి. మనకున్న మూత్ర నాళము కొన్ని అవయవాల కలయిక. ఈ అవయవాలు రక్తాన్ని వడపోసి వ్యర్థాలను మూత్రం రూపంలో మూత్రమార్గం (urethra) ద్వారా బహిష్కరిస్తాయి.

Tips to reduce inflammation during urinationమూత్రం విసర్జించేటపుడు నొప్పి, మంట లేదా ఏదైనా అసౌకర్యం కలిగినపుడు, కలిగే ఆ బాధనే “మూత్రంలో మంట” లేక “బాధాకరమైన మూత్రవిసర్జన” అని పిలుస్తారు. మూత్రంలో మంటకు కొన్ని ముఖ్య కారణాలేవంటే మూత్రనాళ ప్రాంతంలో లేదా ఇతర కటి అవయవాలకు అంటువ్యాధులు సోకడం, వాపు, నిర్జలీకరణము, మూత్రపిండాల రాళ్ళు, కణితులు, మందులు మరియు రేడియోధార్మికత, ఇతర అలెర్జీల సంక్రమణలు.

Tips to reduce inflammation during urinationమూత్రవిసర్జనలో మంటకు అత్యంత సాధారణ లక్షణం ఏదంటే మూత్రం పోసేటపుడు నొప్పి కలగడం లేదా మూత్రవిసర్జన ప్రారంభించినపుడు నొప్పి కలగడం. మూత్రవిసర్జన సమయంలో నొప్పితో పాటుగా ఇంకా కొన్ని ఇతర లక్షణాలను కలిగి ఉండొచ్చు. ఆ లక్షణాలేవంటే దుర్వాసన, మూత్ర మార్గం లేదా మూత్ర విసర్జననాళం నుండి స్రావాలు కావడం, వస్తిక ప్రాంతం (pelvic area) లో ఎరుపురంగుదేలడం లేదా చికాకు కల్గించే మంట పుట్టడం మరియు ఇలాంటివే మరికొన్ని లక్షణాలు.

Tips to reduce inflammation during urinationమూత్రవిసర్జన సమయంలో మంట రావడాన్ని నివారించేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తినడం, తగినంతగా ద్రవాహారాలు త్రాగడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, మద్యం మరియు ధూమపానం మానడమో లేక కనీసం పరిమితం చేయడం మంచిది. మరియు కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

తగ్గించుకోవడానికి చిట్కాలు:

->మద్యం ఇతర మత్తుపానీయాలు సేవించకూడదు. టీ, కాఫీలు మానేయాలి.

->మాంసాహారం తగ్గించాలి.

->పొగాకు ఉత్పత్తుల వినియోగం ధూమపానం మానేయాలి .

->ఫాస్ట్‌ఫుడ్స్‌, మసాలాలు, నూనె పదార్థాలు, ఉప్పు ఎక్కువగా వాడటం వంటివి తగ్గించాలి.

->వీటిని వీలైతే పూర్తిగా మానుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.

->సాత్వికాహారం తీసుకోవాలి.

->తగినంత నీరు తాగాలి. కనీసం రోజుకు 4 లీటర్ల నీరు తాగాలి.

->ద్రవపదార్థాలు పండ్లు తాజా కూరగాయాలు ఎక్కువగా తీసుకోవాలి.

చికిత్స:

ఇన్ఫెక్షన్లు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని నిర్లక్ష్యం చేయకుండా తగు చికిత్స తీసుకోవాలి. యూరిన్ ఇన్‌కాంటినెన్స్ నివారణకు పెల్విక్ కండరాలు స్ట్రాంగ్ అవడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు ఉంటాయి. వీటిని యూరాలజిస్ట్ లేదా గైనకాలజిస్ట్ చేత తెలుసుకొని వాటిని పాటించాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR