కరోనా సోకినా తరువాత వచ్చే గొంతునొప్పిని తగ్గించే చిట్కాలు

కరోనా వైరస్ సోకిన వారికి తీవ్రమైన జ్వరంతో పాటు.. దగ్గు, ఒళ్లు నొప్పులు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే. వీటితోపాటు గొంతు సమస్య కూడా వేధిస్తుంది. వైరస్ లక్షణాలు.. జలుబు లేదా ఫ్లూ తరహాలోనే ఉంటాయి. ఈ లక్షణాల కంటే ముందుగా గొంతు నొప్పితో సమస్య మొదలవుతుంది. గొంతులో మంట, దురదగా.. వాపు ఏర్పడినట్లుగా అనిపిస్తున్నట్లయితే తప్పకుండా కోవిడ్-19గా అనుమానించాలని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు గురైన వ్యక్తుల్లో 52 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించినట్లు గణంకాలు చెబుతున్నాయి. అయితే, అన్ని గొంతు నొప్పులు ‘కోవిడ్-19’ కాకపోవచ్చని కూడా స్పష్టం చేస్తున్నారు.

గొంతునొప్పిచాలా మంది ఎక్స్పీరియెన్స్ చేసే కామన్ ప్రాబ్లమ్స్ లో పొడి దగ్గు కూడా ఒకటి. ఇది ఒక రిఫ్లెక్స్ యాక్షన్, ఎయిర్ వే లో ఉండే మ్యూకస్ నీ, ఇరిటెంట్స్ ని క్లియర్ చేస్తుంది. అయితే, ఈ పొడి దగ్గులో కఫం ఉండదు. మాటిమాటికీ ఇలా పొడి దగ్గు వస్తూ ఉంటే విసుగ్గా ఉంటుంది, రెగ్యులర్ పనులు కొంచెం డిస్టర్బ్ అవుతాయి. ఎన్విరాన్మెంటల్ అలర్జెన్, పొల్యూటెంట్ కి రియాక్షన్ గా ఈ పొడి దగ్గు వస్తుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యను పరిష్కరించుకుందాం.

ప్రతిరోజూ కనీస౦ ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగడం వల్ల శ్లేష్మం, కఫం తగ్గుతాయి – ఇది మీ మొత్తం ఆరోగ్యానికి మంచిది.

గొంతునొప్పిఆవిరి పట్టడం వల్ల గొంతులోని కఫము క్లియర్ అవుతుంది. వేడి నీటిలో పసుపు, కానీ అల్లం కానీ విక్స్ లాంటివి వేసి ఆవిరి పట్టడం చాలా మంచిది.

గొంతునొప్పిమీ గొంతులోని శ్లేష్మం బైటికి తీయడానికి, కఫం తొలగించడానికి తరచుగా ముక్కును చీదండి. తరచుగా ఉప్పు కలిపిన వేడి నీటితో పుక్కిలించి ఉమ్మేయండి. కొన్నిచుక్కల యూకలిప్టస్ ఆయిల్ ని వపోరైజర్ లో వేసి పీలిస్తే కఫం నుండి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.

గొంతునొప్పికొన్ని డైరీ ఉత్పత్తులు, ఐస్ క్రీం, శీతల పానీయాలు వంటి కఫాన్ని వృద్ది చేసే పదార్ధాలను తినడం మానేయండి. ముక్కురంధ్రాలు తేమగా ఉండడానికి, శ్లేష్మం తగ్గడానికి హెర్బల్ టీ లేదా ఉడకబెట్టిన చికెన్ సూప్ వంటి వేడి ద్రవాలను త్రాగండి.

గొంతునొప్పిఅర గ్లాసు పాలలో ఒక టీస్పూన్ పసుపు కలపండి – పసుపు క్రిమిసంహారాలను కలిగిఉంటుంది కాబట్టి వ్యాధిపై పోరాడుతుంది.

గొంతునొప్పినిమ్మ, తేనెని వాడండి. ఒక కప్పు వేడి నీళ్ళలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమం మీ గొంతును శుభ్రపరుస్తుంది, నిమ్మరసం కఫాన్ని వదిలిస్తుంది, తేనె గొంతును సరిచేస్తుంది.

గొంతునొప్పిఇంటిని శుభ్రంచేయడం, రంగుల వాసన, రసాయనాలు లేదా సిగరెట్ త్రాగడం వంటి ఉత్ప్రేరకాల నుండి దూరంగా ఉండండి. ముల్లంగిస్మోకింగ్ అలవాటు ఉన్న వారు ధూమపానాన్ని ఆపండి, ఇది శ్వాసను ఇబ్బంది పెడుతుంది, గొంతును చికాకుపెడుతుంది. మసాలా పదార్ధాలు, ముల్లంగి లేదా వేడి కారం మిరియాలు శ్లేష్మాన్ని తగ్గిస్తాయి.

గొంతునొప్పిగోరు వెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు వేసి కలిపి తాగాలి. కావాలంటే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. గొంతులో గరగర మాయమవ్వడమే కాదు. గొంతులో హాయిగా అనిపిస్తుంది కూడా.

గొంతునొప్పిఅల్లాన్ని పేస్ట్ చేసి, దాల్చిన చెక్కను పొడి చేసి, వాటితో టీపొడి కలిపి టీ పెట్టుకొని తాగేయండి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది. చక్కటి ఫలితం ఉంటుంది. కావాలంటే కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు.

గొంతునొప్పిఅల్లంలో బ్యాక్టీరియాలను చంపే గుణాలున్నాయి. గొంతులో మంటను తగ్గించే లక్షణాలున్నాయి. కాబట్టి… అల్లాన్ని మెత్తగా నూరి టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగితే గొంతులో కిచ్ కిచ్ మొత్తం మాయమవుతుంది.

గొంతునొప్పిచామంతి టీ గురించి పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు. నిజానికి ఇది కూడా బాగా పనిచేస్తుంది. కొన్ని చామంతి రేకుల్ని నీటిలో వేసి మరిగించి తాగడమే. కావాలంటే కాస్త తేనె కలుపుకోవచ్చు. ఈ టీ బ్యాక్టీరియాను ఒక ఆట ఆడుకుంటుంది.

గొంతునొప్పిపుదీనా చేసే మేలేంటో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి ఆకులు తీసివేసి వాటర్ తాగాలి. అంతే గొంతుకి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

గొంతునొప్పిగమనిక : ఈ చిట్కాలు మీ గొంతుకు ఉపశమనం ఇస్తాయి కానీ కరోనా లక్షణాలు ఉన్నట్టు మీకు అనిపిస్తే కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR