ఎండలో బయటికి వెళ్తున్నాం అంటే కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకుంటాం. కొంతమంది ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నారంటే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు తీయరు. దీనివల్ల ముఖం టాన్ అవకుండా ఉంటుందేమో కానీ శరీరంలోని మిగతా భాగాలు ఎండకు ఎక్సపోజ్ అవుతాయి.
కొంతమంది చేతులు నల్లగా కాంతివిహీనంగా ఉండడం చూస్తూనే ఉంటాం. దీనికి ఎండలో ఎక్కువగా తిరగడం మాత్రమే కాదు పోషకాహార లోపం, డీహైడ్రేషన్ వంటివి కూడా కారణాలు కావొచ్చు.
అయితే ఇలా చేతులు నల్లగా మారగానే చాలామంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకొద్ది డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే వస్తువులతో నల్లని చేతులు తెల్లగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్లని చేతులను తెల్లగా మార్చడానికి పైనాపిల్ చాలా బాగా సహాయపడుతుంది. పైనాపిల్ రసంలో కొంచెం తేనే కలిపి చేతులకు బాగా రాసి పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఒక బౌల్లో గంధం పొడి, పాలు, కొబ్బరి నీరు వేసి బాగా కలిపి చేతులకు రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి, పావుగంట తర్వాత నీళ్లు జల్లుతూ రబ్ చేస్తూ శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే చేతుల నలుపు తగ్గి కాంతివంతంగా మారుతాయి.