పంటి నొప్పి సమస్యకు తక్షణ ఉపశమనం కలిగించే ఔషధాలు

పంటి నొప్పి అనేది సాధారణంగా కనిపించినా రోజు వారి పనులకు ఆటంకం కలిగిస్తుంది. మనలో చాలా మందికి అప్పుడప్పుడు అకస్మాత్తుగా పంటి నొప్పి వస్తుంది. పంటి నొప్పి పై అధ్యయనం చేయడంతో ఒక సర్వే ప్రకారం 90% మందికి జీవితంలో ఎప్పుడైనా ఒకసారి దంతాల నొప్పి వస్తుందని తేలింది.

పంటి నొప్పిదంతక్షయం లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల దంతాలు అప్పుడప్పుడు నొప్పికి గురి అవుతాయి. దీంతో దంతాల సమస్య మరీ తీవ్రతరం అయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి, దంతాల నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు

లవంగాలు:

పంటి నొప్పిలవంగాల లో యూజినాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి ఒకటి లేదా రెండు లవంగాలను నమిలి మింగడం లేదా లవంగాలను పొడి చేసుకొని నొప్పి ఉన్న చోట పెట్టడం లాంటి పనులు చేయడం వల్ల ఈ సమస్య నొప్పి నుంచి బయటపడవచ్చు. లేదంటే లవంగాలను పంటి నొప్పి ఉన్న చోట పెట్టి సుమారు 4-6 గంటలు ఉంచితే తిమ్మిరి కలిగి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. లవంగాలకు చిన్న ముళ్ళు ఉంటాయి కంగారుపడవద్దు.

వెల్లుల్లి:

పంటి నొప్పివెల్లుల్లి రెబ్బలు రెండు తీసుకొని బాగా నమలాలి. లేదా వాటిని మెత్తగా పేస్ట్ చేసుకొని, నొప్పి ఉన్నచోట దంతాలపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వెల్లుల్లి, లవంగాలను పేస్ట్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే దాని నుండి వచ్చే రసం వల్ల పది సెకన్లలోనే నొప్పి తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలంగా ఉన్న నొప్పులను కూడా తగ్గిస్తుంది.

ఉల్లిపాయలు:

పంటి నొప్పిఉల్లిపాయలో ఉండే కాల్షియన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయ. ఇందులో అనేక యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. అలాగే, పంటి నొప్పితో బాధపడే వాళ్లు ఆ పంటికి లేదా చిగురుకు చివరన ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి మాయమైపోతుంది. అలాగే, ఉల్లిరసం, తేనె రెండింటిని సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి తీసుకున్నట్టయితే గొంతునొప్పి, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.

జామ ఆకులు:

పంటి నొప్పిజామ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇందుకోసం జామ ఆకులను కొద్దిసేపు బాగా నమలాలి. లేదా కొన్ని జామ ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది.చిగుళ్ళ వాపు కూడా నయమవుతుంది.

హైడ్రోజెన్ పెరాక్సైడ్:

పంటి నొప్పి6 ఔన్సుల వెచ్చని నీటిలో 1 టీస్పూన్ ఉప్పును కలిపి దానిని నోటిలో పోసుకొని పుక్కిలించి ఊయాలి.ఉప్పు వలన గొంతు లేదా ఇబ్బందికి గురిచేసే చిగుళ్ళ వల్ల వచ్చే పంటి నొప్పి కి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది.

కోల్డ్ కంప్రెస్ :

పంటి నొప్పిఒక వస్త్రంలో ఐస్ ముక్కలు చుట్టి,దాన్ని సమస్య ఉన్న దంతాలపై పెట్టాలి. పదిహేను నిమిషాలపాటు అలాగే పెడితే వాపు తగ్గి, నొప్పి కూడా తగ్గిపోతుంది. అయితే ఐస్ ముక్కలను ఎప్పుడూ చర్మంపై నేరుగా పెట్టవద్దు. ఈ పరిష్కారం హోమ్ లోకల్ అనస్థీషియా లాగా పనిచేస్తుంది, మరియు చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

పార్స్లీ:

పంటి నొప్పిపార్స్లీ మొక్కను నమలడం దంతంలో సమస్యల వల్ల కలిగే నొప్పి లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో అధిక ఐరన్ కంటెంట్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

గోధుమ గడ్డి :

పంటి నొప్పికుదిరితే గోధుమగడ్డి నేరుగా నమలవచ్చు లేదా జ్యూస్ తీసి, దాన్ని నీళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని పుక్కలించవచ్చు. దీంతో నోటి లో ఉన్న బ్యాక్టీరియా చనిపోయి, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

వెనిలా:

పంటి నొప్పివెనిలా సారంను నేరుగా పోయడం ద్వారా,లేదా 3 నుండి 4 చుక్కలు కాటన్ లో వేసి పంటి నొప్పి ఉన్న ప్రదేశంను శుభ్రపరచడం ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.

కఫ్ సిరఫ్:

పంటి నొప్పిహాల్స్ దగ్గు డ్రాప్స్ లో కొంచెం మత్తు ఉంటుంది. వాటిని నోటిలో వేసుకొని చప్పరిస్తే నొప్పి తగ్గటానికి సహాయపడుతుంది.

విక్స్:

పంటి నొప్పికాగితపు టవల్ పై విక్స్ ని రాసి నొప్పి ఉన్న దవడ ప్రాంత చర్మంపై రాయాలి.

మిరియాలు:

పంటి నొప్పిచిగుళ్ళ మీద మిరియాల పొడితో రుద్దడం వల్ల వెంటనే ఆ ప్రాంతం తిమిరిగా ఉండి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

మౌత్ వాష్ మరియు ఇథైల్ ఆల్కహాల్ కలిపి:

పంటి నొప్పిమౌత్ వాష్ మరియు ఆల్కహాల్ పానీయంతో గార్గ్లింగ్ సాధారణంగా పంటి నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది,

విస్కీ:

పంటి నొప్పి3 నుండి 4 చుక్కల విస్కీని కాటన్ లో వేసి పంటి నొప్పి ఉన్నచోట నొక్కి పెట్టితే కొంత సేపటికి ఆ ప్రాంతంలో తిమ్మిరి కలిగి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

ఉప్పు నీళ్లు :

పంటి నొప్పిఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో,ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి బాగా పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల త్వరగా పంటి నొప్పి తగ్గిపోతుంది.బోజనం చేసిన తరువాత, రాత్రి పడుకునే ముందు బ్రష్‌ చేసి ఉప్పు కలిపిన నీటిని పుక్కిలించాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR