సహజంగా అవాంఛిత రోమాలను తగ్గించే చిట్కాలు!

0
1611

మొన్నటి వరకు ఈ హెయిర్ రిమూవింగ్ కష్టాలు అమ్మాయిలకు మాత్రమే ఉండేవి. కానీ మారిన ఫ్యాషన్, బ్యూటీ ట్రెండ్స్ వల్ల అబ్బాయిలు కూడా ఈ మధ్య తమ శరీరం మీద ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకుంటున్నారు.

Tips to reduce unwanted hairశరీరం మీద ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పని. దీనికోసం వ్యాక్సింగ్ లేదా షేవింగ్ చేసుకోవడం ఆ రెండూ కుదరకపోతే.. హెయిర్ రిమూవల్ క్రీంస్ వాడటం లాంటివి చేస్తూ ఉంటాం. అయితే శరీరంపై ఉన్న వెంట్రుకలను సహజంగా తొలగించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Tips to reduce unwanted hair1. పాత కాలం నుండి చర్మ సౌందర్యం కోసం ఫాలో అవుతున్న టిప్ శెనగపిండి. ఇది చర్మాన్ని అందంగా మార్చడం మాత్రమే కాదు.. అవాంఛిత రోమాలను సైతం తొలగిస్తుంది. దీనికోసం అరకప్పు శెనగపిండి తీసుకోవాలి. దీనికి పెరుగు, కొద్దిగా ఆలివ్ నూనె కలిపి మిశ్రమంగా చేయాలి. అన్వాంటెడ్ హెయిర్ తొలగించుకోవాలనుకున్న చోట అప్లై చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో తడిపి మసాజ్ చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ శరీరంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగిస్తుంది.

Tips to reduce unwanted hair2. కప్పు పెసరపప్పుని బాగా నానబెట్టి.. మెత్తటి పేస్ట్ లా తయారు చేయాలి. పెద్ద సైజులో ఉన్న బంగాళాదుంపను సన్నగా తురిమి శుభ్రమైన వస్త్రంలో చుట్టి.. గట్టిగా పిండి రసం తీయాలి. ఈ రసాన్ని మెత్తగా రుబ్బిన పెసరపప్పులో కలపాలి. ఈ మిశ్రమానికి టేబుల్ స్పూన్ చొప్పున తేనె, నిమ్మరసం కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత వేళ్లతో నెమ్మదిగా రుద్దుకుంటూ ప్యాక్ తొలగించి నీటితో శుభ్రం చేసుకోవాలి. పొడిగా మారిన తర్వాత ఈ ప్యాక్ ను తొలగించడం వల్ల అవాంఛిత రోమాలు ఊడి వచ్చేస్తాయి.

Tips to reduce unwanted hair3. బాగా ముగ్గిన అరటిపండును మెత్తగా చేసి రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ మీల్ కలిపి మిశ్రమంగా చేయాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. ఆ తర్వాత వెంట్రుకలు పెరుగుతున్న దిశకు వ్యతిరేక దిశలో మసాజ్ చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని పొడిగా తుడుచుకోవాలి. ఓట్ మీల్ స్క్రబ్ గా పనిచేస్తుంది. అరటిపండు.. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. ఈ రెండిటి మిశ్రమం అవాంఛిత రోమాలను తొలగించడం మాత్రమే కాకుండా.. వాటి పెరుగుదలను తగ్గిస్తుంది. పొడి చర్మం ఉన్న వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.