పిల్లల్లో వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు పాటించవలసిన చిట్కాలు

సీజన్ మారినప్పుడు చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. రకరకాల ఇన్ ఫెక్షన్లు సులభంగా దాడిచేస్తాయి. ఎందుకంటే పిల్లల్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వైరల్‌ ఫీవర్‌ అనేది చాలా స్పీడ్‌గా ఎటాక్‌ అవుతుంది. సీజన్ లో ప్రతి పదిమందిలో ఒకరికి జలుబు, జ్వరంతో కూడిన వైలర్ ఇన్ ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. అందుకని కొంతమంది వైరల్‌ ఫీవర్స్‌ను పెద్దగా పట్టించుకోరు. కాని వైరల్‌ ఫీవర్స్‌ పిల్లలకు రావడం మాత్రం సీరియస్‌గా పరిగణించాలి.

Viral Feverవైరల్‌ ఫీవర్స్‌ ఎటాక్‌ అవ్వగానే మందులు, సూదులు అంటూ పిల్లలను ఇబ్బంది పెట్టకుండా కొన్ని సహజ పద్దతుల్లో ఆ ఫీవర్‌ను తగ్గించుకోవచ్చు. ఈ పద్దతుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి ఆ చిట్కాలేంటో చూసేద్దామా… వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకు ఎక్కువగా నీళ్లు తాగించాలి. దాంతో శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లైట్ ఫుడ్స్ తీసుకోవాలి.

Viral Feverపిల్లలకు జర్వం వచ్చిన సమయంలో వారిలో రోగ నిరోధక శక్తి పెంచాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మొదట వారికి రెండు టీ స్పూన్‌ ల తేనెలో కాస్త అల్లం రసంను వేసి తాగించాలి. దాంతో వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వేడి నీళ్లలో దాల్చిన చెక్క వేసి మరిగించి ఆ నీటిని తాగించడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Viral Feverవైరల్ ఫీవర్ తగ్గించుకోవడానికి తాజా కొత్తిమీరతో తయారుచేసిన టీ, మెంతి వాటర్ వంటివి త్రాగడం వల్ల వైరస్ చాలా తర్వాత నాశనం అవుతుంది. రైస్ వాటర్ లేదా రవ్వ గంజి వంటివి కూడా తీసుకోవచ్చు.

Viral Feverధనియాలతో కషాయం తయారు చేసి పిల్లలకు తాగించడం వల్ల కూడా వైరల్‌ ఫీవర్‌ తగ్గుతుంది. ధనియాలను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ తర్వాత వడగట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాపించాలి. ఇలా చేయడం వల్ల కూడా వైరల్‌ ఫీవర్‌ తగ్గుతుంది.

Viral Feverతులసి ఆకు మంచి యాంటీ బయోటిక్‌ గా పని చేస్తుంది. శరీర రోగ నిరోదక శక్తిని పెంచడంతో పాటు వైరల్‌ ఫీవర్‌ను పోగొడుతుంది. తులసి ఆకును లీటరు నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని తాగించడం వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది

Viral Feverరెండు స్పూన్‌ ల ఆవ నూనె తీసుకుని అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి నూనెలో వేసి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి బాగా మర్దన చేయాలి. దాంతో జర్వం చాలా వరకు తగ్గే అయ్యే అవకాశాలుంటాయి.

Viral Fever

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR