Home Health వయసు పెరగడం వల్ల ముఖంపై వచ్చే ముడతలు తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి!

వయసు పెరగడం వల్ల ముఖంపై వచ్చే ముడతలు తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి!

0

వయసు పైబడుతున్న కొద్దీ చర్మం నునుపుదనం బాగా తగ్గుతుంది. కాంతివిహీనంగా మారుతుంది. ముఖం మీద ముడతలు, చర్మం పొడిగా మారటం, చర్మం సాగటం వంటి సమస్యలు కనబడకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీనికోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి క్రీమ్స్ లోషన్స్ వాడుతూ ఉంటారు. మేకప్ తో తాత్కాలికంగా మేనేజ్ చేయొచ్చు కానీ శాశ్వత పరిష్కారం ఉండదు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఇంటిలో ఉండే వస్తువులతో చర్మాన్ని యవ్వనంగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Tips to reduce wrinkles on the faceఒక గిన్నెలో ఎగ్ వైట్ పెరుగు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే ముఖం మీద ముడతలు సన్నని గీతలు మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం యవ్వనంగా కనబడుతుంది.

అరకప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి కప్పు నీటిని కలిపి పొయ్యిపై ఉంచాలి. ఉడుకుతున్నప్పుడే అందులో నుంచి కొంచెం గంజిని తీసుకుని వడకట్టి చల్లార్చాలి. రెండు టేబుల్‌ స్పూన్ల గంజిలో తాజా కలబంద గుజ్జు టేబుల్‌ స్పూను, రెండు ఇ విటమిన్‌ ఆయిల్‌ క్యాప్సుల్స్‌ను కత్తిరించి ఆ నూనె వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. రాత్రి నిద్రపోయే ముందు ముఖాన్ని కడుక్కుని ఈ సీరాన్ని లేపనంలా రాసి మృదువుగా వేళ్లతో మర్దనా చేయాలి. పది నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరిస్తే చాలు. ఇది చర్మాన్ని మృదువుగా మార్చి, బిగుతుగా ఉంచుతుంది. ఇందులోని ఇ విటమిన్‌ చర్మాన్ని తేమగా, యవ్వనంగా ఉంచుతుంది.

అరటి పండులో విటమిన్‌ ఎ, ఇ, బిలు బాగా ఉంటాయి. అందుకే బాగా మగ్గిన అరటిపండును తీసుకుని దాన్ని సన్నటి ముక్కలుగా తరిగి వాటిల్లో ఒక్కొక్క టీస్పూన్‌ చొప్పున రోజ్‌ వాటర్‌, తేనె, పెరుగు వేసి ఆ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

కొబ్బరిపాలు చర్మానికి రాసుకుంటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కొబ్బరిపాలలో దూదిని ముంచి దానితో ముఖాన్ని, మెడను బాగా రుద్దుకొని, పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పట్టులా, యవ్వనంగా మారుతుంది.

చర్మం యవ్వనంగా కనబడాలంటే కెరోటిన్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి నీటిని కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ పైన చెప్పిన ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.

Exit mobile version