మెదడు చురుగ్గా పని చేయాలా… ఈ చిట్కాలు ప్రయత్నించండి!

మనం చూస్తూనే ఉంటాం కొంతమంది ఎన్ని రోజులు చదివిన అది గుర్తుండదు. కొంతమంది అలా చదివింది ఇలా జ్ఞాపకం పెట్టేసుకుంటారు. మరికొంత మంది చదివినవి, తెలిసినవి కూడా జ్ఞాపకం చేసుకోడానికి కష్టపడుతుంటారు. ఇదంతా మెదడు చురుగ్గా లేకపోవడం వలన జరుగుతుంది. మనిషి అవయవాలలో మెదడు అత్యంత కీలకమైనది. మన శరీరంలోని ప్రతి అవయవం మెదడు నియంత్రణలోనే ఉంటుంది.

sharp brainఅంటే మెదడు చురుగ్గా ఉంటే మన బాడీ యాక్టివ్ గా పని చేస్తుందన్నమాట. మనం గ్యాప్ లేకుండా పని చేస్తుంటే ఎలా అలసిపోతామో మెదడు కూడా అలానే అలసిపోతుంది. మెదడు చురుగ్గా పని చేయాలంటే రోజులో కనీసం ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. అప్పుడే బ్రెయిన్లో స్టోర్ అయిన వేస్టేజ్ అంతా డిలీట్ అయిపోయి రిలాక్స్ అయిపోతుంది. దీంతో లేవగానే బ్రెయిన్ షార్ప్ గా పని చేయడం మొదలుపెడుతుంది.

అయితే మెదడు చురుగ్గా పని చేయాలంటే విశ్రాంతితో పాటు దానికి సరైన పోషక పదార్థాలు అందాలి. చిన్న వయసులో సమస్య ఉన్నవారికె కాదు, జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న పెద్దవారికి కూడా తిరిగి మెదడులో కణాలను ఉత్తేజం చేసి చురుగ్గా అన్ని జ్ఞాపకం ఉంచుకునేలా చేసే అద్భుతమైన చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

walnutsతినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు కొవ్వులు ప్రోటీన్లు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. మెదడును సూపర్ షార్ప్ గా చేసి ఫుడ్స్ లో వాల్ నట్స్ ముఖ్యమైనవి. మెదడు ఆకారంలో ఉండే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా త్రీ ఫ్యాట్ ఆమ్లాలతో పాటు విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇవి జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

proteins, carbohydrates & fatఆవు నేతికి జ్ఞాపకశక్తిని పెంపొందింపచేసే గుణం వుంది. అది కూడా తాజా ఆవు నెయ్యి కంటే బాగా పాతబడిన ఆవు నెయ్యిని మందులుగా 1 చెంచా చొప్పున రెండు పూటలా రోజూ తీసుకోవాలి. ఎంత పాతబడిన నెయ్యి వాడితే అంత గొప్ప ఫలితం చాలా తొందరగా ఉంటుంది.

cow gheeమెదడుకు సంబంధించి బలవర్ధక ఆహారాలలో గుడ్డు ఒకటి. ప్రతిరోజు ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్డు ని మీ బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా చేసుకుంటే బ్రెయిన్ కు పదును పెడుతున్న అంటే లెక్క. గుడ్డులో కోలైన్ అనే పదార్థం ఉంటుంది ఇది జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు మెదడు షార్ప్ గా ఆలోచించడానికి అనుగుణంగా బ్రెయిన్ సిద్ధం చేస్తుంది.

egg with black pepperఉసిరికాయని తొక్కుడు పచ్చడి (నల్లపచ్చడి) గా తయారు చేసుకొని రోజూ రెండుపూటలా అన్నంతో మొదటి మూడు ముద్దలు తినాలి. ముఖ్యంగా విద్యార్థులకు ఇది బాగా మేలు చేస్తుంది. ఆమలకి రసాయనం అనే పేరుతో ఆయుర్వేద మందుల షాపులో మంచి రుచికరమైన ఔషధం దొరుకుతుంది. దీనిని ఉసిరికాయతోనే తయారుచేస్తారు దాన్ని తినిపిస్తే జ్ఞాపకశక్తి ఆమోఘంగా పెరుగుతుంది.

మాంసాహారం తినేవారు కోడిపుంజు మాంసంను తీసుకుంటూ ఉండాలి. అందులో ఉన్న పోషకాలు మెదడు కణాలను చురుగ్గా తయారుచేస్తాయి. త్రిఫలచూర్ణం అందరికి తెలిసినదే గాక, అందరికి అందుబాటు ధరలో ఉంటుంది కూడా. ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. దీన్ని తప్పనిసరిగా రోజూ 1/2 చెంచా నుంచి 1 చెంచా వరకు నేరుగాగాని, పాలలో కలిపిగాని, కషాయం కాచుకొని గానీ తీసుకోవాలి. జ్ఞాపకశక్తిని పెంచే గొప్ప గుణం దీనికుంది.

మిరియాలు ఘాటుగా ఉన్న మన ఆరోగ్యానికి మాత్రమేకాదు మన మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. మిర్యాల లో ఉండే పోషకాలు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గటానికి కూడా బాగా ఉపయోగపడతాయి. మెదడును చురుగ్గా చేసి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.

మెదడు చురుగ్గా చేసే వాటిలో సోంపు కూడా చాలా ముఖ్యమైనది. పూర్వం మన పెద్దలు భోజనం చేసిన తర్వాత కంపల్సరిగా సోంపు తినేవారు. దీంతో వారు అనేక అనారోగ్యాల నుంచి దూరంగా కూడా ఉన్నారు. ప్రతిరోజు మనం భోజనం చేసిన తర్వాత ఒక టీ స్పూన్ మోతాదులో సొంపును తింటే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన మెదడు ని చురుగ్గా మార్చడానికి బాగా పనిచేస్తాయి.

banana with milkవీటితో పాటు పాలు చేప అరటి పండ్లు దానిమ్మ బంగాళదుంపలు టమోటా గుమ్మడి గింజలు ఆకుకూరలు ఆహారంలో భాగంగా చేసుకోండి. వీటిలో ఉండే పొటాషియం మెగ్నీషియం పోలిక్ యాసిడ్ మీ బ్రెయిన్ ని మరింత షార్ప్ గా మారుస్తాయి. అలాగే రోజుకు రెండు కప్పులకు మించకుండా కాఫీ తాగండి. కాఫీలోని కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్రెయిన్ షార్ప్ చేస్తుంది. రోజుకు మూడు లీటర్ల తగ్గకుండా నీటిని తాగుతూ ఉండాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR