Home Unknown facts Tirumala Tirupathilo Thappakunda Darshinchalsina Pradehsaalu

Tirumala Tirupathilo Thappakunda Darshinchalsina Pradehsaalu

0

తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వచ్చే తిరుమల తిరుపతి లో తప్పకుండ దర్శించాల్సిన కొన్ని ఆలయాలు, ప్రదేశాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. tirumalaతిరుమలలో చూడవలసిన ప్రదేశాలు:గర్భగుడి (ఆనంద నిలయం), రాములవారి మేడ, వరద రాజస్వామి ఆలయం, పోటు ప్రధాన వంటశాల, వకుళమాత దేవాలయం, బంగారుబావి, తీర్థం ఇచ్చే ప్రదేశం, హనుమ, అంగద, సుగ్రీవ, విష్వక్సేన, అనంత, గరుడ ఉత్సవ మూర్తులు ఉండే మంటపం, పరకామణి, విమాన వేంకటేశ్వరస్వామి, హుండీ, అన్నమయ్య భాండాగారం, భాష్యకార్ల సన్నిధి, బొక్కసం సెల్, యోగ నరసింహ స్వామి ఆలయం, పరిమళపు అర.
వెండి వాకిలి బైట:క్షేత్రపాలక గుండు, తిరుమల రాయల మండపం, కల్యాణ మండపం, విరజానది, పడిపోతుదిట్టం, రామానుజ కూటమి, అద్దాల మండపం, పూలబావి, తులాభారం, పద్మనిధి, శంఖనిధి.
ఇతర ఆలయాలు, ప్రదేశాలు:వరాహస్వామి దేవాలయం, శ్రీ కోదండ రామస్వామి ఆలయం, గొల్లమండపం, అఖిలాండం, బేడీ ఆంజనేయస్వామి దేవాలయం, కల్యాణకట్ట, తిరుమల ఆస్థాన మండపం, శ్రీవారి అన్నదాన నిలయం, శ్రీవారి పాదాలు, శిలాతోరణం.
కొండపైన ఉన్న వివిధ తీర్దాలు:తిరుమలలో వివిధ తీర్దాలున్నాయి. వాటిలో తుంబుర తీర్థం, రామకృష్ణ తీర్థము, పాండవ తీర్థము, దేవ తీర్థము, కుమారధార తీర్థము, కాయరసాయన తీర్థము, జాబాలి తీర్థము, శేష తీర్థము, పసుపుధారా కుమారధార తీర్థము, చక్ర తీర్థము, శంఖుతీర్థము, పంచాయద తీర్థము, బ్రహ్మ తీర్థము, అగ్ని కుండ తీర్థము, సప్తర్షి తీర్థము, విష్వక్సేన సరస్సు, పాపవినాశనము, ఆకాశగంగ, గోగర్భం డ్యామ్, స్వామిపుష్కరణి, వైకుంఠ తీర్థము, కపిల తీర్థము, స్వామివారి మ్యూజియం, శిలాతోరణం, ధ్యాన మందిరం, దేవాలయాలు మొదలగునవి ఉన్నవి.

Exit mobile version