కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఎవరికి ఇవ్వాలి?

హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో పండగకి ఒక్కో విశిష్టత ఉంది. పండుగలు వస్తే చాలు ఇల్లంతా శుభ్రపరుచుకొని పూజ గదిని ప్రత్యేకించి అలంకరించి…వివిధ రకాల నైవేద్యాలతో ఎంతో గొప్పగా పూజలు జరుపుతుంటారు. హిందువులు ప్రతి ముఖ్యమైన పూజ సమయంలో ఆ దేవుళ్ళకు కొబ్బరికాయ సమర్పిస్తుంటారు. మన సాంప్రదాయాలలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. పూజ అయిన అనంతరం కొబ్బరికాయను పగలకొట్టి ఆ దేవుని ముందు ఉంచుతాము. ఇలా కొబ్బరికాయను కొట్టి దేవునికి సంమర్పించడాన్ని ఆత్మసమర్పణంతో సమానంగా భావిస్తారు.

coconut breakingఅదేవిధంగా కొబ్బరికాయతో కలశాన్ని కూడా ప్రతిష్టిస్తారు. సాధారణంగా కలశాన్ని నోములు, వ్రతాలు చేసుకొనే సమయంలో పెడుతూ ఉంటాం.
వారి తాహతును బట్టి రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, ఆ కలశంలో కొంచెం నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు.

coconut on potకలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వస్త్రం చుట్టిన కొబ్బరికాయను పెట్టి పూజ చేస్తారు.
మన ఇంటిలో ఏదైనా పూజలు జరిగినప్పుడు కలశం పెట్టటం ఆచారంగా వస్తుంది. అయితే చాలా మందికి కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో అర్ధం కాదు. కలశం మీద పెట్టిన కొబ్బరికాయను పూజ చేయించటానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వచ్చు.

coconut on potఒకవేళ బ్రాహ్మణులు లేకపోతే పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చు. కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇచ్చిన లేదా పారే నీటిలో నిమజ్జనం చేసిన ఎటువంటి దోషాలు ఉండవు.

coconut throwing in water or lakesదేవాలయంలో కలశాన్ని పెడితే పూర్ణాహుతి చేస్తారు. అదే ఇంటిలో కలశాన్ని పెడితే కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇవ్వడం లేదా పారే నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇది మన పూర్వీకుల నుంచి ఒక ఆచారంగా వస్తుంది. మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను అనుసరించటం మన విధి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR