We Ode Tribute To Sirivennela Sitarama Sastry With These 20 Best Lyrical Quotes From Songs He Penned

పాట లేని తెలుగు సినిమాని ఊహించుకోవడం ఎంత కష్టమో….సిరివెన్నెల సీతరామ శాస్త్రి గారు లేని తెలుగు సినిమాని, పాటని, ఒక్క సిరివెన్నెల పాట కుడా లేని ఆల్బమ్ ని…ఊహించుకోవడం కూడా అంతే కష్టం.

20 మే, 1955 ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు జన్మించారు…
1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ప్రారంబించిన సీతారామశాస్త్రి గారు మొదలు అందరికి చంబోలు సీతారామశాస్త్రిగా పరిచయం. కానీ 1986 లో కే. విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల అనే సినిమా అయన ఇంటి పేరుగా మారిపోయింది..అందుకు కారణం లేకపోలేదు..ఈ సినిమాలోని పాటలు, ఆ పాటల్లో ఉన్న సాహిత్య విలువలు…అప్పటి వరకు  సినిమా పాట అంటే బూతులు, రొమాన్స్…లాంటి కమర్షియల్ హంగులను దాటి తెలుగు సినిమాను ఒక రెండు మెట్లు ఎక్కించాయి.

అలా తన కెరీర్ ని ప్రారంభించిన సీతారామశాస్త్రి గారు..వేటూరి గారితో పోటీ పడుతు…దదాపు అందరి హీరో సినిమాలకు,  సినిమాలో అన్ని పాటలను…సింగిల్ కార్డులో అవలీలగా రాయడం అనేది ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య లాగా మార్చుకుని రాత్రి పాగలు అనే తీరికలేకుండా రాత్రి ఉదయించే సూర్యుడిగా తన కలానికి సాన పెట్టారు…

సిరివెన్నెల, స్వర్ణకమలం, రుద్రవీణ లాంటి సినిమాల్లో అయన పాటలు…సినిమా అనే పరిధిని దాటి ఒక కొత్త గేయ రచనకు శ్రీకారం చుట్టాయి. ప్రేమ పాట రాయాల్సి వస్తే అయన ప్రేమికుడు అవుతాడు…సమాజాన్ని నిలదీసే పాట రాయమంటే ఆయనలోని సగటు మనిషి పైకి లేచి నిగ్గ దీసి అడుగు ఈ సమాజాన్ని అంటూ…ఒక విప్లవం వినిపిస్తుంది.

ఇలా ఒకటా రెండా….దర్శకులు ఆయనకు సందర్భాలు చెప్తూ పోయారు….అయన రాస్తూ పోయారు. దాదాపు 4000 పై చిలుకు పాటలతో…కెరీర్లో ఉత్తమ గేయరచయితగా 11 నంది అవార్డులు.. నాలుగు ఫిలింఫేర్…అవార్డులు, 2019 లో దేశ అత్త్యుత్తమ పద్మ శ్రీ అవార్డు కూడా వరించింది మన సిరివెన్నెలని…

అవార్డులు…రివార్డులు సీతారామశాస్త్రి గారికి కొలమానం కాదు….అయన రాసిన పాటలు సగటు తెలుగు సినీ అభిమానులను మూడు దశాబ్దాలకు పైగా అలరించాయి. అయన పాటలు కేవలం వినోదానికి మాత్రమే కాదు…

మీరు ఎపుడైనా…కొంచెం దిగులుగా ఉన్నా, కొంచెం అధైర్య పడ్డా, కొంచెం నిరాశ లో ఉన్నా… ఎలాంటి పరిస్థితిలో ఉన్నా…సిరివెన్నెల గారి పాట వింటే మనల్ని మనం ప్రశ్నించుకునేలా, మన గమ్యాన్ని మనం నిర్దేశించుకునేలా, జీవిత పాఠాల్ని తన పాటల ద్వారా చెప్పారు అయన.

ఈరోజు అయన గుండె ఆగిపోవొచ్చు…అయన మళ్ళీ పెన్ను పట్టుకుని పాటలు రాయలేకపోవొచ్చు కానీ…ఆయన తెలుగు సినిమా పాట రూపంలో ఎప్పుడు బ్రతికే ఉంటారు…

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనే కలానికి..ఆ కలంలోని సిరాకి ఎప్పటికి… చావు లేదు…రాదు 🙏

“ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా…”

సిరివెన్నెల గారు రాసిన ఎన్నో వేల పాటల్లో…కొన్ని పాటలు…ఆ పాటల్లోని జీవిత పాఠాలు ఓ సారీ…చూద్దాం రండి!

1. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా – కొత్త బంగారు లోకం

బతుకంటే బడి చదువా అనుకుంటే అతిసులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

Sirivennela Best Songs

2. ఎంతవరకు ఎందుకొరకు – గమ్యం

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

3. ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ – Jalsa

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా
అపుడెపుడో ఆటవికం, మరి ఇపుడో ఆధునికం
యుగ యుగాలుగా ఏ మృగాలా కన్న ఎక్కువ ఏమెదిగాం.

4. చేసేదేదో చేసేముందే – ముకుంద

ఈతే తెలియాలి – నది ఎదురైతే
పూర్తయి తీరాలి – కథ మొదలెడితే
గెలుపే పొందాలి – తగువుకి దిగితే
పడినా లేవాలి
ఏ పూటైనా ఏ చోటైనా
నిలవని పయనం సాగాలి
రాళ్ళే వున్నా ముళ్ళే ఉన్నా

5. చుట్టు పక్కల చూడరా చిన్న వాడా – రుద్రవీణ

“కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం”

7. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి – పట్టుదల

“నొప్పిలేని నిమిషమేది జననమైనా మరణమైనా
జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ”

8. సాహసం నా పథం – మహర్షి

“సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం”

9. You and I – Jalsa

పొందాలంటే.. విక్టరీ
పోరాటం.. compulsory
Risk అంటే .. ఎల్లా మరి.. bolnaaa..
ఎక్కాలంటే.. హిమగిరి
ధిక్కారం.. తప్పని సరి
కాలం.. మొక్కే.. History.. liknaa…..!

10. Do it just do it – Bhadra

Do it just do it don’t bother go and try
Karthe dekho jo kuch kar na hai
Come on and take it just take it whatever comes your way
Dil se lelo jo kuch milta hai

11. నిగ్గదీసి అడుగు – Gaayam

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

12. హరే రామ – ఒక్కడు

పసిడిపతకాల హారం కాదురా విజయతీరం
ఆటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్దం
శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవరా
ఈ విజయదశమి కావాలంటే చెడును జయించరా

13. కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ – మహాత్మ

కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ..
భరత మాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ..
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ

14.నీదె నీదే – గోపాల గోపాల

బ్రహ్మల నినే నిను సృష్టించననుకొనా
బొమ్మల నువ్వే నన్ను పుట్టించావనుకొనా
నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో
ఏమి అంటుందో నీ భావనా

నీదె నీదే ప్రశ్న నీదే
నీదె నీదే బదులు నీదే

15. క్లాస్ రూములో – గులాబీ

క్లాస్ రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురు,
ఆహ బయట వున్నది ప్రపంచం అన్నది చూడరా గురు..
ఆహ పాఠాలతో, పట్టాలతో, టాటాలు బిర్లాలు కారెవ్వరు…

16. చక్రవర్తికీ వీధి – మనీ

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐనా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికి పాడెకట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ

17. కృష్ణం వందే జగద్గురుం

నరుని లోపల పరునిపై దృష్టి బరుపగా తలవంచి
కైమోడ్చి శిష్యుదవు నీవైతే నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే…..
వందే కృష్ణం జగద్గురుం…. వందే కృష్ణం జగద్గురుం

18. జగమంత కుటుంబం నాది – చక్రం

నా హ్రుదయమే నా లోగిలి
నా హ్రుదయమే నా పాటకి తల్లి
నా హ్రుదయమే నాకు ఆలి
నా హ్రుదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

19. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని – సింధూరం

కృష్ణుడు లేని కురుక్షేత్రమున
సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా
విశాల భారతమా
ఓ విషాద భారతమా

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని
స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మా వినాసపు అరాచకాన్ని
స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా

20. నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది…
నేపాడిన జీవన గీతం…ఈ గీతం..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR