అరుదైన మనిషి నుండి అందమైన అ..ఆ …

0
2245

By Harish Nagaraj

అందరు  సినిమా వేరు నిజ జీవితం  వేరు అంటారు , నిజానికి నిజ జీవితాల్లోనే అద్బుతమైన  సినిమాలు

ఉంటాయి , త్రివిక్రమ్  గారి సినిమాకి వెళ్ళడం అంటే ఒక బంధువుల ఇంటికి వెళ్తున్నాం అని

అనిపించేలా ఉంటుంది , వెళ్ళేటప్పుడు  అక్కడ ఎలా ఉంటుందో అనే ఆశ తిరిగొచ్చేటప్పుడు ఆనందం

అంటే , ప్రేమంటే ,ఆప్యాయత అంటే , ఇవేనా అని అనిపించేలా ఉంటాయి . అయన అక్షరాల భోజనం

పెట్టి , ప్రేమ అనే దాహం తీర్చి , ఆనందం అనే ఆయుధాన్ని బహుమతి గా ఇచ్చి సులువు గా మరో

సినిమాలో కలుద్దాం అంటారు. అసలు ఒక్క రెండున్నర గంటల సినిమాలోనే ఇంత ఉంది అంటే అయన

నిజ జీవితం లో అయన మనసులో అయన గడిపే క్షణాల్లో బ్రతుకంటే భావన ఎలా ఉంటుందో

ఊహించుకుంటుoటేనే  ఆ మనిషిని ఎంత గౌరవించిన  తక్కువే అనిపిస్తుంది కదా ? ఒక్క సారి అ..ఆ ..

పాటలు వినండి ప్రేతీ ఇంట్లో అయన చెప్పే ఒక అనసూయ తప్పక  ఉంటుంది … అయన చెప్పిన

విధానం లో అదే అనసూయ మన ఇంట్లో  ఉండటం అదృష్టం అని కూడా తెలుస్తుంది. అలాంటి వాళ్ళు

ప్రేమిస్తే చాల మధురం గా ఉంటుంది. ఆయనని మాటల మాత్రికుడు అని అనడం కన్నా  ఆయనే

దగ్గరుండి తెర మీద కనపడుతూ మన మనసుకి ప్రేమానురాగాలని మళ్ళి మళ్ళి  నేర్పిస్తున్న దేవుడు అని

అనాలనిపిస్తుంది  !!

mahatall_filmy

SHARE