This Guys’s Heartwarming Take On TSRTC Employees Explains Their Importance To Everybody

Contributed by Abhinav Manthangode

Okaside pandaga…valla oorlaki velladaniki ani jobs chese vallu office lo leaves petukuntunaru, college pillalu emo holidays ani cheppi intiki velladaniki ani ready aipotunaru. Kani ee gap lo anukokunda sudden ga TSRTC employees announce chesaru. Private sector kindha tamani government employees cheyalani…salaries penchalani…retirement age extension…pensions lantivi long demands lantivi ee strike venaka unna major reasons.

RTC Bus StrikeIla festival time lo RTC employees strike cheydam anedi konchem public ni ibbandi pette vishayame. Kani…vallaki kuda konni problems unnayi almost day lo 15 hours drive chese drivers…15 hours nilchoni job chese conductors ki manalanti janale vallaki families untayi..vallaki kastlau untayi…roju bus ekki road la meedha tirige villu ee roju road ekki samme chestunaru.

Kani villa mora vinakunda ippudu Telangana Government TSRTC lo pani chestunna 49,340 employees and workers ni dismiss chesthu sensational announcement chesindi. Anthe kadu at any cost employees demands ok cheyadaniki tagina resources levu Chief Minister eh oka official press note release chesaru.

Rtc StrikeIppudu ee situation lo em jaruguthondi teliyadu kani…RTC employees ni uddesisthu rasina oka letter matram kacchitanga vallu mana lives lo posisthunna major role matram chala peddadi…..

బస్సు ఆగిపోయింది…ముందుకు కదలనన్నది !

రైట్ …రైట్…అని బస్సును కదిలించే కండక్టర్ అన్న గొంతు మూగబోయింది…మన అందరిని సురక్షితంగా గమ్యనికి చేర్చే డ్రైవర్ అన్న రోడ్డెక్కాడు …!

నువ్వు కుటుంబంతో సంతోషంగా జరుపుకున్న ఎన్నో పండుగలకు సాక్ష్యమయ్యింది ఈ బస్సు. ఇప్పుడు ఆ ఆర్టీసీ కుటుంబాలు రోడ్డున్న పడి పోరాటం చేస్తున్నాయి. ఇప్పుడు నీకు ఉన్న ఉద్యోగం, చదివిన చదువు వీటికోసం తమ వంతు సహాయం చేసింది ఆ బస్సు. ఇప్పుడు మన ఆర్టీసీ సోదరుల ఉద్యోగాలు, వాళ్ళ పిల్లల చదువులు పనంగా పెట్టి పోరాడుతున్నారు.

మన అయినవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి చేర్చి ధైర్యం చెప్పడానికి ఎన్నో సార్లు నీకు దారి చూపింది బస్సు. ఇప్పుడు, ఆ బస్సుకి కష్టం వస్తే నా అనేవారు లేరు. ఎండనక.. వాననక.. రేయనక, పగలనక….ఎన్నో దారులను గమ్యం చేర్చింది బస్సు.

నీవు చేసిన కష్టం ఎక్కడికి పోదు….నీ హక్కులు నువ్వు సాధించాలని..మనసారా కోరుకుంటున్నా. నా జీవితంలో ఎన్నో ప్రయాణాలలో సహాయం చేసిన నీకు నా జోహార్లు.

మన ఆర్టీసీ సోదరుల కష్టాలకు, కన్నీళ్ళకు…గవర్నమెంట్ అండగా నిలవాలని, నిలుస్తుందని ఆశిస్తూ…….

ఇట్లు
ఒక ఆర్టీసీ ప్రయాణికుడు !

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR