Home Unknown facts వినాయకుడు వింతగా దర్శనమిచ్చే ఈ ఆలయాల దర్శనం ఒక అద్భుతం

వినాయకుడు వింతగా దర్శనమిచ్చే ఈ ఆలయాల దర్శనం ఒక అద్భుతం

0

వినాయకుడు విగ్నాలను నివారించే దేవుడిగా పూజలందుకుంటున్నాడుమన హిందూ సంప్రదాయంలో సకల దేవతలకు అధిపతి వినాయకుడుఆయన్ని గణేశుడుగణపతిగణనాయకుడుఏకదంతుడు ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారుఆ గణపతిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం దక్కుతుందని చెబుతారుఅందుకే ప్రతి పూజలోను ఆయనే మొదటగా పూజలందుకుంటాడుఇక ఈ ఆలయాల్లో దర్శనమిచ్చే వినాయకుడు మిగతా ఆలయాల్లో కంటే భిన్నంగా దర్శమిస్తుంటాడుమరి ఈ ఆలయాల్లో వినాయకుడు ఎలా దర్శనమిస్తుంటాడుఈ ఆలయాల్లో ఉన్న విశేషం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నాడి గణపతి:

vinayakudi vintha alayaluతమిళనాడు రాష్ట్రంతిరునల్వేరి జిల్లాలో కుర్తాళం ఉందిఇక్కడ ఉన్న గణపతి ని నాడి గణపతి అని పిలుస్తారుఇక్కడ గణపతి దేవుడిని ప్రతిష్టించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయాలనీ భావించగాఅది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వార్డ్ రాతికి ప్రాణ ప్రతిష్ట ఏంటి అంటూ అనడంతో ఆ సిద్ద యోగి ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పగా అతడు పిలిపించగామౌనస్వామి వైద్యుడితో విగ్రహానికి నాడి పరీక్షించామని చెప్పగా అతడు కూడా విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూ పరీక్షించి నాడి చప్పుడు లేదని చెప్పగాఅప్పుడు మౌనస్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి ఇప్పుడు చూడండి అని చెప్పగా స్టెతస్కోప్ తో పరిశీలించగా ఆ వైద్యుడిలో ఒక ఆశ్చర్యం గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకుంటుందని చెప్పాడుఇలా మౌనస్వామి మహిమ తో ఇక్కడ వెలసిన గణపతి దేవుడికి నాడి గణపతి అనే పేరు వచ్చినదిఅయితే ఇక్కడ స్వామివారి తొడల నుండి శబ్దం వచ్చినదని అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా ధోవతి కడతారు.

నరముఖ గణపతి:

తమిళనాడు రాష్ట్రంలోతిలతర్పణపురి అనే గ్రామంలో స్వర్నవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం ఉన్నది.ఇక్కడ వెలసిన వినాయకుడు తొండం లేకుండా మానవ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడుఈవిధంగా వెలసిన గణపతిని నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతి అని చాలా ప్రసిద్ధి చెందినదిఈవిధంగా వినాయకుడు మానవ రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదేనని చెప్పవచ్చు.

త్రిశుండ్ మయూరేశ్వర ఆలయం:

పూణే లోని సోమ్వార్‌లేన్‌లో త్రిశుండ్ మయూరేశ్వర ఆలయం ఉందిఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటేసాధారణంగా వినాయకుడు ఒక తలఒక తొండంనాలుగు చేతులతో దర్శనమిస్తుంటాడుకానీ ఈ ఆలయంలో మాత్రం మూడు తొండాలుఆరు చేతులతో దర్శనమిస్తుంటాడుఅంతేకాకుండా వినాయకుడి వాహనం ఎలుక కానీ ఈ ఆలయంలో నెమలి వాహనుడై వినాయకుడు భక్తులకి దర్శనమివ్వడం మరొక విశేషంఇక్కడ వినాయకుడు మూడు తొండాలతో దర్శనమిస్తుంటాడు కావున త్రిశుండ్ అనే పేరు వచ్చినదిఇంకా గర్భగుడిలో ఉన్న వినాయకుడు విగ్రహం నిలువెల్లా సింధూరంతో ప్రత్యేకంగా కనిపిస్తుంటాడు.

శ్రీ అమృత కడేశ్వరస్వామి ఆలయం :

తమిళనాడు రాష్ట్రంనాగపట్నం జిల్లాకి కొంత దూరంలో ఉన్న తిరుక్కాడియాయూర్ లో శ్రీ అమృత కడేశ్వరస్వామి ఆలయం ఉందిఈ ఆలయంలో ఆశ్చర్యం ఏంటంటేవినాయకుడిని దొంగ అని పిలుస్తారుపూర్వం దేవతలురాక్షసులు అమృతం కొరకు పాలకడలని మదించి అమృతం గ్రహించే సమయంలో గణపతిని పూజించడం మరచినారుఅప్పుడు వినాయకుడు ఆగ్రహించి ఒక బిందెడు అమృతం ప్రస్తుతం ఉన్న ఆలయ గర్భగుడిలో దాచిపెట్టగా ఆ బిందె నిండా ఉన్న అమృతం మహాశివలింగంగా అవతరించిందని పురాణంఈవిధంగా అమృతం నుండి ఉత్భవించిన ఆ స్వామికి అమృత కడేశ్వరస్వామి అనే పేరు వచ్చినదిఅయితే అమృతాన్ని దొంగలించినందున ఇక్కడ వినాయకుడిని కళ్ళల్ వినయగర్ అనే పేరు వచ్చినదికళ్ళల్ అంటే దొంగ అని అర్ధం.

కమండల గణపతి:

కర్ణాటక రాష్ట్రంచిక్కమగళూరు జిల్లా నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కమండల గణపతి ఆలయం ఉందిఈ ఆలయంలో వినాయకుడు కమండలం ధరించి భక్తులకి దర్శనమిస్తున్నాడు.

శ్వేత గణపతి:

తెలంగాణ రాష్ట్రంవరంగల్ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఈ శ్వేత గణపతి ఆలయం ఉందిఈ ఆలయంలో శ్వేతార్కమూల గణపతిగా భక్తులచే పూజలందుకొంటున్నాడుతెల్లజిల్లేడు మొక్క మూలం నుంచి వెలిశాడు కాబట్టి ఇక్కడి గణపతిని శ్వేతార్కమూల గణపతిగా పిలుస్తుంటారువందేళ్లపైబడిన ఈ ఆలయంలోని మూర్తిని ఏ శిల్పీచెక్కలేదు తెల్లజిల్లేడు మొదలు భాగంపై గణనాథుడే స్వయంగా వెలిశాడని చెబుతారుఇక్కడ చెట్టు బెరడుపైని గణపతి మూర్తికి అన్ని అవయవాలు ప్రస్ఫుటంగా కనిపించడం విశేషం.

సాక్షి గణపతి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకర్నూలు జిల్లా లో కృష్ణానది తీరంలో ఉన్న దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందుసముద్రమట్టానికి దాదాపుగా 458 మీఎత్తున్న కొండపైన వెలసిన అతి పురాతన శైవక్షేత్రం శ్రీశైలంశ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి సాక్షి గణపతి అనే ఆలయం ఉందిఈ ఆలయంలో విశేషం ఏంటంటే గణపతి విగ్రహం ఏదో వ్రాస్తున్న భంగిమలో కూర్చొని ఉన్న విధంగా భక్తులకి దర్శనం ఇస్తుంటాడుఇక సాక్షి గణపతి ప్రత్యేకత ఏంటంటేశ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించిన భక్తులను స్వామి తన చిట్టాలో వ్రాసుకొని కైలాసంలో ఉన్న పరమశివుడికి నివేదించి సాక్షముగా ఉంటాడని ప్రతీతిఅంటే శ్రీశైలానికి వచ్చి శివుడిని దర్శనం చేసుకున్న భక్తులకి కైలాసా ప్రవేశానికి అనుమతి లభిస్తుందని అప్పుడు శ్రీశైలానికి వచ్చిన భక్తులకి గణపతి సాక్షిగా ఉంటాడని చెబుతారుఇలా భక్తులు శ్రీశైలానికి వచ్చారని గణపతి సాక్ష్యంగా ఉంటాడు కనుక ఈ స్వామికి సాక్షి గణపతి అనే పేరు వచ్చినదని అంటారు.

మహా గణపతి ఆలయం:

కేరళ రాష్ట్రంలోని కాలికట్ కు దగ్గరలో కాసారగాడ్ అనే ఊరిలో మహా గణపతి ఆలయం ఉందిఈ ఆలయాన్ని మధురాలయం అని అంటారుఈ ఆలయంలో వినాయకుడు స్వయంభూగా వెలిశాడని ప్రసిద్ధిఈ ఆలయంలో కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్ని ప్రసాదంగా ఇస్తారుఇలా ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన ఈ ఆలయంలోని వినాయకుడు రోజు రోజుకి ఎత్తు పెరగడం భక్తులని ఆశ్చర్యానికి గురి చేస్తూ విశేషంగా ఆకట్టుకుంటుంది.

 

Exit mobile version