ఆశ్చర్యానికి గురిచేసే ఈ ఆలయాల్లో ఉన్న వింత ఆచారాలు ఏంటో తెలుసా?

0
2487

భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం హిందూమతం. దీనినే సనాతన ధర్మం అని అంటారు.  మన దేశంలో ఎన్నో ఆచారాలు, ఎన్నో నమ్మకాలూ అనేవి ఎప్పటి నుండో ఉండగా ఇప్పటికి వాటి పైన భక్తుల్లో నమ్మకం అనేది ఉంది. అయితే ఈ కొన్ని ఆలయాల్లో మాత్రం అన్ని ఆలయాలకు బిన్నంగా కొన్ని వింత ఆచారాలు అనేవి ఉన్నవి. మరి ఆ వింత ఆలయాలు, వింత ఆచారాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కాళీమాత ఆలయం – ఉత్తరప్రదేశ్:

2019-06-27 (1)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని, కాన్పూర్ జిల్లా, బెంగాలీ మొహల్లాలో అతి పురాతనమైన కాళీమాత దేవాలయం ఉంది. ఇక్కడి భక్తులు అమ్మవారిని తాలే వాలీ దేవి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆలయంలో ఎటువంటి కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే కోరికలు నెరవేరడానికి మాత్రం ఓ తాళం కప్ప తెచ్చి తాళం వేస్తే సరిపోతుందని గుడి పూజారులు అంటున్నారు. మహిళ భక్తులు కొనసాగిస్తున్న ఈ ఆచారం కొన్ని శతాబ్దాల నుండి ఇక్కడ ఉందని చెబుతున్నారు.

కొండమయి దేవత ఆలయం:

vintha alayam

తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో, మహబూబ్ నగర్, నారాయణపేట దగ్గరలో ఉన్న కందుకూరు గ్రామంలో ఒక కొండపైన కొండమయి దేవత ఆలయం ఉంది. ఇక్కడి గ్రామస్థులు తేళ్ళని దేవతగా భావిస్తూ కొండమయి దేవత గా కొలుస్తారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఇక్కడ నాగుల పంచమి రోజున ఈ ఆలయంలో తేళ్ల ఉత్సవం జరుగుతుంది. ఆశ్చర్యంగా ఈ ఉత్సవం అప్పుడు విషపూరితమైన తేళ్ళని భక్తులు చేతులతో పట్టుకున్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హాని అనేది జరగదు.

రావణుడిని కొలిచే గ్రామం:

vintha alayam

మధ్యప్రదేశ్, ఉజ్జయిని, చిక్కాలి అనే గ్రామంలో రావణుడి మాత్రమే పూజిస్తారు. ఇక్కడ రావణుడిని పూజించకపోతే ఉరికి అరిష్టమని భక్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం దశమి అప్పుడు ఈ గ్రామంలో రావణుడికి జాతర అనేది నిర్వహిస్తుంటారు.

వీసా దేవుడు – పంజాబ్: 

vintha alayam

పంజాబ్ లో విమాన దేవాలయం ఉంది. ఈ సిక్కుల దేవాలయాన్ని ఒకప్పుడు షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వార్ గా పిలువగా ప్రస్తుతం హవాయూ జహాజ్ గురుద్వారాగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు ఈ ఆలయంలో విమానం బొమ్మను సమర్పిస్తారు, అంతేకాకుండా ఆలయానికి వచ్చిన భక్తులకు కూడా విమానం బొమ్మని ప్రసాదంగా ఇస్తుంటారు. ఇలా ఇవ్వడం వలన వారికీ త్వరగా వీసా వస్తుందని వారి నమ్మకం.

కాళికాదేవి ఆలయం:

vintha alayam

కోలకతాలోని ట్యాంగ్ర అనే గ్రామంలో కాళికాదేవి ఆలయం ఉంది. ఇక్కడ ఈ ఆలయాన్ని చైనీయులు నిర్మించుకోగా భక్తులకి ప్రసాదంగా  నూడుల్స్, చూప్‌సుయ్, అన్నం, కొన్ని రకాల వెజిటబుల్ సూప్స్ వంటి ఇస్తుంటారు.

శనిదేవుని ఆలయం: 

vintha alayam

మహారాష్ట్ర, షిరిడి కి 60 కిలోమీటర్ల దూరంలో శింగణాపూర్ గ్రామంలో శనిదేవుని ఆలయం ఉంది. ఇక్కడ శని దేవుడికి ఆలయం అంటూ ఉండదు. ఒక పెద్ద శిల లింగరూపంలో వెలసి ఉన్నది. ఇక్కడ శనిదేవుడు స్వయంభువుగా వెలిశాడని ఇది శనిదేవుడి నివాసప్రాంతంగా చెబుతారు.  ఇక ఈ గ్రామంలో విశేషం ఏంటంటే, ఏ ఇంటికి కూడా తలుపులు అనేవి ఉండవు, వాహనాలకు కూడా తాళం అంటూ వేయరు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి దొంగతనాలు జరగగకుండా ఆ శని దేవుడి వీరిని రక్షిస్తాడని గ్రామస్థులు నమ్మకం. ఒకవేళ ఎవరైనా ఇక్కడ దొంగతనం చేస్తే వారికీ ఆ రోజే ఆ శనిభగవానుడు శిక్షిస్తాడని, గుడ్డివారవుతారని నమ్మకం. అందుకే వాహనాలకు, ఇంటికి ఈ గ్రామస్థులు తాళం వేయకూడదనే ఒక నియమం ఉంది.

SHARE