Home Entertainment This Guy’s Unapologetic Admiration Letter To Puri Jagannadh Will Give You Goosebumps

This Guy’s Unapologetic Admiration Letter To Puri Jagannadh Will Give You Goosebumps

0

Written By: Sumanth Bagannagari

A Love Letter to Puri Jagannadh

చిన్నప్పుడు నేను ఎవరితో ఎక్కువ మాట్లాడేవాణ్ణి కాదు. ఎవరైనా bully చేస్తారేమో అని schoolలో ఉన్నప్పుడు చాలా భయపడే వాణ్ణి. మెల్లగా సినిమాలు చూస్తూ, పూరి జగన్నాథ్ అనేటోడి సినిమాలు చూసాను. ఆడెవడో నాకు తెల్వదు గానీ, ఆడి సినిమాల్లో నేను ఒకటి గమనించా, హీరోలు అంతా ఆల్ల పేర్లు గట్టిగా అరుచుకుంటూ చెప్పేవాళ్లు. “నువ్వు నందా అయితే నేను బద్రి, బద్రినాథ్”, “పారిపోతే ఆ commissioner పారిపోవాలి బాబాయ్, చంటి గాడు లోకల్”, పండు గాడు, గంగారాం, సూర్య భాయ్, దయా, ఇస్మార్ట్ శంకర్ ఇలా ఒక గర్వం, ఒక పొగరు, దీనమ్మ నేను ఇది అని. అలాంటి ఎదవల్ని చూసి నేను ఎదవని అయ్యాను. నేను మాట్లాడగలుగుతున్నాను. నా పేరు గట్టిగా అరుచుకుంటూ చెప్పుకోగలుగుతున్నాను.

పూరి, ఆడి హీరోలకి సరదా తీర్చేస్తాడు, జీవితం లాగా. రోడ్డు మీద పడేస్తాడు, police station మెట్ల మీద పడుకోబెడతాడు. తల పగలగొట్టి beachలో పడేస్తాడు. ఒక సముద్రం ఒడ్డున కూర్చొని ఆకాశాన్ని చూస్తూ, అరె ఎంత బాగుంది! అనుకుంటూ పడుకుంటే, అదే ప్రకృతి సునామీతో ముంచి చంపేసేంత భయంకరం అని చెప్తాడు. కానీ అదే వరదల్లో ఇల్లు మునిగిపోతే, పదేళ్ల పిల్లోడు కూడా “మనం ఏదోక రోజు ఇల్లు కట్టుకుందాం” అనేంత దమ్ము ఉండాలి అంటాడు. చచ్చాక పడుకో రా, ఎవడడిగాడు నిన్ను? అంటాడు.

1.puriఆడి సినిమాలు industry hit అయి ఉండొచ్చు, utter flop అయి ఉండొచ్చు, కాని ఇవన్నీ తర్వాత ముచ్చట. సినిమా చూసిన ప్రతి సారీ, నువ్వు ఒక ఎదవవే అని నీకు గుర్తు చేస్తాడు. అదే ఆడి సినిమా. అదొక్కటే ఆడి సినిమా. ఆడి సినిమాల్లో కొన్ని మనకి తగకపోవచ్చు, అంత progressive to the day అవ్వకపోవచ్చు. కానీ, ఆడంటే ఒక ధైర్యం, ఒక బలుపు. ఎలాగో చచ్చిపోతాం కదా అని, ఇంటి ఓనర్ ని ఏసుకునేంత బలుపు. ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి, రోజూ అదే బలుపు maintain చెయ్యమంటాడు ఆడు.

ఉప్పు, కారం తినే ప్రతి ఎదవకీ ladies weakness ఉంటది అంటాడు ఆడు. Love చెయ్యడానికి, ముద్దు అడగటానికి భయపడకు అంటాడు ఆడు. ఏం? మీకేనా మోహం? మా అమ్మాయిలకి కూడా ఉంటది అంటాడు. శృతి అనే అమ్మాయి దొరికింది అంటగా, ఇచ్చేయవ్వా? అంటే, ఆ revolver నాదే, ఎప్పుడు ఇస్తున్నావ్ revolver అంటాడు. బొక్కలో జీవితం, ఎలాగో పోతాం, అదేదో ప్రేమ accountలో ఏసేద్దాం అంటాడు. ఆడు అడవిలో బతుకుతున్నాడు. చచ్చిపోతావా నా కోసం అని లాగి పెట్టి కొడతాడు, నువ్వు పోతున్నావా, నేను పోతా అని కాల్చుకోమంటాడు. మనుషుల rules, Animalsకి apply అవ్వవు. కుదిరితే నువ్వు నాలాగా Animal Lover అయిపో అంటాడు.

అప్పుడెప్పుడో పూరి పని అయిపోయింది అన్నారు, కానీ ఆడు ప్రతీ సారీ No, it’s not over అని గట్టిగా కొట్టి మరీ చెప్తున్నాడు. ఆడి నుంచి నేర్చుకోవాల్సింది కొట్టడం కాదు, ముక్కు పగిలి రక్తం కారుతున్నా, అది తుడుచుకోని, మళ్లీ ringలో నిలబడటం. నీ సినిమా దొబ్బేసినోణ్ణి, అదే సినిమా reelతో కొట్టడం. నువ్వు నమ్మిన దాని కోసం, ఉరి శిక్ష కి కూడా ready అయిపోయేంత intensityతో పాటు, నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం building ఎక్కి దూకి, మధ్యలో return వొచ్చి నేను లేకుండా ఎలా బతుకుతావ్ అనేంత madness ఉండటం.

సినిమా ఎలా ఉందో పక్కన పెడితే, ఇది ఆడి సినిమా. సరదా అయితే తీర్చేస్తది. “ఈ వయసు, ఈ మోహం మళ్లీ రావు. ఏదైనా ఇప్పుడే” అని ఈ అడవి మీద పడిపోమంటది.

Thank you Puri Jagannath for teaching me the word, UNAPOLOGETIC.

Exit mobile version