Home Unknown facts రాముడు నిర్మించిన పురాతన కాలం నాటి రామసేతు గురించి ఆశ్చర్యకర విషయాలు

రాముడు నిర్మించిన పురాతన కాలం నాటి రామసేతు గురించి ఆశ్చర్యకర విషయాలు

0

రామాయణంలో రావణుడు సీతని అపహరించి లంకకి తీసుకెళ్లిన తరువాత రాముడు వానర సైన్యం సహాయంతో సముద్రంలో లంకకి వెళ్లేందుకు ఒక వారధి నిర్మిస్తారు. ఇది ఇలా ఉంటె మన దేశం నుండి శ్రీలంకకు సముద్ర మార్గంలో ఉన్న ఈ  మార్గం మానవులు నిర్మిచలేదంటూ అది రామాయణంలోని రామసేతుగా కొందరి వాదన. మరికొందరు ఏమో ఈ వారధి రాముని కాలం నాటిది కాదు మనుషులు నిర్మించిన వారధిగా వాదిస్తున్నారు.  ఇదే విషయం పైన సుప్రీం కోర్తులో కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి.  ఎప్పుడో పురాతన కాలం నాటి రామసేతు కొన్ని సంవత్సరాలుగా ఎందుకు ఈ విషయం పైన చర్చలు మొదలయ్యాయి? ఇది నిజంగా రాముడు నిర్మించిన వారధి కాదా? గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు రామసేతు గురించి ఏమని వెల్లడించారు అందులో నిజం ఎంత ఉంది అనే  విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Adam's Bridgeరామసేతు గురించి ముందుగా రామాయణంలో రాములవారు రామసేతు ఎలా నిర్మించారో తెలుసుకుందాం. లంకలో ఉన్న సీతని రావణుడి నుండి కాపాడుకోవడానికి సముద్రమార్గం గుండా రామసైన్యం లంకకు వెళ్ళడానికి ఒక వారధి కావలి. ఆ సమయంలో వానర సైన్యంలో ఉన్న నలుడు, నీలుడు ఇద్దరు కూడా రామసేతు నిర్మాణానికి ఎంతగానో సహాయపడతారు.

వీరు వారధి నిర్మాణానికి సహాయపడటం వెనుక కూడా ఒక పురాణం ఉంది. ఈ నల,నీలులు ఇద్దరూ చిన్నప్పుడు మహా అల్లరి చేసేవారట. రుషులు తపస్సు చేసుకుంటూ ఉంటే వారి వస్తువులన్నింటినీ ఎత్తుకువెళ్లి నీటిలో పడవేసేవారట. అందుకని నల,నీలులు నీటిలో ఏం వేసినా కూడా అవి మునిగిపోవంటూ రుషులు శపించారు. ఇప్పుడు ఆ శాపాన్నే వరంగా మార్చుకుని సముద్రం మీద వారధిని నిర్మించేందుకు నల,నీలులు సిద్దయమయ్యారని చెబుతారు. ఇలా నలుడు, నీలుడు, హనుమంతుడు, 10 మిలియన్ల వానర సైన్యంతో రామసేతుని  ఐదు రోజులలో నిర్మించారని రామాయణంలో తెలుపబడింది.

ఇక మన కలిగియుగానికి వస్తే, తమిళనాడులోని పంబన్ దీవి, శ్రీలంకలోని మన్నార్ దీవి మధ్య రామ సేతు ఉంది. దీన్నే ఆడమ్ బ్రిడ్జిగానూ వ్యవహరిస్తుంటారు. అయితే క్రీ.శ. 1480 వరకు రామేశ్వరంలోని రామసేతు నిర్మాణం సముద్ర ఉపరితలం పైన కనిపిస్తుండేదని చెబుతుంటారు. కానీ ఆ తరువాత వచ్చిన సముద్రంలోని అలజడులు, తుఫానుల కారణంగా రామసేతు నీటిలో మునిగిపోయిందని చెబుతుంటారు. ఈ సునామి కారణంగా చెల్లా చెదురు అయినా కొన్ని రాళ్ళూ ఇప్పటికి రామేశ్వరంలో నీటి పైన తేలుతూ మనకి కనిపిస్తాయి.

అయితే అసలు రామాయణంలో రామసేతు లేదు అసలు రామాయణం ఒక కథ మాత్రమే నిజంగా జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అంటూ కొందరు వాదించారు. అలాంటి వారిని సైతం ఆశ్చర్యానికి గురిచేసేలా రామేశ్వరం నుండి శ్రీ లంకకు సముద్ర మార్గంలో ఒక వారధి ఉన్నట్లుగా నాసా ఒక ఫోటో ని విడుదల చేసింది. ఇది జరిగినప్పటికీ నీటిలో తేలియాడే రాళ్ల గురించి అక్కడి వారధి గురించి శాస్త్రవేత్తలు వారి పరిశోధనలో కొన్ని విషయాలను వెల్లడించారు.

రామసేతులో ఇసుకపై రాళ్లు ఉన్నట్టు కనిపిస్తున్నా, రాళ్లను అమర్చిన తర్వాతే ఇసుక వచ్చి చేరిందని చెప్పారు. అయితే కార్బన్‌ డేటింగ్‌ ప్రకారం రామసేతులోని రాళ్లను ఏడువేల ఏండ్ల కిందట అమర్చగా, దాని కింద ఉన్న ఇసుక వయసు కేవలం నాలుగు వేల ఏండ్లు మాత్రమేనని వెల్లడించారు. ఇక నీటిలో తేలే ఆ బండరాళ్లు సముద్రంలో ఏర్పడిన అగ్నిపర్వతం అప్పుడు అవి ప్యూమిస్ రాళ్లుగా,  చెబుతారు. కానీ ఇప్పటివరకు ఆ చుట్టూ పక్కల ఎప్పుడు కూడా అగ్నిపర్వతం సముద్రంలో ఏర్పడలేదంటూ కూడా వాడే వెల్లడించారు. అంతేకాకుండా ప్యూమిస్ రాళ్ళూ అగ్నిశిల రాళ్ల  చాలా తేలికగా రంగు తెల్లగా లేదా క్రీము రంగులో ఉంటుంది. కానీ రామేశ్వరంలోని నీటిలో తేలియాడే రాళ్ళూ మాత్రం నలుపు రంగులో ఉంటూ చాలా బరువుగా ఉంటాయి.

ఇంకా కొందరు శాస్రవేత్తలు ఈ వంతెన పగడపు నిర్మాణం అంటూ చెప్పుకొచ్చారు. కాల్షియం కార్బొనేట్, మరియు దాని రసాయనిక కూర్పు వలన ఇవి సహజంగా సముద్రంలో ఏర్పడ్డాయి అంటారు. కానీ ఒక్క రామేశ్వరంలో మాత్రమే ఈవిధంగా ఎందుకు ఏర్పడ్డాయనే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు.

ఇది ఇలా ఉంటె రామేశ్వరంలోని రాళ్ళూ తేలుతూ సముద్రంలో ఉండటం మూలాన శ్రీలంక నుండి భారతదేశానికి వచ్చే నౌకలకి దాని చుట్టూ తిరిగి రావడానికి 500 కీ.మీ. దూరం ఎక్కువ కావడమే కాకుండా తిరిగి రావడానికి దాదాపుగా 25 గంటల సమయం పడుతుందని అందుకోసం అడ్డుగా ఉన్న రామసేతుని తొలగించి సేతుసముద్రం ప్రాజెక్టు కీ చెప్పట్టాలని అప్పట్లో భావించారు. కానీ ఇది పెద్ద చర్చనీయాంశం అవుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ సుప్రీంకేసులో కేసులు కూడా నమోదుచేశారు. మొదటగా రామసేతు రామాయణం కాలం నాటిదంటూ ఎలాంటి ఆధారాలు లేవంటూ సేతుసముద్రం ప్రాజెక్టు కీ కోర్టు లైన్ క్లియర్ చేసింది. కానీ ప్రముఖ లాయర్ అయినా సుబ్రహమణ్యం స్వామి పిటిషన్ తో మళ్ళీ కేసు మొదటికి వచ్చింది.

సుప్రీంకోర్టు మతపరమైన ఆధారాలను ద్రువికరించకపోవడంతో, సేతుసముద్రం ప్రాజెక్టు కట్టడం వలన మనకి లాభం ఎక్కువగా ఏమి లేదు, ఎందుకంటే రామసేతు దగ్గర సముద్ర మట్టం ఎక్కువగా లోతు అనేది లేకపోవడం వలన ఎక్కువ టన్నుల బరువు మోసే నౌకలు ఆ దిశగా వెళ్లడం సాధ్యం కాదు అంతేకాకుండా నౌకల ప్రవాహం వలన ఏడ్పడే ఇసుక దిబ్బలను ప్రతి సంవత్సరం తీయడానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అంటూ అయినా సుప్రీంకోర్టు కీ తెలియచేసాడు. అప్పుడు సుప్రీంకోర్టు సేతుసముద్రం ప్రాజెక్టు పైన స్టే విధించింది.

ఇలా రామసేతుపైన అటు శాస్త్రవేత్తలు నుండి ఇటు రాజకీయ నేపథ్యంలో ఎన్నో వాదనలు ఉన్నపటికీ హిందూ సంప్రదాయం గౌరవించే ప్రతి ఒక్కరు కూడా అది రాముడు కట్టించిన రామసేతు అని తేలియాడే బండలు వెలుగు చూసినట్లు, నాసా గుర్తించిన ఫోటో ఆధరంగా అక్కడ రామసేతు ఉందనేదానికి బలమైన ఆధారం అదే అంటూ ఇంకా రాబోయే పరిశోధనలో రాముడి యొక్క గుర్తులు లేదా రామాయణానికి సంబంధించి ఏవైనా ఆధారాలు తప్పకుండ లభిస్తాయని విశ్వసిస్తున్నారు.

Exit mobile version