ఆలయంలో స్వామివారికి ఎదురుగా నంది విగ్రహం లేని ఆలయం ఎక్కడ ఉంది?

ఈ ఆలయం లో విశేషాలు ఏంటంటే, ఇక్కడ స్వామివారికి, అమ్మవారికి విడివిడిగా ఆలయాలు అనేవి ఉన్నాయి. ఇంకా ప్రతి ఆలయం లో నంది విగ్రహం అనేది స్వామివారికి ఎదురుగా ఉంటుంది, కానీ ఈ ఆలయంలో స్వామివారికి ఎదురుగా నంది విగ్రహం అనేది ఉండదు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Shri Airavatesvara Templeతమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, కుంభకోణానికి సుమారు 4 కి.మీ. దూరంలో ధారసూరం అనే గ్రామంలో శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ఉన్న ఈ ఆలయాలు 11 వ శతాబ్దానికి చెందినవిగా తెలియుచున్నది. ఇక్కడ ఉన్న ఈ రెండు ఆలయాలు కూడా గొప్ప శిల్పకళా సంపదతో నిర్మించబడినాయి. ఈ రెండు ఆలయాలు ఒకటి స్వామివారిది, ఒకటి అమ్మవారిది.

Shri Airavatesvara Templeయునెస్కో ఈ మందిరాన్ని సాంస్కృతిక పరిరక్షణ ఆలయంగా గుర్తించింది. ఈ ఆలయంలో స్వామివారి పేరు రాజరాజేశ్వరుడు, అమ్మవారి పేరు రాజరాజేశ్వరీదేవి. అయితే ఈ ఆలయాన్ని నిర్మించిన రాజు తన పేరు కలసి వచ్చే విధంగా స్వామివారికి ఈ పేరుని నిర్ణయించాడని అందుకే ప్రస్తుతం స్వామివారిని భక్తులు ఐరావతేశ్వర స్వామి గా కొలుస్తున్నారు.

Shri Airavatesvara Templeఇక ఆలయం ప్రకారం లోపలకు వెళ్ళడానికి ఆలయ ప్రకారం బయటవైపున గోపుర ద్వారానికి ఎదురుగా రెండు చిన్న మండపాలు ఉన్నాయి. అందులో ఒకదానిలో నంది విగ్రహం ఉంది. అయితే ప్రతి ఆలయంలో నంది విగ్రహం ఆలయ ప్రకారంలోపలనే స్వామివారికి ఎదురుగా ఉంటుంది. కానీ ఈ ఆలయంలో ప్రకారం బయట నంది విగ్రహం ఉండటం విశేషం.

Shri Airavatesvara Templeఈ ఆలయ గోడమీద ఎక్కడ ఖాళీ అనేది లేకుండా చక్కని శిల్పాలు చెక్కబడినవి. ఈ గోడల గూళ్ళలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. ఈ గూళ్ళకి రెండు పక్కల చోళ చక్రవర్తుల రాజలాంఛమైన సింహపు ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR