ప్రపంచంలో కొన్ని చరిత్రకి సాక్షాలుగా ఇప్పటికి నిలిచి ఉన్నాయి. అలా చరిత్రకి సాక్ష్యంగా ఈ దేవాలయ సముదాయం ఒకటిగా చెప్పుకోవచ్చు. మరి యునెస్కో జాబితాలో ప్రపంచ పర్యాటక స్థలాలుగా గుర్తించబడ్డ ఈ దేవాలయ సముదాయం ఎక్కడ ఉంది? అక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం, బగల్ కోట్ జిల్లా, బాదామికి కొన్ని కిలోమీటర్ల దూరంలో పట్టడికల్ పట్టణం కలదు. ఈ ప్రాంతంలో బాదామి చాళుక్యులు అనేక దేవాలయాలను నిర్మించారు. ఈ ఆలయంలలో కొన్ని శిథిలం అవ్వగా కొన్ని అప్పటి చరిత్రకి సాక్ష్యంగా నిలిచాయి. ఈ ఆలయ సముదాయంలో విరుపక్షాలయానికి ఉత్తరంవైపు గల శ్రీ మల్లికార్జున ఆలయం అపారమైన శిల్పసంపదతోను, విశాలమైన మండపాలతోను అలరారుతూ విరూపాక్ష ఆలయాన్ని పోలి ఉంది. ఇక విరూపాక్ష ఆలయానికి ముందు భాగం లో వలెనే చక్కని నంది మండపం నిర్మించబడింది. కానీ ఇది ప్రస్తుతం పూర్తిగా శిధిలావస్థలో ఉంది. బాదామి చాళుక్యులు పట్టదకల్లులో మల్లికార్జునస్వామి ఆలయాన్ని కట్టించినట్లుగానే పట్టుదకల్లుకు 12 కిలోమీటర్ల దూరంలోని మహాకూటలో గల మహాకూటేశ్వరాలయ ప్రాంగణంలో వృద్ధ మల్లికార్జునస్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. బాదామికి 22 కిలోమీటర్ల దూరంలో మలప్రభ నదీతీరాన అప్పటి చాళుక్యుల రాజధాని పట్టడికల్. అయితే ఇక్కడే 8 వ శతాబ్దానికి చెందిన అనేక చారిత్రాత్మక నిర్మాణాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా యునెస్కో జాబితాలో ప్రపంచ పర్యాటక స్థలాలుగా గుర్తించబడ్డాయి. ఇక ఇక్కడ ఉన్న సంగమేశ్వర ఆలయం విషయానికి వస్తే, ఈ ఆలయాన్ని చాళుక్య రాజైన విజయాదిత్యుడు నిర్మించాడు. ఈ ఆలయాన్ని ద్రావిడ శిల్ప రీతుల్లో నిర్మించారు. ఇక్కడ ఉన్న గోడ మీద ఉగ్ర నరసింహస్వామి, నట రాజస్వామి శిల్పాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్న మహాగోపురం మూడు అంతస్తులుగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడే ఉన్న పాపనాధా ఆలయ విషయానికి వస్తే, ఈ దేవాలయాన్ని క్రీ.శ. 680 లో వేసరా వాస్తు శిల్ప రీతిలో నిర్మించారు. ఈ ఆలయం మొత్తం కూడా రామాయణ, మహాభారత గాధలతో కూడిన దృశ్యాల పలకాలతో పొందుపరిచారు. ఇలా అప్పటి చరిత్ర తెలియచేసే ఈ ఆధ్బుత కట్టడాలను చూడటానికి ఎప్పుడు సందర్శకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.