Home Unknown facts శ్రీ మహావిష్ణువు విగ్రహం ముందు నుంచి పురుష రూపం, వెనుకనుంచి మోహినీ రూపం ఉన్న ఆలయం

శ్రీ మహావిష్ణువు విగ్రహం ముందు నుంచి పురుష రూపం, వెనుకనుంచి మోహినీ రూపం ఉన్న ఆలయం

0

ప్రతి దేవాలయంలోని విగ్రహానికి ఒకే రూపం ఉంటుంది. కానీ ఈ ఆలయంలోని విగ్రహానికి ముందు నుండి పురుషుని రూపం ఉంటె వెనుక భాగం స్త్రీ రూపంలో దర్శనమిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ ఒక్క ఆలయంలోనే ఈ ఆశ్చర్యాన్ని కలిగించే విగ్రహం ఉన్నది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ విగ్రహం అలా ఉండటానికి గల రహస్యం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

purusha roopaluతూర్పుగోదారి జిల్లా, రాజమండ్రికి 36 కిలోమీటర్ల దూరంలో రావులపాలెంలో ఈ విగ్రహం ఉన్న శ్రీ జగన్మోహిని కేశవాలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిస్తాడు.
ఈ ఆలయ పురాణానికి వస్తే , మోహినిని చూసిన శంకరుడు మాయామోహంలో పడి ఆవిడని వెంబడించాడు. మోహిని ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆవిడ తలలోనుంచి ఒక పువ్వు ఇక్కడరాలి పడిందిట. దానిని వాసన చూసిన శివుడుకి మాయ వీడిపోయ ఎదురుగా విష్ణు భగవానుని చూశాడట. ఆ కధకి నిదర్శనంగానే శ్రీ మహావిష్ణు విగ్రహం ముందు నుంచి పురుష రూపం, వెనుకనుంచి మోహినీ రూపంతో ఉన్నదని చెబుతుంటారు.

ఇక ఆలయ నిర్మాణానికి వస్తే 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్నిచోళరాజులు పరిపాలిస్తూండేవాళ్ళు. అప్పుడు ఇక్కడంతా దట్టమైన అరణ్యాలు వుండేవి. చోళ రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు. కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన రాజు ఒక చెట్టుకింద పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనబడి, తన విగ్రహం ఆ ప్రాంతాల్లో వుందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు. ఆ విగ్రహాన్నికనుగొనటానికి ఒక చెక్క రధాన్ని ఆ ప్రాంతంలో లాగుకుని వెళ్తుంటే ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో అక్కడ తవ్విస్తే విగ్రహం కనబడుతుందని చెప్పాడు. విక్రమదేవుడు భగవతాదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని కట్టించాడు.


ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైవున్న ఈ ఆలయంలోని స్వామి సౌందర్యం వర్ణనాతీతం. ఐదు అడుగుల ఎత్తైన సాలిగ్రామ శిల ఇది. మకరతోరణంమీద దశావతారాలు, నారద, తుంబురులు, ఆదిశేషు, పొన్నచెట్టు, గోవర్ధనగిరి, మహర్షులు, అన్నీ ఆవిగ్రహం చుట్టూ వున్నాయి. ఆ విగ్రహంయొక్క గోళ్ళు కూడా చాలా సజీవంగా కనిపిస్తాయి.

ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపించినవారికి తప్పకుండ వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతారని ఇక్కడి భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయాన్నిబదిలీ ఆలయం అని కూడా పిలుస్తుంటారు.

Exit mobile version