త్రిమూర్తులలో ఒకరు పరమశివుడు. మన దేశంలో ఎన్నో అద్భుత శివాలయాలు అనేవి ఉన్నాయి. కానీ ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇక్కడ కొలువై ఉన్న స్వామి శివుడి అంశగా చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ స్వామిని శివుడి అంశ అని ఎందుకు అంటారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రం, మాంగ్ సులి అనే ప్రాంతంలో ఖండోబా ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన గ్రామ దేవత ఆలయంగా చెబుతారు. ఇక్కడ ఉన్న మార్తాండ భైరవుడు శివుడి యొక్క మరొక రూపం అని తెలియుచున్నది.
ఇక పురాణానికి వస్తే, ఈ ప్రాంతంలో మల్లా మరియు మణి అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ దేవుడికోసం తీవ్ర తపస్సు చేసి ఎవరి వల్ల మరణం కానీ, ఓటమి కానీ ఉండకూడదు అనే వరాన్ని పొందుతారు. ఇలా వర గర్వముతో దేవతలను, మునులను, మనుషులను బాధిస్తుండగా అందరు కలసి శివుడిని ప్రార్ధించి రక్షించమని కోరారు.
ఇలా వారికీ అభయం ఇచ్చిన శివుడూ, ఆ తరువాత శివుడి అంశతో మార్తాండ భైరవుడు అనే ఒక వీరుడు ఉద్బవించాడు. ఆ వీరుడు మూడు కన్నులను కలిగి ఉండి ముఖం బంగారు రంగులో ఉంది. ఇంకా ఆయన ఫాలభాగంలో ఒక నెలవంక కూడా ఉంది. ఇక అప్పుడు దేవతలందరు అతడికి తోడు రాగ ఆ రాక్షసులపైనా యుద్దానికి వెళ్ళాడు. ఇలా ఆ స్వామిని వారిని వాదిస్తుండగా మణి అనే రాక్షసుడు క్షమించమని ప్రార్ధించి చివరి కోరికగా ఇక్కడే మీతో పాటు ఉంటానని కోరుకున్నాడు. అందుకే ఈ ఆలయంలో మణి అనే రాక్షస విగ్రహం కూడా మనం చూడవచ్చు.
ఇలా ఆలయ విషయానికి వస్తే, శివుడి యొక్క మరొక రూపం అని చెప్పే మార్తాండ భైరవుడిని మహారాష్ట్రలో కొందరు కుల దైవంగా భావిస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఆరాధన విషయంలో శైవ, వైష్ణవ, జైన మరియు ముస్లిం మతాల సంప్రదాయాలు కలబోతగా కనిపిస్తాయి.
ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఖండోబా ఆలయానికి ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.