అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారు ఆ పండగ విశిష్టత ఎంటో తెలుసా ?

వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు, మహాలక్ష్మిని శ్రీహారి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే. ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని భక్తుల నమ్మకం.

Akshaya Tritiyaఅయితే, బంగారం కొనాలనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తూన్నా ఎన్నో ప్రత్యేకతలు దీని సొంతం. ఈ రోజు చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు అక్షయమైన ఫలితాలనిస్తాయి. ఇదే విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం వివరిస్తోంది. అక్షయ తృతీయనాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలానిస్తాయని నారద పురాణం చెబుతోంది. ఈ శుభ తిథిన ఏ పనిచేసినా అది విజయవంతం అవుతుంది. అలాగే ఈ రోజు దుర్ముహూర్తాలూ, వర్జ్యాలూ ఉండవు. ఈ తిథి రోజు మొత్తం శుభకార్యాలను జరపించుకోవచ్చు.

Akshaya Tritiyaఈ రోజు అక్షయతృతీయను పసిడిరాసుల పర్వదినంగా భావిస్తారు. చాలా మంది ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్ధం. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువుతీరుతుందని చాలా మంది విశ్వాసం. అక్షయ అంటే.. తరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా వుండేది. అందువల్లే ఈరోజు ప్రతిఒక్కరు ఆభరణాలు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవడం చేస్తారు. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. మన అవసరాలకు తగ్గట్టు ఉపయోగపడే వస్తువు. అంటే.. ఆర్థికంగా ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే.. అక్షయ తృతీయరోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసివస్తుందని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు.

Akshaya Tritiyaత్రేతాయుగం మొదలైన రోజు, విష్ణు స్వరూపుడయిన పరశురాముడు జన్మించింది ఇదే రోజున అని చెబుతుంటారు. అలాగే శ్రీ కృష్ణుడి సోదరుడు బలరాముడు జన్మించిన రోజుగా చెబుతుంటారు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులకు కృష్ణుడు అక్షయ పాత్రను ఇచ్చిన రోజు ఇదే. కురు సభలో తనకు జరుగుతున్న అవమానానికి నీవే దిక్కంటూ చేతులు జోడించి వేడుకున్న ద్రౌపదికి దేవదేవుడు అక్షయంగా చీరలు ఇచ్చిందీ ఈ రోజే. మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు రాయడం ప్రారంభించిందీ, శివుని జటాజూటం నుంచీ భూలోకానికి గంగ చేరింది కూడా ఈ సుదినమే.

Akshaya Tritiyaఅలాగే శ్రీకృష్ణుడి స్నేహితుడైన సుదామా.. తన పాడైన అటుకులు తీసుకోని శ్రీకృష్ణుడిని కలవడానికి వస్తాడు. ఇక సుదామా పరిస్థితి తెలుసుకున్న కృష్ణుడు అతనికి అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తాడు. దీంతో సుదామా భాధలు, పేదరికం మొత్తం తొలగిపోతుంది. ఈ సంఘటన తృతీయ తిథి.. వైశాఖ, శుక్ల పక్షాలలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

Akshaya Tritiyaబంగారం భూలోకంలో మొదటిసారి గండకీనదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ద తదియనాడు ఉద్భవించింది. అందుకే ఈరోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అయితే బంగారంకు పండగ ఏమిటని చాలా మందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు. అది దేవలోహం. బంగారానికి ‘హిరణ్మయి’అనే మరో పేరు కూడా ఉంది. హిరణ్య గర్భో భూగర్బో మాధవో మధుసూదన:’ అని విష్ణు సహస్రనామం చెబుతుంది. ‘విష్ణువు’ హిరణ్యగర్భుడు. అంటే ‘గర్భం నుందు బంగారం కలిగిన వాడని’ అర్థం. బంగారం విష్ణువుకు ప్రతి రూపం. అందుకే బంగారం పూజనీయమైనది. దీని జన్మదినమైన అక్షతృతీయ అందరికీ పండుగే కదా మరి!

Akshaya Tritiyaఅంతటి విశిష్టత ఉన్న ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేసి, విష్ణుమూర్తిని పూజించాలి. పూజలోని అక్షితలు తలమీద వేసుకుని, శక్తిమేర దానధర్మాలు చేయాలి. కొందరు ఈ రోజు ‘వైశాఖ పూజ’ చేస్తారు. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, వస్త్రాలు, గంధం దానం చేస్తారు. ఎండలు మండిపోయే వైశాఖంలోని ఈ పుణ్యదినాన ఎవరి గొంతు చల్లబరచినా, ఎవరికైనా కాస్త దానం చేసినా ఆ ఫలితం అక్షయమవుతుంది.

Akshaya Tritiyaఅక్షయతృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారం అయినా కొనాలనీ, అలా కొన్న వారింట బంగారం అక్షయంగా వృద్ది చెందుతుందనీ చాలా మంది నమ్మకం. ఇందులో కొంత వరకూ నిజం ఉంది. ఈ రోజు కొద్ది మొత్తంలో అయినా బంగారాన్ని కొని, దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి యథాశక్తి పూజించిన అనంతరం ఒక బ్రాహ్ముణుడికి దానం ఇవ్వాలని అంటారు. ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటారు. చాలా మంది బంగారం కొని పూజించడం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెబుతారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR