అలెగ్జాండర్ చనిపోయే ముందు చెప్పిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు

0
400

గ్రీకు వీరుడు అలెగ్జాండర్‌ విశ్వవిజేతగా ప్రపంచాన్ని గెలిచిన యోధుడని, అతి పరాక్రమ వంతుడని చరిత్ర చెబుతోంది. ఇంతటి యోధుడు చనిపోయే ముందు ఎందుకు అలాంటి కోరికలు కోరుకున్నాడు? దేశాలన్నీ గెలుస్తూ వచ్చిన అలెగ్జాండర్ ఓ భారతీయుని పరాక్రమానికి తలవంచాడు.

Alexander the Greatచావు ఎదురుగా ఉన్నా కళ్ళలో భయం కనిపించకుండా… శత్రువుల ఎదుట రొమ్ము విరిచి నిలిచిన భరత మాత ముద్దు బిడ్డ…. మౌర్య వంశ స్థాపకుడు… చంద్ర గుప్త మౌర్యుని పరాక్రమం చూసి భారత దేశాన్ని పాలించుకో అని ఓదిలేసాడని చరిత్ర కథనం.

Alexander the Greatప్రపంచాన్నే గెలిచిన యోధుడు కాబట్టే ఇప్పటికీ అలెగ్జాండర్‌ చరిత్రకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇంత వరకు అలెగ్జాండర్‌ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అతని ఆలోచనలు ఏంటో ఎవ్వరికి అంతు చిక్కలేదు. అయితే చనిపోయే ముందు అలెగ్జాండర్‌ చెప్పిన కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చంద్ర గుప్త మౌర్యునికి సామ్రాజ్యాన్ని వదిలేసి వెనుదిరిగి వెళ్లే క్రమంలో బాబియానాలో అలెగ్జాండర్‌ అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు కూడా ఏమి చేయలేమని చెప్పడంతో బాబియానికి తన కుటుంబాన్ని పిలిపించుకున్నాడు. అలెగ్జాండర్‌ కి ముగ్గురు భార్యలు పెద్ద భార్య అంటే చాలా ప్రేమ, ఆడవారు అంటే గౌరవం అని చరిత్ర చెబుతోంది.

Alexander the Greatఅలెగ్జాండర్ చనిపోయేటప్పుడు తన వారిని దగ్గరకు పిలిచి మూడు కోరికలు కోరాడు. మొదటి కోరిక తన శవపేటికను వైద్యశిఖామణులను మోయాలని కోరాడు. రెండవ కోరిక తన శవపేటిక వెంబడి మణులు, మాణిక్యాలు వెదజల్లించండని కోరాడు. మూడవ కోరిక తనను ఖననం చేసే సమయంలో తన చేతులను పైకి ఉండనివ్వండి అని కోరాడు. వాటికి అర్ధం ఏమిటంటే వైద్యులు ఎంత మంది వెంట ఉన్నా మరణాన్ని ఆపలేరని, మనచుట్టూ ఎన్ని ధనరాశులు ఉన్నా ప్రాణం పోయే సమయంలో అవి మనల్ని కాపాడలేవని, జీవితమంతా పోరాడి కూడబెట్టిన ధనరాశులను పోయేటప్పుడు పట్టుకుపోలేం… పుట్టినప్పుడు వట్టి చేతులే, ప్రాణం పోయినప్పుడు కూడా వట్టి చేతులతోనే వెళ్తాం అని తన చావు ద్వారా చెప్పాలనుకున్నాడు అలెగ్జాండర్‌.

Alexander the Great

 

SHARE