సూర్యుని కంటే ముందు కనిపించే రథసారధి అనూరుడు ఎవరు ?

బ్రహ్మ మానస పుత్రులలో మరీచి అనే పుత్రుడు ఒకడున్నాడు. ఆయనకు కశ్యపుడు అనే పుత్రుడు ఉన్నాడు. ఈ కశ్యపుడు దక్ష ప్రజాపతి 60 మంది కుమార్తెలలో అథిది, తిధి, వినత, కద్రువ, వినత మొదలైన 13 మందిని వివాహం చేసుకున్నాడు. అందులో అతిధి వల్ల దేవతలు పుట్టారు. అందుకే వారిని ఆదిత్యులు అంటారు. తిధి వల్ల కొంతమంది కుమారులు పుట్టారు వారందరిని ”దైత్యులు అంటారు. సురస అనే ఆవిడ వల్ల కొంత మంది పాములు పుట్టుకొచ్చారు. అందుకే వాళ్ళందరిని నాగజాతి వారు అన్నారు.

అనూరుడుకద్రువ, వినత చాలా కాలం కశ్యపుడికి సేవ చేయడం వలన ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కద్రువ మంచి బలంతో పొడవుగా ఉండేవారు వేయిమంది సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంది. ఆ తరువాత వినత వీరికంటే అసాధరణమైన బలవంతులు, గొప్ప ఖ్యాతి గడించే ఇద్దరు కుమారులు కావాలని కోరుకుంది. దానికి కశ్యపుడు సరే అని సంతానం కోసం చేసే ”పుత్రకామేష్టి” యాగం చాలా రోజులపాటు చేశాడు. ఆ తరువాత కద్రువకు పిండం పుడితే ఆ పిండాన్నినేతి కుండలో భద్రపరిచింది. వినతకి రెండు గుడ్లు పుట్టాయి.

అనూరుడుఐదు వందల సంవత్సరాల తర్వాత కద్రువకు ”వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడుతో పాటు ధనుంజయుడు, ఖాళీయుడు, మణి నాగుడు, అపురణుడు, సురాముఖుడు, పింజరుడు, ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగకుడు, కలశపోతకుడు, ధదిముఖుడు, విమలపిండకుడు, ఆప్తుడు, శంఖుడు, వాలిశికుడు, నిష్టానఖుడు, హేమసహుడు, నహుషుడు, పింగళుడు, బహ్యకర్ణుడు, హస్తిపాదుడు, ముద్గురుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కళీయుడు, వృత్తుడు, సంవర్తకుడు, వీరితో కలిపి వేయిమంది సర్పాలు పుట్టాయి. కాని వినత నా గుడ్లు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. వారిని చూసి బాధతో కద్రువకు అప్పుడే సంతానం కలిగారు నాకు ఇంకా కలగలేదు అని దుఃఖించింది.

అనూరుడుద్రువ మీద ఉన్న అసూయతో వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో ఒక గుడ్డుని పగలగొట్టింది. అందులో నుండి ఊరువులు ( తొడలు ) ఇంకా తాయారు కాని బిడ్డ బయటికి వచ్చాడు. ఊరువులు లేకుండా పుట్టాడు కనుక అనూరుడు అన్న నామధేయం ఏర్పడింది. (అన్ + ఊరుడు = అనూరుడు)తొడలు లేని వాడు అని అర్ధం.

అనూరుడుఈ అనూరుడు సూర్యునకు ఉదయం పూట రథ సారధి. ఉదయాన్నే ఉదయించే నారింజపండు రంగు అనూరుడి రూపం. ముందుగా అనూరుడు దర్శనం ఇచ్చిన తరువాతే నేను దర్శనం ఇస్తాను అని సూర్యుడు అనూరుడికి వరం ఇచ్చాడు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR