విష్ణువుకి, శివుడికి పుట్టిన పుత్రుడు ఎవరు ? దీని వెనుక కారణాలేంటో తెలుసా ?

0
337

హరిహరసుతుడు అంటే… విష్ణువుకి, శివుడికి పుట్టిన పుత్రుడు అని అర్థం. ఇద్దరు మగదేవుళ్లకి కొడుకు పుట్టడం ఏంటి? అలాంటి పరిస్థితులు రావడానికి వెనుక కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

Ayyapa Swamyలోక కళ్యాణం కోసం ఆదిశక్తి దుర్గా అవతరమెత్తి దేవతలందరు సమర్పించిన ఆయుధాలతో మహిశాసురుని సంహరించింది. అయితే మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. “శివుడికి, కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అది కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి” అని వరం కోరింది. తధాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.

Brahmaఅలా కాలం గడుస్తుండగా క్షీరసాగరమధనం అనంతరం దేవతలకు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు అయ్యప్ప జన్మించాడు.

Mohiniతరువాత తండ్రియైన పరమశివుడి ఆజ్ఞ మేరకు పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు మణికంఠుడు. అదే సమయంలో గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు వేట నిమిత్తం అటుగా వస్తాడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ బిడ్డను ప్రసాదించాడని భావించిన రాజశేఖరుడు ఆనందంతో ఆ పిల్లవాడిని అంతఃపురమునకు తీసుకువెళ్తాడు.

Ayyapa Swamyఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. పిల్లలిద్దరూ రాజు దగ్గరే పెరుగుతుంటారు. కాగా మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు ‘అయ్యా అని మరికొందరు ‘అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి ‘అయ్యప్ప’ అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు.

Ayyapa Swamyరాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక తనవెంట తీసుకువెళతారు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి అయిన రాజశేఖరుడు. కానీ తల్లికి అది ఇష్టం ఉండదు. తన రాజును రాజును చేయాలని తలచి మణికంఠుని అడ్డు తొలగించుకోవాలనుకుంటుంది. తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గాలంటే పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.

Ayyapa Swamyఅడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. అప్పుడు మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగిన భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు అయ్యప్ప. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రునితో… దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చేందుకు ఇలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతపులులై నాకు సహాయం చేయండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు పులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయాడు. పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.

Ayyapa Swamyదాతో రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని తిరస్కరించి మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని చెబుతాడు. అలా కట్టిన ఆలయమే శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల నమ్మకం.

Ayyapa Swamy

 

SHARE