బ్రిటిష్ వారు ఇక్కడ శివాలయం ఎందుకు నిర్మించారో తెలుసా ?

కులం, మతం ఇవన్నీ మనం ఏర్పరుచుకున్న పరిమితులు. కానీ భగవంతునికి ఇలాంటి పరిమితులు ఉండవు.ఈ ప్రపంచంలో ఉన్న రూపాలన్నీ ఆయనవే. ఈ లోకంలోని మనుషులంతా ఆయన భక్తులే. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది బైజ్నాథ్ శివాలయం.

Baijnath Templeబైజ్నాథ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వర్తకులు 1204 లో ఈ ఆలయాన్ని గుర్తించారు. పాలంపూర్ పట్టణానికి 16 కి. మీ. దూరంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. మన దేశంలో చాల శివాలయాలు ఉన్నాయి కదా ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకోకండి. ఈ ఆలయ నిర్మాణం ఒక బ్రిటిష్ అధికారి చేసారు.

Baijnath Templeఅది 1879 సంవత్సరం… బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలిస్తున్న రోజులు. వారి సైన్యంలో కల్నల్ మార్టిన్ అనే ఉన్నతాధికారి ఉండేవాడు. ఇప్పటి మధ్య ప్రదేశ్ లోని ‘అగర్ మాల్వా’ అనే ప్రదేశంలో మార్టిన్ విధులు నిర్వహించేవాడు. మార్టిన్ కి ఓసారి ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లవలసిన పని పడింది. అక్కడి బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేస్తున్న ఆఫ్ఘన్లను అణచివేయవలసిందిగా, ప్రభుత్వం ఆయనను ఆదేశించింది.

Baijnath Templeతన సైన్యంతో సహా ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్న కల్నల్ మార్టిన్, అక్కడి సైనికులతో వీరోచితంగా పోరాడాడు. నిత్యం పోరులో ఎంతగా తలమునకలై ఉన్నా, అగర్ మాల్వాలో ఉన్న తన భార్యకు తన క్షేమ సమాచారాలు తెలియచేస్తూ తప్పకుండా ఉత్తరాలు రాసేవాడు. కొద్ది రోజులు గడిచేసరికి కల్నల్ భార్యకు ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. అక్కడ తన భర్త ఎలాంటి ఆపదలో ఉన్నాడో, అసలు బతికున్నాడో లేదో తెలియని వేదనలో మార్టిన్ భార్య మునిగిపోయింది. ఒక రోజు మార్టిన్ భార్య అగర్ మాల్వాలో తిరుగుతుండగా… ఓ శివాలయం నుంచి మంత్రాలు, శంఖనాదాలు వినిపించాయి. భర్త వియోగంలో ఉన్న ఆమెకి, ఆ పవిత్ర శబ్దాలు ఊరటని అందించాయి.

Baijnath Templeలేడీ మార్టిన్ స్థితిని గమనించిన ఆలయ పూజారులు ఆమె అంత దుఃఖంలో మునిగిపోయి ఉండటానికి కారణం ఏమిటా అని ఆరా తీశారు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని, పదకొండు రోజుల పాటు ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాన్ని జపించాలి.అలా కనుక జపిస్తే, మృత్యుంజయుడైన ఆ శివుడు ఆమె భర్తను కాపాడతాడని సూచించారు. అప్పటివరకూ నిరాశలో మునిగిపోయిన లేడీ మార్టిన్ కి ఆ సూచన అమృతప్రాయంగా కనిపించింది.

Baijnath Templeలేడీ మార్టిన్ తనకు పూజారులు చెప్పినట్లుగానే శివుడిని ప్రార్థించసాగింది. సరిగ్గా పదకొండవ రోజున ఆమెకు తన భర్త నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మా సైన్యాన్ని ఒక్కసారిగా పఠాన్లు చుట్టుముట్టారు. నలువైపులా వారి దిగ్బంధనంలో ఉన్న మేము ఇక చావే గతి అన్న నిశ్చయానికి వచ్చాము. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ… పులి చర్మం ధరించి, త్రిశూలం చేతపట్టిన ఒక భారతీయ యోగి మాకు అండగా నిలిచాడు. ఆయనను చూసిన వెంటనే శత్రువులు పరుగులు తీశారు. నువ్వు మృత్యువుకి భయపడాల్సిన అవసరం లేదనీ, నీ భార్య ప్రార్థనలను మన్నించి నిన్ను రక్షించేందుకే అక్కడికి వచ్చాననీ ఆ యోగి నాతో చెప్పారని ఉన్న ఆ ఉత్తరాన్ని చూసి లేడీ మార్టిన్ నోట మాట రాలేదు.

Baijnath Templeకల్నల్ మార్టిన్ యుద్ధభూమి నుంచి క్షేమంగా తిరిగిరాగానే ఇక్కడ జరిగిన విషయమంతా ఆయనకు చెప్పింది లేడీ మార్టిన్. అప్పటి నుంచి ఆ దంపతులు ఇద్దరూ శివభక్తులుగా మారిపోయారు. ఆ శివాలయాన్ని అభివృద్ధి చేయాలని తలపెట్టారు. బైజ్నాథ్ మహాదేవ్ పేరుతో ఉన్న ఆ శివాలయం నిజానికి ఎప్పుడో 13 శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతారు. కానీ స్థానికులు మాత్రం అది వేల ఏళ్లనాటిదని నమ్ముతారు. అలాంటి విశిష్టమైన దేవాలయాన్ని మార్టిన్ దంపతులు పునరుద్ధరించాలని అనుకున్నారు. అందుకోసం అప్పట్లోనే 15 వేల రూపాయలని ఆలయానికి విరాళంగా అందించారు. ఆ విరాళానికి స్థానికుల సహకారం తోడై మధ్యప్రదేశ్ లోనె అద్భుతమైన శివాలయాలలో ఒకటిగా అగర్ మాల్వా బైజ్నాథ్ ఆలయం నిలిచింది.

Baijnath Templeమార్టిన్ దంపతుల కథ నిజమేనని నిరూపించేందుకు ఇప్పటికీ అక్కడి ఆలయంలో వారి విరాళం గురించిన శిలాఫలకం కనిపిస్తుంది.ఈ ఆలయ మొగసాల పై ఉన్న శిలాశాసనాలు హిందూ దేవుడయిన,శివుని కోసం కట్టిన ఆలయమని తెలియచేస్తున్నాయి. ఈ ఆలయం యొక్క ప్రస్తుత నిర్మాణం మధ్యయుగ ఉత్తర భారత దేవాలయ నిర్మాణానికి ఉదాహరణగా చెప్పవొచ్చు. ఈ ఆలయ గర్భగుడిలో స్వయంభూ శివ లింగం ఉండి, దీని పైన పొడవైన ఆలయ శిఖరం ఉన్నది. ఒక ప్రవేశద్వార మందిరం, భారీ పరిమాణంలో రెండు బాల్కనీలు కలిగి ఉన్న ఒక చదరపు మండపానికి దారితీస్తుంది. బయటి గోడలు మరియు గుడియొక్క బయటి తలుపుల మీద శాసనాలతొ కూడిన అనేక దేవతల చిత్రాలు ఉన్నాయి. ఆలయంలో నాలుగు స్తంభాలతో ఉన్న ఒక చిన్న మొగసాలను, నందీశ్వరుని విగ్రహంతో మండపానికి ఎదురుగా చూడవొచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR