దేశంలో మరెక్కడా లేని విధంగా గర్భగుడిలో మరొక ఆలయం ?

బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి చాలామందికి తెలుసు. ఆయన చెప్పిన భవిష్యత్తు సంఘటనలు  ఎన్నో మనకళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి కూడా. ఎన్నో వింతలు, మరేన్నెన్నో విడ్డూరాలు వర్తమానంలో కనిపిస్తున్నాయి. అయితే బ్రహ్మగారు చెప్పినట్లు భవిష్యత్తులో యుగాంతం ఎప్పుడు జరుగుతుంది అని కొన్ని విషయాలను క్రోడీకరించారు.. బ్రహ్మం గారి లెక్కల ప్రకారం యుగాంతం 2025 లో జరుగుతుందని అంటుంటారు.  ఓ ఆలయం ఈ ధరిత్రి అంతం ఎప్పుడు జరుగుతుందో చెప్పకనే చెప్తోందట. ఆ ఆలయంలో ఉన్న చేప ఈదితే ఈ కలియుగం అర్ధంతరంగా ముగిసిపోతుందని అంటుంటారు.. మరి ఆ చేప ఉన్న ఆలయం ఎక్కడ ఉంది.. అసలు యుగాంతానికి  ఈ ఆలయానికి సంబంధమేంటి.. బ్రహ్మంగారు ఎం చెప్పారు తెల్సుకుందాం..

Bhram Garuఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా నందులూరులోని సౌమ్యనాధాలయం ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఆలయం.. దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాలలో ఒకటి నందులూరులోని సౌమ్యనాధాలయం. ఈ ఆలయానికి తమిళనాడులో గల పురాతన ఆలయాలకి చారిత్రాత్మక సంభంధం ఉందని స్థల పురాణం చెప్తోంది. నారదుడు ఈ సౌమ్యనాధాలయాన్ని నేరుగా ప్రతిష్టించారని తెలుస్తోంది. 11 వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆలయాన్ని తాళ్ళపాక అన్నమాచార్యులు వారు స్వయంగా వచ్చి దర్శించుకునే వారని తెలుస్తోంది. ఇలా ఎన్నో సంస్కృతిక సంపదని  తనలో దాచుకున్న ఈ దేవాలయం, భవిష్యత్తులో జరగబోయే పెను  విపత్తు గురించి కూడా చెప్తోందట..

Bhram Garuఈ ఆలయంలో ప్రవేశించిన తరువాత లోపల కుడ్యాలపై పై భాగంలో మత్స్య ఆకారం ఒకటి దర్శనమిస్తుంది. కేవలం అక్కడ మత్య ఆకారాన్ని ఎందుకు చెక్కి ఉంచారు అనే విషయంపై స్పష్టత లేకపోయినా దానివెనుక మాత్రం ఓ రహస్యం ఉందని అంటుంటారు. అక్కడి వేద పండితులు చెప్పే విషయాల ప్రకారం భవిష్యత్తులో భారీ వరదలతో  ఈ ఆలయంలో లోపలి నీరు చేరుకుంటుందని, ఆ నీరు ఈ చేపని తాకిన వెంటనే ఆ చేపకి ప్రాణం వచ్చి నీటిలో ఈదుతుందని అప్పుడు ఈ కలియుగం అంతం అవుతుందని స్థల పురాణం చెప్తోందని, ఇదే బ్రహ్మం గారి కాలజ్ఞానంలోనూ చెప్పబడింది చెప్తుంటారు..

3 Rahasyavaani 173ఈ ఆలయానికి ఉన్న మరొక విశేషం ఏమింటే దేశంలో మరెక్కడా లేని విధంగా గర్భగుడిలో మరొక ఆలయం ఉందట..  స్వామి వారి మండపం కింద పక్కగా స్పష్టంగా కనిపిస్తుందట.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR