రాష్ట్రంలో అతి పురాతన, అతి పెద్ద బౌద్ధ స్థూపం చందవరం విశేషాలు!

చందవరం గ్రామంలో ఉన్న బౌద్ధక్షేత్రం అతి పురాతన బౌద్ధక్షేత్రాలలో ఒకటి. ఇది ప్రకాశం జిల్లాలో దొనకొండకు ఈశాన్యంలో 10కి.మీ దూరంలో గుండ్లకమ్మ నదీతీరంలో ఉంది. 1967 లో పురాతత్వ పరిశోధన శాఖ ఉద్యోగి వేలూరి వేంకట కృష్ణ శాస్త్రి పరిశోధన చేసి బౌద్ధక్షేత్రంగా నిర్ణయించాడు. 1972-77 కాలంలో త్రవ్వకాలు జరిపి మహాస్తూపం, 15 సాధారణ స్తూపాలు, 100 చిన్న స్తూపాలు వెలికితీశారు. ఇది శాతవాహనుల పాలనలో క్రీ.పూ 2వ శతాబ్దం – క్రీ.శ. 2 వ శతాబ్ద కాలంలో నిర్మించబడింది. జిల్లాలోని జగన్నాథపురం (చందవరం) బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది.గొప్ప బౌద్ధ ఆరామంగా పేరుగాంచిన గ్రామం చందవరం.

చందవరంఇక్కడ తవ్వకాలలో లభించిన వస్తువులను పరిశోధించిన తర్వాత రేడియోకార్బన్ డేటింగ్’ విధానంలో బౌద్ధారామం వయస్సు 2వశాతాబద్దం కాలం నాటిదని నిర్ణయించబడినది. ఇది ఆంధ్రప్రదేశ్ లో నిర్మించబడిన మొదటి బౌద్దారామంగా నమ్ముతున్నారు. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో బౌద్ధ భిక్షువులు ఇక్కడ ఆరామాలు నిర్మించుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రాంతం సుమారు 800 ఏళ్ల పాటు ధార్మిక కేంద్రంగా, హీనయాన బౌద్ధ క్షేత్రంగా భాసిల్లింది. 1972లో పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది.

చందవరం200 అడుగుల ఎత్తు కొండ (సింగర కొండ) మీద 130 అడుగుల చుట్టుకొలత, 30 అడుగుల ఎత్తు ఉన్న బౌద్ధ స్థూపం, సుమారు మరో 15 పెద్ద, వందలాది చిన్న స్థూపాలు బయటపడ్డాయి. ఇవన్నీ బ్రహ్మీ వ్రాతలో ఉన్న స్థూపాలు.మహా స్థూపంలో మహాచైత్య 1.6మీ ఎత్తు మరియు 60సెమీ వెడల్పు ఉంటుంది. మహాస్థూపం తక్షశిల (పాకిస్తాన్)లోని ధర్మరాజికా స్థూపాన్ని పోలి ఉంటుంది. మహాస్థూపం పానెల్స్ లైమ్ స్టోన్ తో చేయబడింది.

చందవరంపానెల్స్ మరియు డ్రమ్ విభాగంలో ‘బుద్దుని పాద ముద్రలు’ ఉన్నాయి. స్థూపాలు, బోధి చెట్టు మరియు ఇతర కథలతో పాటు జాతక కథలు చెక్కబడి బౌద్ధ స్థూపం, దాని చుట్టూ బుద్ధుని జీవిత విశేషాలు, హిందూయిజం, జైనిజం మరియు బుద్ధిజం మతసంబంధిత చిత్రాలను చిత్రించిన శిల్పాలు, అశోకచక్రం ఉన్న శిల్పం, కొన్ని వందల బౌద్ధ భిక్షువుల సమాధులు, వారు విశ్రాంతి తీసుకున్న గదులు, ధ్యాన మందిరాలు, భిక్షువులు కొండపై వినియోగించిన నీరు క్రిందకు వెళ్ళేందుకు నిర్మించిన కాలువ, కొండపై వారు వినియోగించిన రోలు లాంటివి కూడా వీటిలో ఉన్నాయి. ఇవన్నీ పాలరాతితో తయారైనవే. ఇక్కడ వాటిలో ప్రధానమైనవి మహాస్థూపం, మాహాచైత్యం, మ్యూజియం. ఇక్కడ బౌద్దమత సంబంధిత కార్యక్రమాలు చురుకుగా సాగేవి అని తెలుస్తుంది.

చందవరంకొంతకాలం కిందట గుండ్లకమ్మ నదిలో ఇసుక తీస్తూండగా రెండు పాలరాతి విగ్రహాలు దొరికాయి. ఈ ప్రాంతంలో లభించిన అవశేషాలతో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇక్కడి కొండ శిఖరం మీద రెండస్థుల స్థూపం ఉంది. ఈ ప్రధాన స్థూపం సాంచీలోని బౌద్ధ స్థూపాన్ని పోలి ఉంది. రాష్ట్రంలో అతి పెద్ద బౌద్ధ స్థూపంగా దీనికి పేరుంది. ఈ స్థూపానికి నాలుగు ద్వారాలున్నాయి. ఉత్తర ద్వారంలో ధ్యాన నిమగ్నుడైన బుద్ధుడి పాలరాతి శిల్పం ఉంది. చందవరం బౌద్దారామం వారణాశి నుండి కంచి వెళ్ళే బౌద్ధ సన్యాసులకు విశ్రాంతి ప్రదేశంగా ఉపయోగించబడింది.

చందవరంక్రీ.శ 710లో ఆది శంకరాచార్యుడు దక్షిణ భారతయాత్ర చేసిన సందర్భంగా బౌద్ధ ధర్మం, బౌద్ధ స్థూపాలు క్షీణించినందుకు ఈ స్థూపాలకు చెందిన ఇటుకలు, శిలలు, శిల్పాలు చందవరానికి చెందిన మహాబలేశ్వరాలయ నిర్మాణంలో ఉపయోగించి ఉండవచ్చని కొందరి భావన. బౌద్ధస్థూపం ఉత్తరాన ఉన్న ద్వారంలో ధ్యాన నిమగ్నుడైన బుద్ధుని పాలరాతి శిల్పం ప్రతిష్టించి ఉంది. బౌద్ధుల పగోడాలను తలపించే నిర్మాణపు పునాదులు కూడా ఇక్కడ లభించాయి. బౌద్ధ భిక్షులు విశ్రాంతి తీసుకునే మందిరాల పునాదులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. బౌద్ధమతం క్రమంగా క్షీణించడంతో ఇక్కడి బౌద్ధారామాలను కూలగొట్టి, అందులోని శిల్పాలు, రాళ్లు, మట్టి మొదలైనవాటిని చందవరంలోనే ఉన్న మహాబలేశ్వర ఆలయనిర్మాణానికి ఉపయోగించి ఉంటారని నిపుణుల అంచనా! ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి ఈ అమూల్యమైన చందవరం బౌద్ధ స్థూపాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు.

చందవరంఈ ప్రాంతం గుండా జాతీయ రహదారి నెం.5 వెళుతుంది. కాబట్టి వైజాగ్, విజయవాడ, గుంటూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి రోడ్డు రవాణా సదుపాయాలు బాగానే ఉన్నాయి. ప్రకాశంలో రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే చెన్నై నుంచి ఢిల్లీ పోవాలన్న మరియు గుంతకల్ నుంచి గుంటూరు, విజయవాడ, వైజాగ్ పోవలన్న ఈ స్టేషన్ మీద నుంచే వెళ్ళాలి.

చందవరంఒంగోలుకు 70 కి.మీ. త్రిపురాంతకానికి 10 కి.మీ. దూరంలో ఈ బౌద్ధ క్షేత్రం ఉంది. ప్రకాశం జిల్లాకు దగ్గరలో ఉన్న విమానాశ్రయం విజయవాడ లోని గన్నవరం ఏర్‌పోర్ట్. ఈ ఏర్‌పోర్ట్ దేశీయ ఏర్‌పోర్ట్ , ప్రకాశం నుంచి 150 కి. మీ. దూరంలో ఉంది. ఈ ఏర్‌పోర్ట్ కి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం విమానాలు రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR