శ్రీహరి తన సుదర్శన చక్రంతో చక్కని తీర్దాన్ని సృష్టించిన చిన్న తిరుపతి గురించి తెలుసా?

0
9159

శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న ఈ ఆలయం చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. మరి కొండపైన వెలసిన స్వామి వారి ఆలయ స్తల పురాణం ఏంటి? ఇంకా ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

tirupathiఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, పచ్చిమగోదావరి జిల్లాలోని, ఏలూరు నుండి 42 కి.మీ. దూరంలో ద్వారకా తిరుమల అను గ్రామం ఉంది. ఈ గ్రామంలోని అనంతాచలం అనే కొండపైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఉత్తర వాహినియై పంపానది ప్రవహిస్తుంది. అదే నేటి ఎర్ర కాలువ. అయితే సప్తర్షుల కోరిక మేరకు, శ్రీహరి తన సుదర్శన చక్రంతో చక్కని తీర్దాన్ని అచట సృజించాడు. దానినే సుదర్శన తీర్థం అని అంటారు.

tirupathiఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం ఈ ద్వారకా తిరుమలలోని శేషాకృతి కల్గిన కొండపైన ద్వారకుడు అనే ఋషి ఉత్తరాభిముఖంగా కూర్చొని తపస్సు చేయగా, కొంత కాలం తరువాత ద్వారకా ఋషి ఎదురుగా మహావిష్ణువు ప్రత్యేక్షమైనాడు. అప్పుడు భక్తుని కోరిక మేరకు అక్కడే దక్షిణ ముఖంగా వెలిసాడు. అప్పటినుండి ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందింది.

tirupathiఈ ఆలయంలో స్వయంభువుగా వెలసిన స్వామివారి పాదాలు పుట్టలో ఉన్నందున నిలువెత్తు స్వామి వారిని మనం దర్శించలేము. పై భాగం మాత్రమే మనకు దర్శనం ఇస్తుంది. ఆ కారణం చేతే 11 శతాబ్దంలో శ్రీరామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి స్వయంవ్యక్త ధ్రువమూర్తి వెనుక బాగాన కొంత ఎత్తైన పీఠంపై వైఖానసాగమం ప్రకారం మరో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారని తెలియుచున్నది.

tirupathiతిరుమల తిరుపతి స్వామివారికి మొక్కిన మ్రొక్కును చిన్న తిరుపతి అని పిలువబడే ద్వారకా తిరుమలలో తీర్చుకున్న అదే ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం లో విశేషం ఏంటంటే, ఒకే విమాన శిఖరం కింద రెండు విగ్రహములు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని మైలవరం జమీందారులు కట్టించారు.

tirupathiఈ ఆలయంలో స్వామివారికి అభిషేకాలు జరగవు. ఎందుకంటే స్వామివారి విగ్రహం క్రింద చీమల పుట్ట ఉంది. ఈ ఆలయం యొక్క సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా వైశాఖ మరియు ఆశ్వయుజ మాసంలో రెండు కల్యాణోత్సవాలు జరుపుతారు.

tirupathiముక్కోటి ఏకాదశి నాడు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభ్యమవుతుంది. ఆ రోజు స్వామివారి అలంకారములు తొలగించి, తిరువంజనసేవ జరుపుతారు. ఆ సమయంలో ఈ స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది.

7 chinna thirupathiga prasiddganchina dwaraka thirumalalo velasina alayam.