Home Unknown facts దత్తాత్రేయుని గురువులు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

దత్తాత్రేయుని గురువులు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0

దత్తాత్రేయుని సాక్షాత్తూ ఆ త్రిమూర్తుల అవతారంగా భావిస్తుంటాము. కోరి చెంతకు చేరిన మూర్కుని సైతం బ్రహ్మజ్ఞానిగా మార్చగల ఆ దత్తాత్రేయునికి గురువు ఎవరై ఉంటారు అని ప్రశ్నస్తే తాను ప్రకృతిలో గమనించిన గురువుల నుంచి జ్ఞానాన్ని సంపాదించానని పేర్కొంటారు. అవేంటో తెలుసుకుందాం.

dattatreya swamyభూమి:క్షణమైనా తన బాధ్యతని విస్మరించని నిబద్ధత. పరులు కీడు తలపెట్టినా తిరిగి ఆహారాన్ని అందించగల క్షమ. ఎంతటి బాధనైనా ఓర్చుకోగల సహనం.

గాలి- తనలో ఎన్ని భావాలు మెదులుతున్నా వేటినీ అంటిపెట్టుకుని ఉండకుండా, తన నిజస్వరూపంలోనే నిలిచి ఉండటం. ప్రాపంచిక వస్తు వాసనలకు అతీతంగా మనసుని స్వేచ్ఛగా, స్వచ్ఛంగా నిలుపుకోవడం.

ఆకాశం- తనలోని ఆత్మకు ఎలాంటి ఎల్లలూ లేవన్న సత్యాన్ని గ్రహించడం. అనంతంగా వ్యాపించి ఉన్నా, ఏ వస్తువునీ సొంతం చేసుకోకపోవడం. అనంతమైన భగవత్‌ తత్వాన్ని గ్రహించడం.

నీరు- తన చెంతకు ఎలాంటి వారు వచ్చినా కూడా పక్షపాతం లేకుండా ఆదరించడం. స్వచ్ఛత అనే సహజగుణాన్ని కాపాడుకోవడం.

నిప్పు- జ్ఞానం అనే అగ్నిలో ఈ లోకంలోని అజ్ఞానాన్నీ, పాపకర్మలనీ దహించివేయడం. తన చుట్టూ ఉన్న లోకాన్ని ఆ జ్ఞానాగ్నితోనే పరిశీలంచడం.

చంద్రుడు- చంద్రుని మీద పడే నీడలోని మార్పుల కారణంగా అది పెరుగుతున్నట్లుగానో, తరుగుతున్నట్లుగానో కనిపిస్తుంది. కానీ చంద్రుని నిజరూపంలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. జనన మరణాలకు అతీతంగా ఆత్మ కూడా అంతే నిశ్చలంగా ఉంటుంది.

సూర్యుడు- సూర్యుని ప్రతిబింబం ప్రతి నీటిమడుగులోనూ కనిపిస్తుంది. కానీ సూర్యుడు మాత్రం ఒక్కడే. ఆత్మ కూడా వేర్వేరు శరీరాలలో జీవిస్తున్నట్లు తోచినా దాని మూలం ఒక్కటే.

పావురాళ్లు- ఒక పావురం వలలో చిక్కుకుంటే, దాని తోటి పావురం కూడా అదే వలలోకి వెళ్లి చిక్కుకునేందుకు ఇష్టపడుతుంది. ప్రాపంచిక బంధాలు ఎంత మోహపూరితంగా ఉంటాయో ఈ పావురాళ్ల తీరు తెలియచేస్తుంది.

కొండచిలువ- తన దగ్గరకి వచ్చినదేదో తిని, దానినే అరాయించుకుంటూ తృప్తిగా ఓ చోట పడి ఉంటుంది కొండచిలువ. అంతేకానీ ఆహారం కోసం అటూఇటూ పరుగులు తీయదు.

తుమ్మెద- తేనె ఎక్కడ ఉంటే అక్కడికి తుమ్మెద చేరుకుంటుంది. ఒక పూవుని గ్రోలినంత మాత్రాన అది తృప్తి పడిపోదు. మనిషి కూడా అంతే జ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకుంటూ ఉండాలి.

తేనెటీగ- తేనెటీగలు నానాకష్టాలూ పడి తేనెని సేకరిస్తాయి. కానీ వాటిని ఏ ఎలుగుబంటో, వేటగాడో హరించుకుపోతాడు. అవసరానికి మించి దాచుకునే ధనం పరుల పరం కాక తప్పదు. ప్రాపంచిక సంపదని పోగుచేసుకుంటే దుఃఖమే మిగులుతుంది.

ఏనుగు- ఆడ ఎనుగుని చూసినంతనే ఏనుగు వెనకాముందూ ఆలోచించకుండా వెళ్లి ఉచ్చులో కూరుకుపోతుంది. మోహం, కామం ఎంతటివాడినైనా బలహీనుడిగా మార్చివేస్తాయి

 

Exit mobile version