అక్కడ పూజ చేస్తే అత్తాకోడళ్లు గొడవపడకుండా కలిసిమెలిసి ఉంటారట

రెండుగాని అంతకన్నా యెక్కువ నదులు సంగమించే ప్రదేశాన్ని ప్రయాగ అని అంటారు. ప్రయాగ అన్న పదానికి మరో అర్థం కూడా ఉంది. తపస్సు చేసే ప్రదేశం అని. చాలా చోట్ల రెండునదులు వేరువేరు రంగులలో వుండి వాటి సంగమం ఒక అధ్భుతం అని అనిపిస్తూ వుంటుంది. అలాంటి ఒక ప్రదేశమే దేవప్రయాగ.

Devprayagసరస్వతీ నదికి ఉపనదలుగా ఉన్న నందాకిని, దౌళి గంగ , పిండారి గంగ , మందాకిని కలసి అలకనందగా మారి దేవ ప్రయాగ చేరుతుంది. మరోక నది గంగోత్రి హిమనీ నదము నుండి ఉధ్బవించి ప్రవహిస్తూ సోన్ గంగ మొదలయిన నదులతో సంగమించి టెహ్రీ మీదుగా భగీరథ నది రూపంలో ప్రయాగ చేరుతుంది. ఈ రెండు నదులు కలిసే ప్రదేశం ఆధారంగా ఏర్పిడిందే దేవప్రయాగ.

Devprayagఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రి గర్వాల్ జిల్లాలో ఉంది. ఋషికేశ్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల ప్రయాణిస్తే దేవప్రయాగ వస్తుంది. దేవతలు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశానికి దేవప్రయాగ అనే పేరు వచ్చినట్లుగా చెప్తారు. హిందువులు దీనిని పరమ పవిత్రంగా భావిస్తారు.

Devprayagఇక్కడ ఒక నమ్మకం కూడా ఉంది. ఇక్కడ పూజలు చేస్తే అత్తా కోడళ్ళు సఖ్యతగా ఉంటారట. అందుకే దీనిని సాస్ బహు సంగమ్ అంటే అత్తా కోడళ్ల సంగమం అని కూడా అంటారు. ఎందుకంటే అలకనంద విష్ణపత్ని లక్ష్మీ స్వరూపమని, గంగ శివుని భార్య కాబట్టి వీరు అత్తాకోడళ్ల వరస.

Devprayagఅలా అత్తాకోడళ్ల సంబంధాలు బాగులేని వారు ఈ సంగమంలో పూజలు చేసుకొని పసుపు కుంకుమ సమర్పించుకుంటే వారి సంబంధాలు బాగుపడి కలకాలం కలిసుంటారని అంటారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR