ఈ బావిలో నీళ్లు తాగితే ఎలాంటి రోగమైన తగ్గిపోతుందట

0
570

ఇప్పుడంటే ఫిల్టర్లు, ప్యూరిఫైయర్లు వచ్చాయి కానీ అప్పట్లో చెరువుల్లో, బావుల్లో నీటినే తాగడానికి వాడేవారు. ప్రస్తుతం కలుషితం అవుతున్న వాతావరణంలో ఇలాంటివి తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎంతో స్వచ్చమైన నీటిని అందిస్తున్న మంచినీటి బావులు ఉన్నాయి.  ఫిల్టర్ లో నీటికన్నా అవి మంచి రుచి ఉంటాయి.

Unknown Facts About Dood wellఅలాంటిదే దూద్ బావి కూడా. ఇది పురాతన మంచినీటి బావి. ఈ బావి నీరు చాలా తీయగా, స్వచ్ఛంగా ఉంటాయి. ఈ బావి నీరు తాగితే చాలు ఏదైనా రోగం ఉన్నా నయం అవుతుంది అంటారు. అందుకే అందరూ ఈ నీటిని బాటిళ్ల రూపంలో తీసుకువెళతారు.

Unknown Facts About Dood wellఈ దూద్ బావి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లా ప్రాంతంలో  ఉంది. ఇక్కడ మినరల్ వాటర్ బాటిల్స్ కంటే ఈ నీటినే ఎక్కువగా తాగుతారు.  అటువైపుగా కార్లు, బైకుల మీద వెళ్లేవారు కూడా ఈ నీటిని తీసుకుని తాగి వెళతారు.

Unknown Facts About Dood wellకాకతీయ రాజులు మొలంగూర్లో సైనికుల కోసం ఈ బావిని తవ్వించారట. 365 రోజులు బావిలో నీరు ఉంటుంది. అప్పట్లో ఈ నీళ్లను గుర్రపు బగ్గీల్లో హైదరాబాద్లోని నిజాం నవాబు కుటుంబానికి సరఫరా చేసేవారని ఆ నాటి చరిత్ర చెబుతోంది. ఈ నీటిలో ఎలాంటి మలినాలు ఉండవు, ఎలాంటి ఫ్లోరైడ్ ఆనవాళ్లు కనిపించవు.

SHARE