ప్రపంచంలో అతి పొడవైన నైల్ నది వల్లే ఈజిప్ట్ కు అంత ప్రాచుర్యం ఏర్పడిందా ?

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా ప్రాచుర్యం పొంది మహాద్భుత నిర్మాణాలుగా పిలువబడే ఈజిప్ట్‌ పిరమిడ్ల గురించి తాజాగా వెలువడుతున్న కథనాలు పురాతత్వశాస్త్రవేత్తల్లోనే గాక, సామాన్యుల్లో సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Unknown Facts About Egypt mummyఈజిప్ట్ లో భిన్న సంస్కృతి కొన్ని వేల ఏళ్ల కిందే నెలకొంది. స్ఫింక్స్, పిరమిడ్స్ , వాలీ ఆఫ్ కింగ్స్ లోని సమాధులు, లుక్సర్ ఇంకా కార్నాక్ లో ఉన్న దేవాలయాలు, పురాతన ఈజిప్ట్ సంస్కృతికి నిదర్శనాలు. సుమారు ఐదువేల సంవత్సరాలకు పూర్వం ఈజిప్ట్ లో ఫెరోల సామ్రాజ్య స్థాపన ప్రారంభమైంది. వీరు మరణానంతరం కూడా జీవితంపై ఉన్న నమ్మకంతో సమాధుల పేర్లతో పిరమిడ్‌ల నిర్మాణం చేపట్టారు. ప్రపంచంలో అతి పొడవైన నైల్ నది వల్లే ఈజిప్ట్ కు అంత ప్రాచుర్యం ఏర్పడింది.

Unknown Facts About Egypt mummyఇక్కడ క్రీస్తుపూర్వం 3300 నుంచి 2686 వరకు జరిగిన కాలాన్ని మొట్టమొదటి రాజుల కాలంగా పరిగణిస్తారు. క్రీస్తు పూర్వం 2686 నుంచి 2181 వరకు ఫెరోలు పరిపాలించారు. క్రీస్తుపూర్వం 2181 నుంచి 1550 సంవత్సరం వరకు పాత రాజవంశ పతనానికి కొత్తరాజవంశ అవతరణకు మధ్య ఒక 130 సంవత్సరాలు ఈజిప్ట్ రాజవంశ చరిత్రలో అల్లకల్లోలం ఏర్పడింది. ఇక ఇక్కడ కొత్త రాజవంశం క్రీస్తుపూర్వం 1550 నుంచి 1069 సంవత్సరం వరకు కొనసాగింది. 19 సంవత్సరాలకే అనుమాస్పద పరిస్థితుల్లో చనిపోయిన ఫెరో టుటన్‌కామూన్ చరిత్ర ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ చరిత్రలో పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. వాటిని తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం.

Unknown Facts About Egypt mummyక్రీస్తుపూర్వానికి సంబంధించిన అనేక కట్టడాలు, వాటి వెనక రహస్యాలు అనేకం ఈజిప్ట్‌ చరిత్రలో దాగున్నాయి. ముఖ్యంగా, మరణించిన రాజవంశీయులు/ సంపన్న ఈజిప్షియన్ల శవాలు కుళ్లిపోకుండా ఉండేందుకు వాడిన పద్ధతులు మొన్నటి వరకు అంతుచిక్కని ప్రశ్నలుగానే ఉండేవి. ఐతే, ఇటీవల శాస్త్రవేత్తలు ఓ మమ్మీపై క్షుణ్ణంగా అధ్యయనం జరిపి దాన్ని భద్రపరిచేందుకు ఉపయోగించిన పదార్థాల గుట్టును కనిపెట్టడం విశేషం. చనిపోయిన రాజవంశీయులు లేదా సంపన్నులను మమ్మీగా తయారుచేయడానికి మొదటగా విస్కింగ్‌ అనే పద్ధతి ద్వారా చనిపోయిన వ్యక్తి మెదడును ద్రవ రూపంలోకి మార్చి ఆతర్వాత ఆ ద్రవాన్ని పుర్రె నుంచి తొలగిస్తూనే శరీరం నుంచి ఊపిరితిత్తులు, కాలేయం, పేగులను ఎడమవైపు నుంచి తొలగించేవారు. ఇక, శరీరం నుంచి చెమ్మను తొలగించడానికి బాడీని సహజమైన ఉప్పులో ఉంచేవారు.

Unknown Facts About Egypt mummyబ్యాక్టీరియాను చంపడానికి బుల్‌రషెస్‌ అనే మొక్క వేరు నుంచి సేకరించిన తైలం, తుమ్మ చెట్టు నుంచి సేకరించిన సహజసిద్ధ జిగురు, దేవదారు వృక్షం నుంచి సేకరించిన జిగురులతో పాటు పరిమళ ద్రవ్యాల పూతను శరీరానికి పట్టించేవారు. ప్రత్యేకమైన నారతో శరీరాన్ని పూర్తిగా చుట్టేసి, శరీరం గట్టిపడేలా 15 రోజుల పాటు ఆరబెట్టి చివరకు వస్త్రాన్ని చుట్టేయడం వంటివి చేసేవారు. ఇలా మృత కళేబరాన్ని పరిరక్షించే ప్రక్రియకు 70 రోజుల సమయం పడుతుంది. ఇలా పరిరక్షించిన శరీరాన్ని పిరమిడ్లో సమాధి చేస్తారు.

Unknown Facts About Egypt mummyప్రపంచంలో అత్యంత, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించారు ఈజిప్ట్ పిరమిడ్లను. ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా ఉంటాయి. ఇవి ఈజిప్టు రాజుల సమాధులు. ఇందులో ఒకటి గ్రేట్ పిరమిడ్. దీని మధ్య భాగంలో ఛియోవ్స్ సమాధి ఉంటుంది. దీని నిర్మాణానికి 1,00,000 మంది బానిసలు పని చేశారు. రాజుల శవాన్ని ఉంచే శవపేటిక (కాఫిల్ లేక సర్కోఫంగస్) గ్రానైట్ గదిలో పశ్చిమాన ఉంది. ఉత్తర దిశ నుంచి పిరమిడ్ లోపలికి ప్రవేశ మార్గం ఉంది. అక్కడ నుంచి ఒక వరండా ఉంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,630,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR