ఈతిబాధలుకు రాజు పరిపాలనకు సంబంధం ఏంటి ?

0
512

మనం అప్పుడప్పుడు ఆనోటా ఈనోటా ఈతిబాధలు అనే మాట వింటుంటాం. ఈతిబాధలు అంటే ఏంటో తెలుసుకుందాం. అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడుతలు, రాజుల అతిసమీపంలో వుండటాన్నే ఈతిబాధలు అంటారు. పూర్వం కొందరు కామక్రోధులకు వశమైపోవడం వల్ల వారు ప్రజలను సరిగ్గా పాలించలేకపోయారు. అందువల్లే రాజైనా వానికి ఈ నియమాలు తప్పకుండా వుండాల్సిందే.

Indhruduఇంద్రుడు భూలోకంలో వర్షాలను కురిపించి, పంటలను వృద్ధిచేసి, ప్రజలు చేసే యజ్ఞయాగాదుల ద్వారా తాను కూడా తృప్తి పొందేవాడు. అదేవిధంగా రాజులు కూడా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, వారినుంచి పన్నులను గ్రహించి ఆదరణలను పొందేవారు. అయితే తీసుకునే పన్నులు కూడా ప్రజలకు ఎటువంటి బాధలు కలిగించకుండా వుండేటట్లు చూసుకోవాలి.

ఈతిబాధలుసూర్యుడు.. సుమారు ఎనిమిది మాసాలవరకు మహీమండలంలో వున్న జలాన్ని తన కిరణాలతో పీల్చేస్తాడు. తరువాత ఆ పీల్చిన నీటిని నాలుగుమాసాలవరకు వర్షరూపంలో భూమండలానికి అందిస్తాడు. అలాగే రాజుకూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా పన్నులను గ్రహించి.. తిరిగి వారికే క్షేమంగా ఖర్చు పెట్టేలా చూసుకోవాలి. వాయువు అన్ని జీవరాసులకు సమానంగా ప్రాణవాయువును అందించినట్లే.. రాజు ప్రజలందరినీ ఒకేదృష్టితో ఆదరించాలి.

ఈతిబాధలుయమలోకంలో వున్న యముడు కూడా ఏ జీవి ఏయే పాపాలు చేస్తుందో.. వారికి తగిన దండనను విధిస్తాడు. బంధుత్వ, సన్నిహిత వ్యవహారాలు వంటివి తేడా లేకుండా అందరికీ సమానంగా దండన ఇస్తాడు. అలాగే రాజు కూడా అమాయకుల మీద నిందలు మోపనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. తప్పు చేసినవారికి దండన విధించాలి.

ఈతిబాధలుప్రజలు పుణ్యకార్యాలు చేస్తే.. అందులో ఆరవభాగం రాజుకు చెందుతుంది. పాపాలను చేస్తే అందులో సమభాగం రాజుకు చెందుతుంది. కాబట్టి రాజు జాగ్రత్తగా వుంటూ.. తన పరిపాలన చూసుకోవాలి. నిండు చంద్రునిని చూసి ప్రజలు ఏ విధంగా సంతోషపడతారో.. అదేవిధంగా రాజును చూసి కూడా ప్రజలు సంతోషపడేలా ఆనందింపచేయాలి. ప్రజలను పట్టించుకోని రాజు నరకానికి పంపబడతాడు.

 

SHARE