వాల్మీకి రామాయణంలో దాగిఉన్న గొప్ప విషయం ఏమిటో తెలుసా ?

రామాయణం గురించి తెలియని భారతీయులు ఉండరు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని జీవితాన్ని, దాని నుండి మనం నేర్చుకోవాల్సిన నీతిని గురించి తెలియజేసేదే రామాయణం. బాంధవ్యాలు, బాధ్యతల తీరు తెన్నులు ఎలా వుండాలో రామాయణం మనకు ఉద్భోధిస్తుంది. 24వేల శ్లోకాలతో కూడిన రామాయణము పవిత్ర గ్రంథము. రామాయణంలోని పాత్రల ద్వారా ఆదర్శ జీవితం ఎలా ఉండాలో నేర్చుకోవాలి.

Ramayanaఆదికావ్యమైన రామాయణాన్ని భారతీయులు ఎంతో గౌరవిస్తారు. రామాయణాన్ని చదవటం ద్వారా శత్రువులను అధిగమించవచ్చు. స్త్రీలు రామాయణాన్ని విన్నా, చదివినా, రాముడి వంటి పుత్రుడు కలుగుతాడు. పెళ్లికాని ఆడపడుచులు చదివినా, విన్నా శ్రీరాముడి లాంటి భర్త లభిస్తాడని నమ్ముతారు. ఇంకా దీర్ఘాయుష్షు, సంకల్ప సిద్ధి, దైవానుగ్రహం కలుగుతాయి. ఈ కావ్యాన్ని పఠించినా, ఆలకించినా దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి. అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని చెబుతారు.

Ramayanaరామాయణం కథ ఒక పాఠ్యాంశంగా పిల్లల చేత చదివిస్తారు. సీతారాముల్ని ఆదిదంపతులుగా పెద్దలు కొలుస్తారు. ఇక పారాయణం సంగతి చెప్పనక్కర్లేదు. వాల్మీకి రామాయణాన్ని ఒక సులభమైన కథగా చెప్పి ఊరుకోలేదు. ఇప్పుడంటే సులభమైన భాషలో రామాయణాన్ని మార్చుకొని చదువుకుంటున్నాం కానీ నిజమైన వాల్మీకి రామాయణం అంతరాత్మ అవగతం అవడానికి శాస్త్ర పరిజ్ఞానం అవసరం.

Ramayanaసుందరకాండ పారాయణ చేసేవారికి, ఆదిత్యహృదయం చదువుకునే వారికి రామాయణంలో కొన్ని శ్లోకాలైన నోటికొచ్చుంటాయి. నిజమైన ఉపాసకులు వాటి అర్థాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేసే ఉంటారు. అయితే పైకి కనపడే అర్థం కాకుండా రామాయణం నిండా గుప్తంగా మరేదో పరమార్థం నిక్షిప్తమై ఉందన్నది ఎందరో పెద్దలు చెప్పేమాట.

Ramayanaవాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో అంతర్లీనమైన గొప్ప విషయం ఏమిటంటే? 24వేల శ్లోకాలతో ప్రతి 1000వ శ్లోకం, గాయత్రి మంత్రంలోని అక్షరము వరుస క్రమంలో మొదలవుతుంది. అంటే ప్రతి 1000వ శ్లోకం మొదటి అక్షరం తీసుకుంటే గాయత్రి మంత్రం వస్తుంది. 24,000 శ్లోకాల రామాయణంలో గాయత్రీ మంత్రం నిక్షిప్తమై ఉందన్నది కాబట్టే దీన్ని గాయత్రీ రామాయణం అని కూడా అంటారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR