కొడైకెనాల్ దెయ్యాల గుహ లోపలకిి ఎందుకు అనుమతించరు

0
231

వేసవిలో ఎండతాపాన్ని చల్లార్చుకునేందుకు చల్లగా ఉండే ప్రదేశాలను వెతుక్కుని మరీ వాలిపోయే ప్రకృతి ప్రేమికులకు అచ్చమైన దేశీయ కూల్ స్పాట్ “కొడైకెనాల్”. పర్యాటకులంతా “ప్రిన్స్ ఆఫ్ హిల్‌స్టేషన్‌” అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ ప్రదేశం దక్షిణ భారతదేశంలోని చెన్నై నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. పళని కొండల శ్రేణిలో సముద్ర మట్టంనుంచి 2,130 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలోని లోయలు, పర్వతాలు, పూల తోటలు, జలపాతాలు, సరస్సులు వీక్షకులకు కనువిందు కలిగిస్తాయి.

green valleyరెగ్యులర్ గా హనీమూన్ జంటలు కూడా కొడైకెనాల్ ను సందర్శిస్తుంటారు. ఇక్కడే దెయ్యాల కిచెన్ ఉంది. ఇది కొడైకెనాల్ లో ఉన్న ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. దెయ్యాల కిచెన్ ను ఆంగ్లంలో డెవిల్ కిచెన్ అని పిలుస్తారు. గుణ కేవ్స్ గా ప్రసిద్ధికెక్కిన ఈ కిచెన్, కొడైకెనాల్ లో ఒక ఆసక్తికరమైన స్థలం. సాహసికులు, ధైర్యం ఉన్నవారు ఈ ప్రదేశాన్ని తరచూ సందర్శిస్తారు. కమల్ హాసన్ నటించిన పాత సినిమా ‘గుణ’ ఇక్కడే షూటింగ్ జరుపుకొని విజయం సాధించింది. ఆ సినిమా పేరుమీదనే ఈ గుహలకు ఆ పేరొచ్చింది.

green valleyకొడైకెనాల్ లోని గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ కు మరియు పిల్లర్ రాక్స్ కు మధ్యన ఉన్న ప్రాంతంలో ఇరుకైన పొడవాటి లోయలో దెయ్యాల కిచెన్ గా పిలువబడే గుణ గుహలు ఉన్నాయి. రోడ్డు అంచున ఉన్న బాటలో 200 గజాలు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుంచి కిందకు దిగి వెళితే , ఒక చిన్న కొండ యొక్క దిగువ భాగంలో గుహ కనిపిస్తుంది. ఇక్కడికి సాహసికులు మాత్రమే వెళ్లివస్తుంటారు.

green valleyగుణ గుహలు చూడటానికి ఇప్పుడైతే అనుమతిస్తున్నారు గానీ పదేళ్ల కిందట అనుమతించేవారు కాదట. దానికి కారణం అప్పట్లో పదుల సంఖ్యలో ప్రేమ జంటలు ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకొనేవారు. మొన్నీమధ్యనే పర్యాటకుల సందర్శనార్థం తెరిచి ఉంచారు. గుహను బయటి నుండి చూడటానికి మాత్రమే అనుమతి ఉంది. గుహలోకి ప్రవేశించటానికి అనుమతి లేదు. గుహలు డేంజర్ కనుక చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటారు.

green valleyహిందూ పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాస సమయంలో ఇక్కడ కొంతకాలం పాటు గడిపారని చెబుతారు. గుహ చుట్టుపక్కల ప్రదేశాలు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటాయి. గుబురుగుబురుగా పెరిగిన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, పచ్చదనం పర్యాటకులను ఆకర్షిస్తాయి. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు, నేచర్ ఫొటోగ్రాఫర్లు కనిపించే ప్రకృతిని, జంతువులను తన కెమెరాలలో బందించవచ్చు.

green valley

 

SHARE