ఆంజనేయస్వామి తొమ్మిది అవతారాలలో ఉన్న ఆలయం ఎక్కడ ఉంది ?

ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. శ్రీ విష్ణుమూర్తిలా ఆంజనేయస్వామి కూడా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారాలు ధరిస్తే.. ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు. మరి ఆ అవతారాలు ఏంటి, అలాగే హనుమంతుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మనం ఇపుడు తెల్సుకుందాం..

Hanuman Avatarఆంజనేయస్వామి తొమ్మిది అవతారాలు ఎంటంటే..ప్రసన్నాంజనేయస్వామి, వీరాంజనేయస్వామి, వింశతి భుజ ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, అష్టదశ భుజ ఆంజనేయస్వామి, సువర్చలాంజనేయస్వామి, చతుర్బుజ ఆంజనేయస్వామి, ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి, వానరాకార ఆంజనేయస్వామి. ఇలా ఆంజనేయస్వామి తొమ్మిది అవతారాలలో ఉన్న ఆలయం ఒంగోలులో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ప్రధాన దైవం. ఈ ఆలయాన్ని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం అని పిలుస్తారు.

Hanuman Avatarఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు చుస్తే శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.

Hanuman Avatarఇక అంజనీ సూతునికి ప్రీతి పాత్రమైన పువ్వులు ఏంటంటే తమలపాకుల దండ, మల్లెలు, పారిజాతాలు, తులసి, కలువలు ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, ఆ సమయంలో దగ్గరలో పువ్వులు కనిపించక అలా తమలపాకుల దంత వేసారట.. ఇక అప్పటినుండి స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

Hanuman Avatarఅలాగే గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం అని చెప్తారు. అలాగే స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.. తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది. కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, ఆంజనేయ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.

Hanuman Avatarఆంజనేయ స్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల గురించి కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి.. తూర్పుముఖముగా హనుమంతుడు పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడట. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.

Hanuman Avatarపడమర ముఖంగా ఉన్న మహావీరగరుడ స్వామి దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడట. అలాగే ఉత్తరముఖముగా ఉన్నటువంటి లక్ష్మీవరాహమూర్తి గ్రహాల యొక్క చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు. ఇక ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడట.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR