భూత ప్రేతాలను హనుమంతుడు సంహరిస్తాడు అంటారు ఎందుకో తెలుసా?

0
1889

శ్రీ ఆంజనేయం – ప్రసన్నాంజనేయం. భయం వేసినప్పుడు మొదట గుర్తువచ్చే మంత్రం ఇది . చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఇదే మంత్రాన్ని జపిస్తారు, భయం వేసినప్పుడు ఈ మంత్రాన్ని చదివితే మన దగ్గరికి ఏమి రావు అనే నమ్మకం చాలామందికి. ఎందుకు అంటే హనుమంతుడు చాలా భయంకరమైన రాక్షసులను మట్టుపెట్టాడు. అంతే కాదు త్రేతాయుగంలో రాముడు తనువు చాలించే సమయం వచ్చినపుడు కూడా హనుమంతుడు పక్కన ఉన్నంతసేపు యముడు రాముని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు.

Hanumanఅయితే ఇప్పటికీ వాయు పుత్రుణ్ణి భక్తితో తలుచుకున్నంత మాత్రాన గాలి ధూళిని మన దగ్గరికి రాకుండా చేయడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. హనుమంతుడు శ్రీరామునికి నమ్మినబంటు. రాముడికి గుండెలోనే గుడి కట్టి పూజించాడు. శ్రీరాముని ఉంగరం చూపించి సీతమ్మను ఓదార్చాడు. లంకాదహనం చేశాడు. సుగ్రీవుని రక్షించాడు. సర్వ అభయ దీక్షాదక్షుడు హనుమంతుని భక్తులు చింతలు, చిరాకులకు దూరంగా ఉంటారు.

Hanumanరామనామం ఎంత మధురమైనదో చాటి చెప్పాడు హనుమంతుడు. శ్రీరాముడు తన అవతారం చాలిస్తూ ‘’కలియుగం అంతమయ్యేవరకూ భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడమని, భయాలూ, ఆందోళనల నుండి రక్షించమని, భూత, ప్రేత, పిశాచాల్లాంటి బాధలు, భయాల నుండి బయట పడేయమని, ఆర్తజన రక్షకుడిగా ఉండమని’’ కోరాడు. శ్రీరాముని ఆజ్ఞను శిరసావహించాడు హనుమంతుడు. అందుకే ఆంజనేయుడు భక్తుల మొర ఆలకిస్తాడు. ఆదుకుని ఆపదలు తొలగిస్తాడు. ఆందోళనల నుండి విముక్తి కలిగిస్తాడు అంటారు.