జడల రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది ?

0
581

స్థలపురాణం:

పూర్వం ఒకనాడు హైహయ వంశ చక్రవర్తి అయిన కార్త వీర్జార్జున సపరివారంగా వేటకోసం దండకారణ్యానికి వెళ్లాడు. విశ్రాంతిలేకుండా వేటాడిన తరువాత చక్రవర్తి, తనతో వచ్చిన సైన్యం అంతా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ జమదగ్ని మహర్షి తన దగ్గరున్న కామధేనువు సహాయంతో వేలసంఖ్యలో వున్న రాజు పరివారానికి భోజనాన్ని క్షణాల్లోనే ఏర్పాటు చేశాడు.

జడల రామలింగేశ్వరస్వామిఅది చూసిన కార్తవీర్జార్జునుడు మహర్షి దగ్గరున్న ధేనువు మహత్యం గురించి తెలుసుకుని ఆ ధేనువు కావాలని అడుగుతాడు. కానీ మహర్షి అందుకు తిరస్కరిస్తాడు. దీంతో కోపాద్రిక్తుడైన ఆ రాజు జమదగ్ని ఆశ్రమాన్ని సంహరించి, ఆ ధేనువును తీసుకుని వెళ్లిపోతాడు.

జడల రామలింగేశ్వరస్వామిఆ సమయంలో పరశురాముడు పరశువు (దొడ్డలి)తో కార్త వీర్జార్జునుని సంహరించి, ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణలు చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. ఇలా క్షత్రియులను సంహరించిన తరువాత పరశురాముడు తాను చేసిన పాపాలకు పరిహార్థంగా దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్టించాడు.

జడల రామలింగేశ్వరస్వామిఒక్కొక్క లింగం దగ్గర కొన్ని వేల సంవత్సరాలవరకు తపస్సు చేసేవాడు. అలా పొందిన తపోఫలాన్ని క్షేత్రానికి ధారపోసి, మానవ కల్యాణానికి పాటుపడ్డాడు. అలా ఆ విధంగా ప్రతిష్టించిన శివలింగాలలో చిట్టచివరిదైన 108వ శివలింగమే చెరువుగట్టు క్షేత్రంలో వున్న జడల రామలింగేశ్వరుడు.

జడల రామలింగేశ్వరస్వామిఈ లింగం ప్రతిష్టించిన చోట పరశురాముడు ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో పరశురాముడు కోపంతో తన దగ్గరున్న గొడ్డలితో శివలింగం ఊర్థ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై ‘‘నువ్వు ఇంతకాలం తపస్సు చేసిన ఈ ప్రాంతం ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగుతుంది. కలి యుగాంతం వరకు నేనిక్కడే వుండి భక్తులను అనుగ్రహిస్తాను’’ అని చెప్పాడు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది, శివుడిలో ఐక్యం అయినట్టు కథనం.

జడల రామలింగేశ్వరస్వామిఆలయ విశేషాలు :

నల్గొండ జిల్లాలో వున్న అతి పురాతనమైన ఆలయాల్లో జడల రామలింగేశ్వరస్వామి ఆలయం ఎంతో పేరుగాంచింది. నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ స్వామివారి ఆలయం వుంది. క్షత్రియులను వధించిన తరువాత తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్టించాడు. అందులో చివరిదే ఈ రామేశ్వర లింగమని స్థలపురాణంలో పేర్కొనబడింది.

జడల రామలింగేశ్వరస్వామిపరశురాముడు తన గొడ్డలితో రామలింగేశ్వరుని ఊర్థ్వభాగంలో దెబ్బతీసిన చోట జడల వంటి నిర్మాణాలు వుండటం వల్ల ఈ స్వామిని జడలరామలింగేశ్వరస్వామి అని అంటారు.

 

SHARE