జలపాతాన్ని ఆనుకొని నిర్మించిన అద్భుతమైన ఆలయం

మన దేశంలో నది తీరంలో వెలిసిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ ఆలయం మాత్రం అన్నిటికి భిన్నంగా జలపాతాన్ని అనుకోని ఉంది. ఇలాంటి అద్భుతం దేశంలో మరే ఇతర ప్రదేశాల్లో మనకి కనిపించదు. ఇక్కడి ఆలయంలోకి వెళ్లాలంటే జలపాతంలో తడవాల్సిందే. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mehta Ghatarani

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జట్ మయి ఆలయం ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభువు అని చెబుతారు. కొన్ని వందల అడుగుల ఎత్తులో ఘటరా జలపాతం మొదలయ్యే దగ్గర ఈ ఆలయం ఉంది. అయితే ఎంతో అందంగా ఉండే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది ఇప్పటికి స్పష్టమైన ఆధారాలు అనేవి లేవు.

Mehta Ghatarani

ప్రకృతి అందాల నడుమ దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన ఈ ఆలయం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. జలపాతం నుండి జాలువారే నీటిలో తడుస్తూ వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ నీటిలో తడవడం వలన చేసిన పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయ దర్శనం అనేది కొంచం కష్టంతో కూడుకున్నది.

Mehta Ghatarani

ఈ ఆలయం ఎనిమిది స్థంబాల ఆధారంగా పూర్తిగా గ్రానైట్ తో నిర్మించారు. ఇలా ప్రకృతి అందాల నడుమ ఉన్న ఈ అద్భుత ఆలయాన్ని దర్శించడానికి సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇక ఈ ఆలయం 1600 అడుగుల ఎత్తులో ఉండగా ప్రధాన ఆలయానికి దిగువన అర కిలోమీటర్ దూరంలో కొండ దిగువన బంబ్లేశ్వరి ఆలయం ఉంది. ఈ ఆలయంలో మాతా బంబ్లేశ్వరి కొలువై ఉన్నది. దుర్గామాతే ఈ బంబ్లేశ్వరి దేవిగా అవతరించిందని భక్తుల నమ్మకం.

Mehta Ghatarani

ఈవిధంగా ఒక పక్క అబ్బురపరిచే జలపాతం, మరో పక్క అమ్మవారి ఆలయం రెండు ఒకే దగ్గర ఉన్న ఈ అరుదైన ప్రాంతాన్ని ఒక్కసారైనా చూసి తీరాల్సిందే అనేంతగా ఇక్కడి ప్రకృతి మనల్ని మంత్రముగ్దల్ని చేస్తుంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR