కళుగోళ శాంభవి దేవి ఎక్కడ వెలిసింది, ఆ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా ?

పార్వతి దేవికి ప్రతిరూపంగా వెలిసిన అమ్మవారే కళుగోళ శాంభవి దేవి. మరి శాంభవి దేవి ఎక్కడ వెలిసిందో, ఆ ఆలయ విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలి పేరు తెలుగువారందరికీ సుపరిచితమే. తెలుగు రాష్ట్రావతరణకి కారకులైన స్వర్గీయ పొట్టి శ్రీరాములుగారి ఊరది.

Unknown Facts About Kalugola Shambhavi Deviనెల్లూరు జిల్లాలో కావలి రెండవ పెద్ద పట్టణం. ఈ పట్టణాన్ని మొదట్లో కనక పట్టణం అని పిలిచేవారు. క్రీ.శ. 1515 లో ఉదయగిరి రాజు హరిహరరాయలు తమ సైన్యాన్ని కాపలా కోసం ఇక్కడ వుంచాడు. అప్పటినుంచీ ఈ ప్రదేశం పేరు కావలి (కాపలా) అయింది. బంగాళాఖాతానికి 8 కి.మీ. ల దూరంలో వున్న ఈ పట్టణం హోల్ సేల్ బట్టల వ్యాపారానికి, వ్యవసాయానికే కాదు, పురాతన ఆలయాలకి కూడా ప్రసిధ్ధిచెందింది.

Unknown Facts About Kalugola Shambhavi Deviవాటిలో ఒకటి కావలివాసుల ఆరాధ్య దైవం కళుగోళ శాంభవీ దేవి ఆలయం. ఈ ఆలయంలో వున్న అమ్మవారి శాసనం ప్రకారం, ఈ తల్లి సుమారు 500 సం. ల క్రితం కావలి మండలంలోని సర్వాయపాలెం గ్రామంలో రైతు రామిరెడ్డిగారి కుటుంబంలో రాగుల బుట్టలో వెలిసిందట.

Unknown Facts About Kalugola Shambhavi Deviకళుగోళ శాంభవీ దేవి గ్రామంలో వారికి స్వప్నంలో కనిపించి తాను పార్వతీ అంశ అయిన శాంభవీ దేవిననీ, తనని కోడి కూత, రోకటి పోటు వినబడని దూర ప్రాంతంలో ప్రతిష్టించమని చెప్పింది. సర్వాయపాలెం గ్రామ పెద్దలు, అక్కడికి 3 కి.మీ. ల దూరంలో వున్న కావలి గ్రామ పెద్దలు సంప్రదించుకుని, కావలి పట్టణానికి పడమటివైపు, అప్పట్లో కీకారణ్యంలా వుండే ఈ ప్రదేశంలో అమ్మవారిని ప్రతిష్టించారు.

Unknown Facts About Kalugola Shambhavi Deviనిత్య పూజలేకాక, పర్వ దినాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 12 సంవత్లరాలకొకసారి తిరునాళ్ళు జరుగుతుంది. ఈ తిరణాలకి లక్షమంది పైగా ప్రజలు హాజరవుతారు. ఇక్కడ జంతు బలులు కూడా జరుగుతాయి. అందుకని అర్చకులుగా విశ్వ బ్రాహ్మణ కుటుంబంవారిని, అష్టోత్తర, సహస్రనామ, వగైరా నిత్య పూజలకు బ్రాహ్మణ పూజారులను నియమించారు. అత్యంత మహిమాన్వితురాలైన ఈ దేవి పార్వతీ దేవి అంశ అని ప్రతీతి.

Unknown Facts About Kalugola Shambhavi Deviమహా మహిమాన్వితమైన తల్లిగా, భక్తుల పాలిట కల్పవల్లిగా కావలి వాసులకు అత్యంత ప్రియమైన దేవతగా పూజలందుకుంటుంది. కావలిలో ఏమి చూడాలని ఎవరిని అడిగినా, ముందుగా చెప్పేది శాంభవి దేవి ఆలయం పేరు. ఆలయం ఈ ప్రాంతంలో మాత్రమే దొరికే బొంతరాయితో నిర్మింపబడిన బలిష్టమైన ఆలయం.

Unknown Facts About Kalugola Shambhavi Deviఆలయం లోపల ప్రదక్షిణ మార్గంలో అష్టాదశ శక్తి పీఠాలు, దుర్గామాత స్వరూపాలు తెలిపే అందమైన, రంగు రంగుల విగ్రహాలు, వినాయకుడి ఉపాలయం వున్నాయి. గర్భాలయంలో కొలువు తీరిన కళుగోళ శాంభవిని దర్శించినంతనే భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతాము.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR