నందిలేని శివాలయం ఎక్కడ ఉందో తెలుసా?

ఏ శివాలయంలో అయినా లింగానికి ఎదురుగా నందిని ప్రతిష్టిస్తారు. కానీ ఒక్కచోట మాత్రం లింగం ముందు నంది ఉండదట. అదే కాశీ విశ్వేశ్వర ఆలయం. దేశంలో ఉన్న జ్యోతిర్లింగాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ఒకటి. అయితే ఇక్కడ మిగతా శివాలయాలకు భిన్నంగా లింగానికి ఎదురుగా నంది ఉండదు. మరి ఈ ఒక్క శివాలయంలోని నంది ఎందుకు ప్రతిష్ఠించ లేదు? అందుకు ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే. ఉన్నాయని చెప్పవచ్చు. ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాం.

Kasi Vishweswara Templeభారతదేశంపై దండెత్తిన ఔరంగజేబు ఆలయాల అన్నింటినీ ధ్వంసం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇలా దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు అని కూల్చి వేసాడు. ఔరంగజేబు అతని సైన్యం కాశీ విశ్వేశ్వర దేవాలయం పై కూడా దండెత్తారు. కాశీ విశ్వేశ్వర దేవాలయం ధ్వంసం చేయడం మొదలు పెట్టగానే, అక్కడ ఆలయ ప్రధాన అర్చకుడు స్వామివారి శివలింగాన్ని తీసుకెళ్ళి పక్కగా ఉన్న బావిలో పడేశారు. ఆలయ ప్రధాన ద్వారాన్ని దాదాపుగా కూల్చేశారు. కానీ కొద్ది భాగం శిథిలాలుగా మారాయి. ఆ శిథిలాల పైనే ఇప్పటి జ్ఞాన్ వాపి మసీదు నిర్మించారు.

Kasi Vishweswara Templeఅయితే ఆలయాన్ని ధ్వంసం చేయక ముందు స్వామివారి శివలింగానికి ఎదురుగా నంది ఉండేది. కానీ ఔరంగజేబు ధ్వంసం చేసే సమయంలో ఆ నందీశ్వరుని విగ్రహాన్ని ధ్వంసం చేయలేదు. ఆ నంది ఇప్పటికి కూడా పాత ఆలయ ప్రాంగణంలో ఉంది. తరువాత ఆ బావి నుండి శివలింగాన్ని వెలికితీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ శివలింగం బయటపడలేదు. దాంతో చేసేదేమీ లేక ఆ లింగం ఉన్న రూపంలో కొత్త లింగాన్ని తయారుచేసే నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు.

Kasi Vishweswara Templeఅయితే కాశీవిశ్వేశ్వరుని దర్శించుకునే ప్రతి ఒక్కరూ పాత శివాలయంలో నందీశ్వరుని కూడా తప్పకుండా దర్శించుకుంటారు. అలాగే పక్కన ఉన్న బావిలో శివలింగం ఉందనే నమ్మకంతో ఆ బావికి కూడా పూజలు చేసి దర్శించుకుంటారు. ఆ బావిలోని నీటిని మహా తీర్థ ప్రసాదం గా భావిస్తారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR