సూర్యాస్తమయం తర్వాత ఈ గుడిలో అడుగుపెడితే రాళ్ళూగా మారిపోతారు

0
290

ప్రపంచములో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. వాటన్నింటిని చూసి రావాలంటే ఈ జన్మ చాలదు. మనకు తెలియని విషయాలు, వింతలు వీటిచుట్టూ అప్పటికీ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. కాలానుగుణంగా ఈ దేవాలయాలు కొంత కాలం స్తబ్దుగానే ఉన్నా ఈ మధ్య వెలుగులోకి వస్తున్నాయి. దాంతో పర్యాటకులు అక్కడికి వెళ్లి ఆ వింతలేంటో, విశేషాలేంటో తెలుసుకొని వస్తున్నారు. కొన్ని వింతలు మాత్రం ఇప్పటికీ రహస్యాలుగానే ఉన్నాయి. ఎన్నేళ్ళైనా వీటిలో మార్పు రావటం లేదు. అలాంటి విచిత్రమైన దేవాలయాలలో రాజస్తాన్ లోని కిరడు దేవాలయం ఒకటి.

Kiradu Historical Templeరాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో కిరడు దేవాలయం కలదు. ఇది జైసల్మీర్ కు 157 కిలోమీటర్ల దూరంలో థార్ ఎడారిలోని ఒక టౌన్ లో ఉంది. ఈ దేవాలయంలో సూర్యాస్తమయం దాటిన తర్వాత ఎవ్వరూ లోనికి రారు. రాత్రుళ్ళు నిద్రపోరు. ఒకవేళ ఉంటె వారు రాళ్లుగా మారుతారు. కిరడు దేవాలయంలో ఇలా రాళ్లుగా మారటానికి ఒక చిన్న కథ ఉంది.

Kiradu Historical Templeఅదేమిటంటే ఒక సాధువు తన ప్రియ శిష్యులతో కలిసి దేవాలయానికి వచ్చాడట. అతను శిష్యులను దేవాలయంలో వదిలి స్థానికంగా ఉన్న ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళాడట. సాధువు అలాగే అటునుంచి ఆటే రాజ్యంలోని మరికొన్ని ప్రదేశాలను చూడటానికి వెళ్ళాడట. అసలు శిష్యులు ఆలయంలో ఉన్న సంగతే మరిచిపోయాడట.

Kiradu Historical Templeఅలా కొన్ని రోజులు గడిచిపోయాయి. శిష్యులు తిండి దొరక్క ఆ ఎడారి ప్రాంతంలో జబ్బు పడ్డారు. ఊరి వారు ఎవరూ వారికి సహాయపడలేదు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన ఋషి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆగ్రహించి – “రాళ్ళ లాంటి హృదయం కలిగిన స్థానికులను రాళ్లుగా మారిపో”మని శపించాడట.

Kiradu Historical Templeకాగా ఆ ఊరిలో ఒక మహిళ మాత్రం శిష్యులకు సహాయం చేసిందట. దాంతో సాధువు ఆమెకు శాపం వర్తించకుండా చేసాడు. అయితే ఆమెను వెనక్కు తిరగకుండా వెళ్ళమని చెబుతాడు. కానీ మహిళ మాత్రం వెనక్కు తిరిగి చూస్తుంది. దీంతో ఆమె కూడా రాయిగా మారిపోయింది. దీనికి సంబంధించిన ఎటువంటి సైన్టిఫిక్ దాఖలాలైతే లేవుగానీ, ఈ దేవాలయం గురించి తెలిసిన వారు మాత్రం ఇప్పటికీ సూర్యాస్తమయం తర్వాత అటువైపు వెళ్లారు.

Kiradu Historical Templeక్రీ.శ. 12 వ శతాబ్దంలో కిరడు రాజ్యాన్ని సోమేశ్వర్ అనే రాజు పరిపాలించేవాడు. అయన కాలంలోనే ఈ దేవాలయాలన్నీ తురుష్కుల దాడిలో ధ్వంసం అయ్యాయి. ఈ దేవాలయాలను చూస్తే ఎడారిలో కూడా ఇంతటి అద్భుతమైన కట్టడాలు ఉంటాయా ? అని అనిపించకమానదు. ఒకప్పుడు ఇక్కడ చాలా ఆలయాలు ఉండేవట. కానీ ప్రస్తుతం ఐదు ఆలయాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ దేవాలయాలన్నీ అద్భుత శిల్పశైలితో మరియు సోలంకి నిర్మాణ శైలిలో నిర్మించారు.

 

SHARE