కుబేరుడి లంకానగరం రావణుడికి ఎలా సొంతం అయింది?

దేవతల అందరిలో కుబేరునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సిరిసంపదలతో సంపన్నులు అయేందుకు కుబేరున్ని పూజిస్తారు. అయితే కుబేరునికి అంతటి గొప్ప వరం ఎలా వచ్చిందో తెలుసుకుందాం..

Kuberaమొదట కుబేరుడి పేరు వైశ్రవణుడు. లంకా పట్టణానికి అధిపతి. తనపైకి రావణుడు దండెత్తిరావడంతో వైశ్రవణుడు నిర్ఘాంతపోయాడు. వైశ్రవణుడు శివభక్తుడు. అయితేనేం యుద్ధానికి తలపడింది మహా బలవంతుడు. అందుకే ధైర్యం సన్నగిల్లి వైశ్రవణుడు గంగాతీరాన ఉన్న కాశీ నగరానికి పారిపోయాడు.

Ravanaతన ఆపదను తల్చుకుని దుఃఖిస్తూ దృఢ సంకల్పంతో తపస్సు చేశాడు. వైశ్రవణుడి తపో దీక్షకు మహాశివుడు సంతోషించాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. వైశ్రవణుడు చెప్పింది విని, “లంకా పట్టణం చేజారిపోయిందని నువ్వేం దిగులుపడకు.. నీ తపస్సుకు మెచ్చాను. నీకు లంకా పట్టణాన్ని మించిన అందమైన, అద్భుతమైన, అపూర్వమైన నగరాన్ని ప్రాప్తింప చేస్తాను.

Lord Shivaనవ నిధులకూ నువ్వు నాయకుడివి అయ్యేలా వరం ఇస్తున్నాను. ఇకపై నీ పేరు వైశ్రవణుడు కాదు, కుబేరుడు. నీకు అనంతమైన సంపదలు ఇస్తున్నాను. నువ్వు అందరికంటే సంపన్నుడివి అవుతావు. నువ్వు నివసించే నగరం సుబిక్షంగా, సుసంపన్నంగా వర్ధిల్లుతుంది. రావణాసురుని మించిన ధనవంతుడివి కాబోతున్నావు. రాబోయే కాలంలో ధనవంతుల ప్రసక్తి వస్తే అందరూ నీ గురించే చెప్పుకుంటారు..” అంటూ వరం ఇచ్చాడు. ఇప్పటికీ చాలా డబ్బు ఉంది అనే చెప్పదలచుకుంటే కుబేరుడినే తలచుకుంటాం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR