కుందన్ బాగ్ విచస్ లేర్ మిస్టరీ ఏంటో తెలుసా ?

మహానగరంగా పేరున్న హైదరాబాద్ లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఎనో ఉన్నాయి. విశ్వ నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ ఎప్పుడూ ట్రాఫిక్ తో దేశవిదేశాల నుండి వచ్చే పర్యాటకులతో కిటకిటలాడుతు ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు నగరంలోని ప్రముఖ ప్రదేశాలన్నీ పర్యాటకుల తాకిడితో కళకళలాడుతుంటుంది.

కుందన్ బాగ్ విచస్ లేర్క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉండే ఇలాంటి సిటీలో కూడా రాత్రి అయితే దడ పుట్టించే కొన్ని భయంకరమైన మిస్టీరియస్ ప్రదేశాలు ఉన్నాయి. మిస్టీరియస్ ప్రదేశాలు లేదా దెయ్యాలు తిరిగే ప్రదేశాలు అనగానే చాల మంది భయపడతారు. కొందరు అసలు అలాంటివి ఏమి ఉండవు అని కొట్టి పారేస్తారు. కానీ కొంతమంది తమకు తమకు దెయ్యాలు కనిపించాయి అంటూ తమ చేదు అనుభవాలు చెప్పి గజగజ వణుకుతుంటారు.

కుందన్ బాగ్ విచస్ లేర్అలాంటి ఒక మిస్టీరియస్ ప్రదేశమే కుందన్ బాగ్ విచస్ లేర్. కుందన్‌బాగ్ హైదరాబాద్‌లో ఒక నాగరిక ప్రాంతం. ఎప్పుడు జనాలు తిరిగే ప్రదేశం. అలాంటి కుందన్ బాగ్ లోని ఒక ఇంట్లో ఒక తల్లి తన ఇద్దరు కూతుర్లు నివసిస్తూ ఉండేవారు. అయితే రాత్రైతే చాలు ఆ ముగ్గురు కొవ్వత్తులు పట్టుకొని ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు. వారి ఇంటి ముందు రక్తంతో నిండిన ఒక బాటిల్ కూడా ఉండేదట. ఇవన్నీ చుసి భయపడిన ఇతర నివాసితులు వారికి కొంత దూరంగా ఉండేవారు.

కుందన్ బాగ్ విచస్ లేర్అయితే ఈ విషయాలు ఏమి తెలియని ఒక దొంగ ఒక రోజు ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. మంచం మీద పది ఉన్న మూడు కుళ్లిపోయిన డెడ్ బాడీలు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కానీ స్థానికులు ఆ తల్లి, ఇద్దరు పిల్లల్ని మొన్న మొన్ననే వీధిలో తిరుగుతుంటే చూశామని చెబుతున్నారు. అయితే డెడ్ బాడీల పోస్టమోర్టమ్ రిపోర్ట్ లో వాళ్లు ఆరు నెలల క్రితం చనిపోయారు అని తేలడంతో ఇన్ని రోజులు తాము చూసింది దెయ్యాల్ని అని తెలుసుకున్న స్థానికులు ఖంగుతిన్నారు. అప్పటి నుండి ఆ వైవు అస్సలు ఎవ్వరు వెళ్లే సాహసం చేయలేదు. ఇప్పటికీ స్థానికులకు అటుగా వెళ్లాలంటే భయపడుతూనే ఉంటారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,680,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR