విష్ణుమూర్తి కూర్మావతారంని ఎలా చాలించాడో తెలుసా

“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రణాయ సాధనం వినాశయ దస్కృతం
ధర్మ సంస్థాపనార్థాయ సంభావామి యుగే యుగే”

అధర్మం నాలుగు పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై అవతారలెత్తుతూ ధర్మాన్ని రక్ష్మిస్తాడు. మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. ఇందులో మొదటి అవతారం మత్స్యావతారం. అంటే చేప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు. రెండవది కూర్మావతారము, మూడవది వరాహావతారము, నాలుగవది నరసింహావతారము, అయిదవది వామనావతారము, ఆరవది పరశురామ అవతారము, ఏడవది రామావతారము, ఎనిమిదవ అవతారం కృష్ణావతారము తొమ్మిదో అవతారం బలరామావతారం, పదవది కల్కి అవతారం.

Maha Vishnuvuహిందూమత పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారం. కూర్మము అంటే తాబేలు. దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.

కూర్మావతారంఅయితే హిందూ సాంప్రదాయంలో ఎటువంటి కార్యం చేసినా ఆటంకాలు రాకుండా ఉండడానికి ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం. ఈ మధనం ప్రారంభించే ముందు దేవతలు, రాక్షసులు తొలి దైవం అయిన విఘ్న రాజైన వినాయకుడిని ప్రార్థించడం మర్చిపోయి ఈ కార్యాన్ని ప్రారంభించారు. అందువల్ల వారి పనికి ఆటంకాలు ప్రారంభమై, మెల మెల్లగా మందరగిరి పర్వతం అంచెలంచెలుగా సముద్రములోకి కృంగి పోయింది. అప్పుడు దేవతలు తమ తప్పను తెలుసుకొని వినాయకుడిని ప్రార్థించారు. తరువాత కార్య సాధనకై స్థితికారకుడైన హరిని ప్రార్థించారు.

కూర్మావతారం

అపుడు వారిని ఆదుకోవడానికి శ్రీహరి ప్రత్యక్షమై తనలో నఘోడమై ఉన్న శక్తిని బయటకు రప్పించి, దానిని కూర్మం లా అవతరింపచేసి, ఆగిరిని తన మూపుపై ధరించు అని చెప్పాడు. బ్రహ్మాఓడ రూపంలో ఆ తాబేలు ఆ పర్వతాన్ని తన మూపున దాల్చి సముద్రము పైకి తీసుకొచ్చింది. దేవతలు, రాక్షసులు దానిని చిలకడానికి ప్రయత్నించగా ఆ గిరి కదలలేదు. అపుడు తిరిగి వారు కుర్మాన్ని ప్రార్ధించారు. కూర్మావతారంలో ఉన్నవిష్ణుమూర్తి తన శరీరంలో నుండి పది వేల చేతులను మొలిపింప చేసి, ఆ పర్వతాన్ని కదలనీయక పట్టుకోవడంతో క్షీర సాగర మథనం సఫలీకృతమై అమృతం వచ్చింది. అది దేవుళ్ళు తీసుకెళ్లి పోయారు. హరి మోహిని అవతారం ధరించి రాక్షసుల నుండి అమృతాన్ని కాపాడాడు.

కూర్మావతారం దేవతలు వెళ్లిపోయిన తరువాత కూర్మ రూపునికి, భృగు మహర్షి శాపం పెట్టాడు. శాపం కారణంగా మతిమరపు కమ్మేసి గర్వం తో కళ్ళుమూసుకుపోతాయి. తన వల్లనే అమృతం లభించిందని, దేవాసురులకన్న తానే గొప్ప అని, తన వేల చేతులతో సముద్రాన్ని అల్లకల్లోలం చేసి, సప్త సముద్రాలను త్రాగేసింది. సముద్రంలో ఉన్న జీవులన్ని చనిపోయాయి. దాని భీభస్థం భరించ లేక దేవతలు పరమ శివుని శరణు కోరారు.

కూర్మావతారందానితో ఆ కుర్మాన్ని అణచివేయడానికి తన పుత్రులు సమర్థులని, శాస్తావారిని, స్కందుని పంపారు. అహంకారంతో పెద్దగా నవ్వుతున్న కుర్మాన్ని చూసిన సుబ్రహ్మణ్యుడు, తన అమూల్య శక్తితో దాన్ని మూర్ఛపోయేలా చేసాడు. దాని బలమంతా ఆ చిప్పలో ఉందని గ్రహించిన శాస్తా ఆ కుర్మాన్ని ఒడ్డుకు లాక్కొనివచ్చి వెల్లకిలా వేసాడు. తరువాత ఒక పెద్ద రోకలి బండతో సహోదరులిద్దరు దానిని చితక బాది, చిప్పను వేరు చేసారు. నిజ శక్తిని తెలుసుకున్న ఆ నారాయణ స్వరూపం, తన కూర్మావతారం ముగించి వైకుంఠం చేరాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR