కుర్సియాంగ్ కొండ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

0
275

ఈ భూమి మీద మనకు తెలియని ఎన్నో వింతలూ విశేషాలు ఉన్నాయి. భయాన్ని కలిగించే ప్రదేశాలు ఉన్నాయి. అందమైన, అరుదైన ప్రదేశాలు ఉన్నాయి. అందమైన ప్రదేశాల గురించి, వింతలూ విశేషాల గురించి ఇప్పటివరకు మనం చూసాం. అయితే, భయాన్ని కలిగించే ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో, అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Kursiang Hillఎక్కడో వేరే దేశాలలో ఎందుకు, స్వయానా మనదేశంలోనే చెప్పలేనన్ని గుండె దడ పుట్టించే అతి భయంకర ప్రదేశాలున్నాయి. అతీంద్రియ శక్తులకు నిలయమైన భారతదేశంలో చాలా ప్రదేశాలు దయ్యాలతో ముడిపడి ఉన్నాయి. భారతదేశంలో చాలా ప్రదేశాలను దాని చరిత్ర మరియు కొన్ని సంఘటనల ఆధారంగా ఒక ‘హాంటెడ్ ప్రదేశం’గా పరిగణిస్తారు. పారానార్మల్ నిపుణులు కూడా భారతదేశంలో కొన్ని హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయని అంగీకరించారు.

Kursiang Hillఅలాంటి ప్రదేశాలలో ఒకటే కుర్సియాంగ్ కొండ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రకృతి ఒడిలో, వృక్షాలతో నిండిన పర్వతాలు, పచ్చని టీ తోటలు మందపాటి అడవులతో నిండి వున్న ఒక పర్వత కేంద్రం కుర్సియాంగ్. దీన్నే ‘ఆర్కిడ్ల భూమి’ అని కూడా అంటారు. ఇది ఒక చీకటి ప్రాంతం. భారతదేశంలో అత్యంత భయకరమైన ప్రదేశాలలో ఇది ఒకటి. కుర్సియాంగ్ కొండ పై పారానార్మల్ కార్యకలాపాలు జరుగుతున్నాయని అక్కడి వారు చెబుతుంటారు.

Kursiang Hillకుర్సియాంగ్ దగ్గర ఉన్న పాఠశాల మరియు అడవి ఒక హాంటెడ్ ప్రదేశాలుగా పరిగణించబడుతున్నాయి. డార్జిలింగ్ దగ్గర గల హిల్ స్టేషన్ లో ఒక రహస్యమైన ప్రదేశంలో ఒక నీడ, తల లేని శవం గురించిన వార్తలు ఒక వింత అనుభూతి కలిగిస్తాయి. కొండ రోడ్డుకు అటవీ కార్యాలయానికి మధ్యన ఒక చిన్న స్ట్రెచ్ రోడ్ వస్తుంది. దీనిని మరణ రహదారి అంటారు. అక్కడి వివరాల ప్రకారం రక్తం కారుతూ వున్న ఒక తల లేని యువకుడు తరచూ రోడ్డు మీద నడుస్తూ అడవుల్లోకి వెళ్లి కనుమరుగావుతుంటాడని అంటారు.

Kursiang Hillఅంతేకాదు ఇక్కడ ప్రజలు కూడా మచ్చలతో బూడిద బట్టలతో ఎరుపు రంగు కళ్ళు కలిగిన ఒక మహిళ చుట్టూ తిరుగుతూ ఒక క్షణం వుండి మాయమవుతుందని చెప్తారు. ఈ అడవులలో ఒక్క క్షణం కనిపించి మాయమైన వారిని చూసి కొంతమంది పిచ్చి వాళ్లయిపోయారు. మరికొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు.

Kursiang Hillఇక కుర్సియాంగ్ దగ్గర ఉన్న పాఠశాలలో డిశంబర్ మార్చి నెలల్లో అడుగుల శబ్దం వినిపిస్తుంది. అయితే ఇవన్నిటి వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి అనేది ఇంత వరకు ఎవరూ నిరూపించలేకపోయారు.

SHARE